AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kaliyugam 2064 : 2064లో ఏం జరగనుంది? భయపెట్టిస్తోన్న కలియుగం సినిమా ట్రైలర్.. రిలీజ్ ఎప్పుడంటే?

శ్రద్ధా శ్రీనాధ్‌, కిశోర్‌ ప్రధానపాత్రల్లో నటించిన తాజా చిత్రం 'కలియుగం-2064'. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్ కు ఆడియెన్స్ నుంచి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.

Kaliyugam 2064 : 2064లో ఏం జరగనుంది? భయపెట్టిస్తోన్న కలియుగం సినిమా ట్రైలర్.. రిలీజ్ ఎప్పుడంటే?
Kaliyugam 2064 Movie
Basha Shek
|

Updated on: Apr 25, 2025 | 4:35 PM

Share

‘జెర్సీ’ ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ ‘డాకు మహారాజ్’ వంటి సూపర్ హిట్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హీరోయిన్ శ్రద్దా శ్రీనాథ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సైన్స్ ఫిక్సన్ అండ్ అడ్వెంచరస్ థ్రిల్లర్ మూవీ ‘కలియుగమ్ 2064’. కిషోర్ కీలక పాత్ర పోషించిన ఈ చిత్రాన్ని ‘ఆర్.కె.ఇంటర్నేషనల్’ సంస్థపై కె.ఎస్. రామకృష్ణ నిర్మించారు. యంగ్ అండ్ టాలెంటెడ్ ప్రమోద్ సుందర్ దర్శకత్వం వహించారు. ద్విభాషా చిత్రంగా రూపొందిన ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ప్రపంచవ్యాప్తంగా మే 9న తమిళ,తెలుగు భాషల్లో ఏకకాలంలో సమ్మర్ కానుకగా విడుదల కాబోతోంది. తెలుగులో ఈ చిత్రాన్ని టాప్ బ్యానర్ అయిన ‘మైత్రి డిస్ట్రిబ్యూషన్’ సంస్థ విడుదల చేస్తుంది. ఇప్పటికే మణిరత్నం లాంచ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ కి విశేషాదరణ లభించింది. ఇక విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ సభ్యులు ప్రచార కార్యక్రమాలు వేగవంతం చేశారు. ఇందులో భాగంగా ట్రైలర్ ను సెన్సేషనల్ దర్శకుడు రాంగోపాల్ వర్మ చేతుల మీదుగా లాంచ్ చేశారు.

ఇవి కూడా చదవండి

ట్రైలర్ లాంచ్ అనంతరం దర్శకుడు రాంగోపాల్ వర్మ మాట్లాడుతూ.. “ఇప్పుడే ‘కలియుగమ్ 2064’ ట్రైలర్ చూశాను. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఆబ్సోల్యూట్లీ ఒక ఫ్యూచరిస్టిక్ ఎక్స్పీరియన్స్ కలిగింది. ఫోటోగ్రఫి,క్యారెక్టర్స్ డిజైన్. ఆర్టిస్టుల పెర్ఫార్మన్స్.. ఇలా అన్నీ ఒక మోడరన్ కైండ్ ఆఫ్ బుక్ చదివిన ఫీలింగ్ ఇచ్చాయి. మే 9న థియేటర్లలో రిలీజ్ అవుతుంది. అందరూ తప్పకుండా చూడండి. ఈ సందర్భంగా చిత్ర బృందానికి నా బెస్ట్ విషెస్ చెబుతున్నాను” అంటూ తెలిపారు.

ఇక ‘కలియుగమ్ 2064’ ట్రైలర్ విషయానికి వస్తే భవిష్యత్తులో ముఖ్యంగా 2064 లో వచ్చే విపత్కర పరిస్థితుల్లో మనుషులు మనుగడ కోసం చేసే పోరాటాన్ని ప్రధానంగా చూపించారు. ఆహారం, నీరు, మానవత్వం అనేవి కరువైనప్పుడు విచక్షణ జ్ఞానం కోల్పోయి మనుషులు ఎలాంటి ఘోరాలకి పాల్పడ్డారు? అనే థీమ్ తో కలియుగంలోని పౌరాణిక ఇతివృత్తాలను గుర్తుచేస్తూ ఈ చిత్రాన్ని రూపొందించారు. విజువల్ ఎఫెక్ట్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అన్ని ప్రేక్షకులను ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకువెళ్ళే విధంగా ఉన్నాయి.ముఖ్యంగా పి.సి.శ్రీరామ్ శిష్యుడు కె.రాంచరణ్ అందించిన సినిమాటోగ్రాఫి టాప్ నాచ్ లో ఉంది. కచ్చితంగా ఈ సినిమా ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతిని కలిగిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు చిత్ర యూనిట్ సభ్యులు.

కలియుగం- 2064 సినిమా ట్రైలర్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us