Irumudi Movie: అందుకే మా సినిమాకు ‘ఇరుముడి’ అని టైటిల్ పెట్టాం.. రవితేజ మూవీ స్టోరీ చెప్పేసిన డైరెక్టర్
మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ సినిమా ఇరుముడి. మజిలి, నిన్నుకోరి వంటి ఫీల్ గుడ్ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు శివ నిర్వాణ ఈ సినిమాను తెరకెక్కించాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

రవితేజ, శివ నిర్వాణ కాంబినేషన్‌లో వస్తున్న ‘ఇరుముడి’ ట్రైలర్ బుధవారం (ఆగస్టు 12) విడుదలైంది. ఇది కేవలం భక్తి సినిమా మాత్రమే కాదని ట్రైలర్‌తోనే అర్థమైపోయింది. ఓవైపు ఫ్యామిలీ ఎమోషన్స్.. మరోవైపు మాస్.. ఇంకోవైపు భక్తి.. మరోవైపు థ్రిల్లర్ ఇలా అన్నింటినీ మిక్స్ చేసారు శివ నిర్వాణ. కాసేపు మందు లేకపోతే పిచ్చెక్కిపోయే ఒక తండ్రి.. కూతురు కోసం ఎంత మారిపోయాడు.. ఏం చేసాడన్నది ఈ సినిమా స్టోరీ అని తెలుస్తోంది. కాగా రవితేజ సినిమాకు ‘ఇరుముడి’ అనే టైటిల్ ఎందుకు పెట్టారన్న దానిపై డైరెక్టర్ శివ నిర్వాణ వివరణ ఇచ్చారు. ఈ సినిమా ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ లో శివ మాట్లాడుతూ.. ‘ఇరుముడి అంటే ఇద్దరి మధ్య పడిన ముడి లేదా రెండు ముడులు. తండ్రి, కూతురు మధ్య ఒక ముడి. అయ్యప్ప స్వామి, ఆయన భక్తుడి మధ్య ఇరు ముడి. ఈ మూవీలో ఉన్న ఒక క్రైమ్ చిక్కుముడి. ఈ మూడు లేయర్స్ ను కలిపి ఇరుముడి టైటిల్ పెట్టాం. ఈ సినిమా శబరిమల యాత్రకు లేదా అయ్యప్ప స్వామి దర్శనానం, ఆధ్యాత్మిక భావనతో రూపొందించిన భక్తి చిత్రం కాదు. కథలో అంతకు మించిన ఒక బలమైన డ్రామా, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. అయ్యప్ప మాల ధారణలో 41 రోజుల అయ్యప్ప దీక్ష అనేది ఒక ముఖ్యమైన భాగం. ఆ దీక్షకు ముందు హీరో జీవితంలో ఏం జరిగింది? దీక్ష సమయంలో ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయి? అనే అంశాలే ఈ కథ లో ముఖ్యభాగం. ఈ సినిమా కథ నెమ్మదిగా మొదలై, సీట్ అంచున కూర్చోబెట్టే క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్‌గా మారి ఆడియన్స్‌కు మైండ్ బెండింగ్ ఫీల్‌ను అందిస్తుంది. కథలో తర్వాత ఏం జరగబోతోందనే క్యూరియాసిటీ ఆద్యంతం ప్రేక్షకుడిని వెంటాడుతూనే ఉంటుంది. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో పాటు డీప్ ఎమోషన్స్ ఉన్న సినిమాలు కోరుకునే వారికి ‘ఇరుముడి’ ఒక ఫీస్ట్ లా అనిపిస్తుంది’ అని డైరెక్టర్ చెప్పుకొచ్చారు.
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఇరుముడి సినిమాను నిర్మిస్తున్నారు. రవితేజ సరసన ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే సాయికుమార్, అజయ్ ఘోష్, రమేష్ ఇందిర, స్వాసిక కీలక పాత్రలు పోషిస్తున్నారు. అలాగే ఈ సినిమాలో రవిజేత కూతురిగా నక్షత్ర అనే ఓ చిన్నారి నటిస్తోంది. కోలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాశ్ కుమార్ ఈ సినిమాకుసంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన సాంగ్స్, టీజర్స్, రీసెంట్ గా ట్రైలర్ కు అభిమానుల నుంచి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ మోస్ట్ అవైటెడ్ మూవీ ఆగస్టు 21న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




