Mahesh Babu: ‘జై బాబు’.. పెళ్లి కార్డుపై హీరో మహేష్ .. ఫొటోస్ ఇదిగో
సాధారణంగా పెళ్లి కార్డు తమ ఇష్ట దేవుళ్ల ఫొటోలను వేయిస్తారు. అయితే ఒక యువకుడు తన పెళ్లి కార్డ్ పై దేవుళ్ల ఫొటోతో పాటు స్టార్ హీరో మహేష్ బాబు ఫొటో ప్రింట్ వేయించాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతున్నాయి.

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కేవలం సినిమాలతోనే కాదు తన సామాజిక సేవా కార్యక్రమాలతోనూ అందరి మన్ననలు అందుకుంటున్నాడీ సూపర్ స్టార్. ముఖ్యంగా గుండె సంబంధిత వ్యాధులతో బాధ పడుతున్న చిన్నారులకు ఉచితంగా హార్ట్ సర్జరీలు చేయించి వారి తల్లిదండ్రుల కళ్లల్లో ఆనందాన్ని నింపుతున్నాడు. ఇప్పటికే మహేష్ బాబు ఫౌండేషన్ ఆధ్వర్యంలో సుమారు 4500 మందిక పైగా పిల్లలకు ఉచితంగా హార్ట్ సర్జరీలు చేయించాడు మహేష్. దీంతో పాటు తన సొంతూరులో పలు మంచి కార్యక్రమాలు చేపడుతున్నాడీ స్టార్ హీరో. ఇదే మహేష్ కు ఎనలేని అభిమానులను తెచ్చిపెట్టింది. ఈ క్రమంలో ఒక యువకుడు మహేష్ బాబు పట్ల వినూత్నంగా తన అభిమానాన్ని పంచుకున్నాడు. ఏకంగా తన పెళ్లి కార్డుపై మహేశ్ బాబు ఫొటో ప్రింట్ చేసి ఊరంతా పంచడం మొదలుపెట్టాడు.
కర్నూలు జిల్లాకు చెందిన సాయి చరణ్ అనే వ్యక్తి మహేశ్ బాబుకు వీరాభిమాని. మహేశ్ బాబు ఫ్యాన్ క్లబ్‌లో చురుగ్గా ఉంటున్నాడు. మహేష్ బాబు సినిమా విడుదలైనా, పుట్టిన రోజైనా లేదా వేరే ప్రత్యేక సందర్భమేదైనా మహేశ్‌పై తన అభిమానాన్ని చాటుకుంటున్నాడు. ఈ క్రమంలోనే ఈసారి తన పెళ్లి కార్డుపై తన అభిమాన హీరో ఫొటో ప్రింట్ చేయించాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరలవుతున్నాయి. దీంతో ఒక్కసారిగా మహేశ్ ఫ్యాన్స్ అంతా ఈ పెళ్లి కార్డును వైరల్ చేస్తున్నారు వీటిని చూసిన అభిమానులు, నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.
పెళ్లి కార్డుపై మహేష్ బాబు ఫొటో..
My wedding card 😍 @urstrulyMahesh jai babu 💥#SSMB #DHFM #SSMB29 pic.twitter.com/eujUSdhGrf
— Charan MB (@charanchax1) April 24, 2025
ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు మహేష్ బాబు. గ్లోబల్ బ్యూటీ ప్రియాంకా చోప్రా ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే కొంత భాగం ఈ మూవీ షూటింగ్ పూర్తైనట్లు సమాచారం.
భరత్ అను నేను సినిమా రి రిలీజ్ లో మహేష్ ఫ్యాన్స్ హంగామా..
We promised, we planned, and we celebrated! 🔥🔥@prince_baabu@Ajaybabudhfm Thanks to the KPHB fans and everyone who supported us in making this happen! ❤️#BharatAneNenu#BharatAneNenuReRelease #BharathAneNenu pic.twitter.com/v07jKP9qWI
— Mahesh Babu Universe (@MBuniverse_) April 26, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








