ప్రకృతి ఒడిలో హీరోయిన్ యోగాసనాలు.. హిట్టు కొట్టిన రాని ఆఫర్స్..

Rajitha Chanti

Pic credit - Instagram

12 August 2026

గ్లామరస్ కథానాయిక ప్రగ్యా జైస్వాల్ సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉంటూ తన లేటెస్ట్ విశేషాలను అభిమానులతో పంచుకుంటున్న సంగతి తెలిసిందే.

ఫిట్‌నెస్‌కు ఎంతో ప్రాధాన్యమిచ్చే ఈ భామ, తాజాగా తన సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేసిన యోగా ఫోటోలు ప్రస్తుతం నెట్టింట విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

 అందమైన పచ్చని ప్రకృతి, కొండల నడుమ, చల్లటి గాలి వీస్తున్న ప్రశాంతమైన వాతావరణంలో ప్రగ్యా యోగాసనాలు వేస్తూ కనిపించింది. ఈ ఫోటోస్ వైరలవుతున్నాయి.

పచ్చని చెట్లు, కొండల మధ్య ప్రశాంతంగా యోగా చేస్తున్న ఫోటోలను పోస్ట్ చేస్తూ.. "చుట్టూ కొండలు, పచ్చని ప్రకృతి, చల్లటి గాలి మధ్య యోగా.. అద్భుతమైన ఉదయం!" అంటూ రాసుకొచ్చింది.

యోగా , వర్కవుట్స్ పట్ల ప్రగ్యా జైస్వాల్ చూపే శ్రద్ధ, ఆమె ఫిట్‌నెస్ డిసిప్లిన్ ఎంతోమందికి ప్రేరణగా నిలుస్తున్నాయి. షూటింగ్‌లతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ

తన ఆరోగ్యం, మానసిక ప్రశాంతత కోసం క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ఆమె అలవాటు. తాజాగా ఆమె షేర్ చేసిన ఈ ఫోటోలలో ప్రగ్యా మరింత అందంగా ఉంది.

సినిమా కెరీర్ విషయానికి వస్తే, 'కంచె' చిత్రంతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టి తన అందం, అభినయంతో ప్రేక్షకుల మనసు దోచుకుంది ఈ అందాల ముద్దుగుమ్మ.

ఆ తర్వాత నందమూరి బాలకృష్ణ సరసన 'అఖండ' లాంటి భారీ బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం ఈ అమ్మడు సరైన ఛాన్స్ కోసం ఎదురుచూస్తుంది.