2011లో 'కెరటం' సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టినప్పటికీ, 2013లో వచ్చిన 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్' చిత్రం ఆమె కెరీర్‌ను మలుపు తిప్పింది.
ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించడంతో రకుల్‌కు వరుస అవకాశాలు వరించాయి. తక్కువ సమయంలోనే తెలుగులోని స్టార్ హీరోలతో నటించి టాప్ హీరోయిన్‌గా నిలిచింది.
లౌక్యం, కరెంట్ తీగ, పాండవులు పాండవులు తుమ్మెద, కిక్ 2, బ్రూస్ లీ, నాన్నకు ప్రేమతో, సరైనోడు, ధృవ, రారండోయ్ వేడుక చూద్దాం, స్పైడర్.
నాన్నకు ప్రేమతో, సరైనోడు, ధృవ' వంటి వరుస హిట్ చిత్రాలతో టాలీవుడ్ గోల్డెన్ లెగ్‌గా గుర్తింపు తెచ్చుకుంది. యారియాన్ సినిమాతో హిందీలో అడుగుపెట్టింది.
'దే దే ప్యార్ దే', 'మర్జావాన్', 'రన్‌వే 34', 'డాక్టర్ జి', 'ఛత్రీవాలి', 'థ్యాంక్ గాడ్' వంటి చిత్రాలలో వైవిధ్యమైన పాత్రలు పోషించి నటిగా మంచి పేరు తెచ్చుకుంది.
2024 ఫిబ్రవరిలో నటుడు, నిర్మత అయిన జాకీ భగ్నానీని రకుల్ ప్రీత్ సింగ్ వివాహం చేసుకుంది. గోవాలో కుటుంబ సభ్యులు, ఆత్మీయుల సమక్షంలో వీరి వివాహం ఘనంగా జరిగింది.
ప్రస్తుతం రకుల్ టాలీవుడ్ కు దూరంగా ఉంటుంది. అలాగే బాలీవుడ్ లోనూ పెద్దగా హిట్స్ అందుకోలేకపోతుంది ఈ అమ్మడు.