AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anupama Parameswaran : 2 ఏళ్లు నరకం చూపించాడు.. మానసికంగా ఎంతో కుంగిపోయాను.. అనుపమ పరమేశ్వరన్..

టాలీవుడ్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇటీవల తన ఇన్ స్టాలో బ్రేకప్, మానసిక ఒత్తడి గురించి పోస్ట్ చేసి ఒక్కసారిగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. ఈమధ్య కాలంలో అనుపమ లవ్, బ్రేకప్ గురించి నిత్యం ఏదోక విషయం చక్కర్లు కొడుతూనే ఉంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన లవ్, బ్రేకప్ గురించి ఓపెన్ అయ్యింది. తన జీవితంలో రెండేళ్లపాటు ఒక విషపూరిత, నార్సిసిస్టిక్ సంబంధంలో చిక్కుకుపోయిన బాధాకరమైన అనుభవాన్ని పంచుకున్నారు.

Anupama Parameswaran : 2 ఏళ్లు నరకం చూపించాడు.. మానసికంగా ఎంతో కుంగిపోయాను.. అనుపమ పరమేశ్వరన్..
Anupama Parameswaran
Rajitha Chanti
|

Updated on: Aug 13, 2026 | 6:55 AM

Share

దక్షిణాది చిత్రపరిశ్రమలో అత్యధిక ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్లలో అనుపమ పరమేశ్వరన్ ఒకరు. తెలుగు, తమిళం, మలయాళం భాషలలో వరుస సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. అయితే ఇటీవల ఈ అమ్మడు పర్సనల్ లైఫ్, లవ్ గురించి సోషల్ మీడియాలో తెగ ప్రచారం నడుస్తుంది. కోలీవుడ్ యంగ్ హీరో ధృవ్ విక్రమ్ తనయుడితో ఆమె కొంతకాలంగా ప్రేమలో ఉందనే టాక్ నడుస్తుంది. వీరికి సంబంధించిన ఫోటోస్ సైతం నెట్టింట వైరల్ అయ్యాయి. అయితే ఆకస్మాత్తుగా బ్రేకప్, మానసిక ప్రశాంతత గురించి అనుపమ పోస్ట్ చేయడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. మీకు మనశ్శాంతి కావాలంటే మీకు అనవసరమైన మార్గాలను వదిలేయాలి అంటూ ఆ పోస్టులో రాసుకొచ్చింది. దీంతో అనుపమ లవ్ లైఫ్ ఏం జరిగిందనే చర్చ మొదలైంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ పాడ్ కాస్ట్ లో పాల్గొన్న అనుపమ.. ఆ పోస్ట్ చేయడానికి కారణాలను, గత కొన్ని నెలలుగా తన జీవితంలో ఏం జరిగిందనే విషయాలను వెల్లడించింది.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : పెళ్లి కాకుండానే కలిసి ఉంటున్నాం.. అప్పుడే విడిపోవాలని అనుకున్నాం.. టాలీవుడ్ నటి..

అనుపమ మాట్లాడుతూ.. “నేను రెండు సంవత్సరాలుగా నార్సిసిస్టిక్ అబ్యూజ్‌ను అనుభవించాను. ఇప్పుడు నేను కొన్ని రకాల వ్యక్తులను ఊహించగలను. ఇప్పుడు నేను కొన్ని రకాల వ్యక్తులను ఊహించగలను. మొదటిది, నా లాంటి వాళ్ళు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక రీల్‌లో మడోనా సెబాస్టియన్ నార్సిసిస్టిక్ అబ్యూజ్ గురించి మాట్లాడటం నేను మొదటిసారి చూసినప్పుడు, దానికి నా స్పందన ఎంత తీవ్రంగా ఉందంటే నేను వణకడం మొదలుపెట్టాను. ఇక రెండవది ఎవరైనా బాధపడటం చూసిన వారి కుటుంబ సభ్యులు , స్నేహితులు. మనం బాధలో ఉన్నామనే విషయం వారికి అర్థం కాదు. ఇంక మూడవ వర్గం ఏదైనా ఉందంటే.. అది ఊహాగానాల ఆధారంగానే మన గురించి ప్రతికూల వ్యాఖ్యలు చేస్తారు. తాము నార్సిసిస్టిక్ అబ్యూజ్ అనే పరిస్థితిని ఎదుర్కొంటూ.. ఇంకా దానిని గుర్తించని వారి గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. అదే అత్యంత ప్రమాదాకరమైన వర్గం. నేను ఆ వ్యక్తి పేరు చెప్పాలి అనుకోవడం లేదు. కానీ ఆ సమయంలో మానసిక, శారీరక క్షోభను అనుభవించాను. ప్రారంభంలో మనపై ఎంతో ప్రేమను కురిపిస్తారు. నా జీవితంలో ఇలాంటి వ్యక్తి దొరకడం నిజమేనా, ఇది కలలా ఉంది అనిపిస్తుంది. కానీ మరుసటి రోజు అదే వ్యక్తి అన్నియన్లా క్రూరంగా ప్రవర్తిస్తారు. కనీసం తల కూడా తిప్పకుండా తీవ్రమైన నిర్లక్ష్యం చూపిస్తారు.

ఎక్కువ మంది చదివినవి : Hemachandra: నేను చేసిన మొదటి తప్పు అదే.. వాటి నుంచి ఎన్నో నేర్చుకున్నాను.. సింగర్ హేమచంద్ర..

ఆ తర్వాత రోజు అంబిలా మారి, పసిపిల్లాడిలా ఏడుస్తూ, వేడుకుంటూ, క్షమాపణ కోరుతూ, మళ్లీ ఇలాంటిది చేయనని ప్రామీస్ చేస్తాడు. మళ్లీ చెప్పలేనంత ప్రేమను కురిపించి.. ఇక తిరిగి అలాంటి ప్రవర్తన చూపిస్తాడు. 3 నెలల పరిచయంలోనే నిశ్చితార్థం, డెస్టినేషన్ వెడ్డింగ్ గురించి మాట్లాడారు. కానీ నా వృత్తిని మాన్పించి పూర్తిగా తన కంట్రోల్ లోకి తెచ్చుకోవడానికి చేసిన ప్రయత్నమని గ్రహించి నేను పదే పదే ఎంగేజ్మెంట్ వాయిదా వేస్తూ వచ్చాను. ఒత్తిడి నుంచి బయటపడేందుకు మందులు వాడాల్సి వచ్చింది. నా కెరీర్ లోనే పెద్ద హిట్ అయిన డ్రాగన్ సినిమా ప్రమోషన్స్ కూడా సరిగ్గా చేయలేకపోయాను. ఒకవేళ నేను ఆ వ్యక్తిని పెళ్లి చేసుకుని ఉంటే కచ్చితంగా విడాకులు తీసుకునేదాన్ని” అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం తాను ఆ దశ నుండి బయటపడి, తన ఆనందం, శాంతిని తిరిగి పొందుతున్నానని ఆమె అన్నారు. ఇప్పుడు అనుపమ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

ఎక్కువ మంది చదివినవి :  Tollywood: ఆ సినిమాను ఆ హీరో తప్ప మరెవరు చేయలేరు.. అందుకే నేను రిజెక్ట్ చేశా.. నటుడు సుమంత్..

అనుపమ పోస్ట్..

ఎక్కువ మంది చదివినవి : Cinema : చనిపోయిన అమ్మాయిని వేధించే కుర్రాడు.. ప్రతి 20 నిమిషాలకు ఊహించని మలుపులు.. ఓటీటీని శాసిస్తున్న సినిమా..

Follow Us