AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mega 158: మళ్లీ ‘చిరు లీక్స్’.. బాబీతో చేస్తోన్న సినిమా పేరు చెప్పేసిన మెగాస్టార్.. టైటిల్ అద్దిరిపోయిందిగా

మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ కొల్లి బాబీ (కే.ఎస్.రవీంద్ర) కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. చిరంజీవి బర్త్ డే కానుకగా ఈ మెగా 158 టీజర్ తో పాటు టైటిల్ ను కూడా అనౌన్స్ చేయవచ్చని తెలుస్తోంది.

Mega 158: మళ్లీ 'చిరు లీక్స్'.. బాబీతో చేస్తోన్న సినిమా పేరు చెప్పేసిన మెగాస్టార్.. టైటిల్ అద్దిరిపోయిందిగా
Megastar Chiranjeevi
Basha Shek
|

Updated on: Aug 11, 2026 | 9:47 PM

Share

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం డైరెక్టర్ బాబీ కొల్లి (కే.ఎస్.రవీంద్ర) డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నారు. గతంలో వీరి కాంబోలో వచ్చిన వాల్తేరు వీరయ్య బ్లాక్ బస్టర్ గా నిలిచింది. దీంతో ఈ క్రేజీ ప్రాజెక్టుపై భారీ అంచనాలు ఉన్నాయి. మెగా 158 (వర్కింగ్ టైటిల్) పేరుతో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో మలయాళం హీరోయిన్ అనస్వరరాజన్ ఒక కీలక పాత్రలో నటిస్తోంది. అలాగే ప్రియమణి, బండ్ల గణేష్ తదితరులు ఈ మూవీలో లీడ్ రోల్స్ చేస్తున్నారు. తమన్ ఈ సినిమాకు స్వరాలు అందిస్తున్నారు. జన నాయకుడు, టాక్సిక్ వంటి భారీ చిత్రాలను నిర్మించిన కేవీఎన్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌ సంస్థ మెగా 158 సినిమాను నిర్మిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. చిరంజీవి పుట్టిన రోజు (ఆగస్టు 22) సందర్భంగా ఈ మెగా మూవీ టీజర్ తో పాటు టైటిల్ ను కూడా అనౌన్స్ చేయవచ్చని ప్రచారం జరుగుతోంది. అయితే అంతకు ముందే ఈ సినిమా టైటిల్ ను దాదాపు రివీల్ చేశారు మెగాస్టార్ చిరంజీవి.

సాధారణంగా చిరంజీవి తన సినిమాలకు సంబంధించిన అప్ డేట్స్ ను స్వయంగా ఆయనే అభిమానులకు అందిస్తుంటారు. చిరు లీక్స్‌ పేరుతో ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్‌లు ఇవ్వడం ఆయనకు బాగా సరదా. తాజాగా మెగా158 మూవీ టైటిల్‌ కూడా అలాగే లీక్‌ చేశారు మెగాస్టార్. కొరియన్ కనకరాజు సక్సెస్ మీట్ కు హాజరైన చిరంజీవిని మెగా158 అప్డేట్ ఇవ్వమని అడిగింది యాంకర్. దీంతో మైక్ అందుకున్న మెగాస్టార్ తమన్‌ను అడుగుతూ.. సేమ్ టైటిల్‌ కదిరిలాగా అంటూ సగంలోనే ఆపేశారు. దీంతో ఈ మూవీకి టైటిల్‌ కదిరి నరసింహుడు అనే పేరు పెట్టనున్నారని తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. కాగా గతంలో ఈ సినిమాకు కాకాజీ అనే టైటిల్‌ ఫిక్స్‌ చేసినట్లు టాక్ వినిపించిన సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి

వీడియో ఇదిగో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
ఏడాది పాటు నిల్వ ఉండే ఉసిరికాయ పచ్చడి.. పక్కా కొలతలతో
ఏడాది పాటు నిల్వ ఉండే ఉసిరికాయ పచ్చడి.. పక్కా కొలతలతో
చరిత్ర సృష్టించిన సైమన్ హర్మర్.. 130 ఏళ్ల రికార్డ్ బ్రేక్..!
చరిత్ర సృష్టించిన సైమన్ హర్మర్.. 130 ఏళ్ల రికార్డ్ బ్రేక్..!
శివ మాల వేసిన యాంకర్ స్రవంతి.. ఫొటోస్ ఇదిగో
శివ మాల వేసిన యాంకర్ స్రవంతి.. ఫొటోస్ ఇదిగో
శుక్రవారం ఈ చిన్న పనులు చేస్తున్నారా? లక్ష్మీదేవి అనుగ్రహంతో..
శుక్రవారం ఈ చిన్న పనులు చేస్తున్నారా? లక్ష్మీదేవి అనుగ్రహంతో..
ఆ హీరోయిన్ కు పాట పాడితే నా గొంతుకు 2 రోజులు రెస్ట్ ఇచ్చేదాన్ని..
ఆ హీరోయిన్ కు పాట పాడితే నా గొంతుకు 2 రోజులు రెస్ట్ ఇచ్చేదాన్ని..
ఈ 5 రకాల వ్యక్తులతో ఎప్పుడూ శత్రుత్వం పెట్టుకోకండి.. జీవితంలో..
ఈ 5 రకాల వ్యక్తులతో ఎప్పుడూ శత్రుత్వం పెట్టుకోకండి.. జీవితంలో..
3 ఏళ్ల క్రితం వన్డే ప్రపంచకప్ ఫైనల్.. మరి ఇప్పుడేం చేస్తున్నారంటే
3 ఏళ్ల క్రితం వన్డే ప్రపంచకప్ ఫైనల్.. మరి ఇప్పుడేం చేస్తున్నారంటే
'నా కూతురిపై అలాంటి వార్తలు రాస్తారా?'.. అర్జున్ తీవ్ర ఆగ్రహం
'నా కూతురిపై అలాంటి వార్తలు రాస్తారా?'.. అర్జున్ తీవ్ర ఆగ్రహం
లక్నో కెప్టెన్సీ రేసులో ముగ్గురు.. హింట్ ఇచ్చేసిన టామ్ మూడీ..!
లక్నో కెప్టెన్సీ రేసులో ముగ్గురు.. హింట్ ఇచ్చేసిన టామ్ మూడీ..!
కష్టాల్లో ఉన్నప్పుడు ఆ టాలీవుడ్ హీరో నాకు తిండి పెట్టాడు..
కష్టాల్లో ఉన్నప్పుడు ఆ టాలీవుడ్ హీరో నాకు తిండి పెట్టాడు..