AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jabardasth Venky: వారిపై లీగల్ యాక్షన్ తీసుకుంటా.. జబర్దస్త్ వెంకీ స్ట్రాంగ్ వార్నింగ్.. అసలు ఏం జరిగిందంటే?

జబర్దస్త్ స్టార్ కమెడియన్ వెంకీ తాజాగా అనుకోకుండా ఓ వివాదంలో చిక్కుకున్నారు. ఓ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ వెంకీపై కమిట్మెంట్ ఆరోపణలు చేసిందంటూ ఓ టీవీ ఛానల్‌లో టెలికాస్ట్ కావడం సంచలనంగా మారింది. అయితే దీనిపై వెంటనే స్పందించాడు వెంకీ. తనపై వస్తోన్న ఆరోపణలపై ఒట్టి బూటకమని క్లారిటీ ఇచ్చాడు.

Jabardasth Venky: వారిపై లీగల్ యాక్షన్ తీసుకుంటా.. జబర్దస్త్ వెంకీ స్ట్రాంగ్ వార్నింగ్.. అసలు ఏం జరిగిందంటే?
Jabardasth Venky
Basha Shek
|

Updated on: Aug 12, 2026 | 9:15 PM

Share

జబర్దస్త్ కామెడీ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్నవారిలో వెంకీ ఒకడు. తెలంగాణ ప్రాంతానికి చెందిన ఈ నటుడు తన దైన కామెడీ టైమింగ్, జోకులతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్నాడు. ఓ సాధారణ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన వెంకీ టీమ్ లీడర్ దాకా ఎదిగాడు. జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ ప్రోగ్రామ్స్ లో టాప్ కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. కేవలం టీవీ షోస్ లోనే కాదు అప్పుడప్పుడూ సినిమాల్లోనూ మెరుస్తున్నాడీ జబర్దస్త్ కమెడియన్. ఇదిలా ఉంటే తాజాగా ఓ వివాదంలో చిక్కుకున్నాడు వెంకీ. తనను కమిట్మెంట్ అడిగారని ఓ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ఆయనపై ఆరోపణలు చేసిందంటూ ఓ టీవీ ఛానల్‌లో టెలికాస్ట్ కావడం సంచలనం గా మారింది. దీనిపై వెంకీ వెంటనే రియాక్ట్ అయ్యాడు. డైరెక్టుగా ఛానల్‌లోకే వెళ్లి డిబేట్‌లో కూర్చున్నారు. తనకు ఈ వ్యవహారానికి సంబంధం లేదంటూ ఫుల్ క్లారిటీ కూడా ఇచ్చాడు. అంతేకాదు లైవ్‌లోనే సదరు ఇన్‌ఫ్లుయెన్సర్‌తో మాట్లాడి తనపై వస్తోన్న ఆరోపణలు తప్పని నిరూపించుకున్నారు

అయితే ఇప్పటికీ కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ తనపై విష ప్రచారం చేస్తున్నాయంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు వెంకీ. ఈ మేరకు వారికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తూ రీసెంట్ గా మరో వీడియోను రిలీజ్ చేశాడీ జబర్దస్త్ కమెడియన్. ‘నేను ఎలాంటి తప్పూ చేయలేదని అందరూ నమ్మారు. ఈ విషయంలో అందరూ నాకు సపోర్ట్‌గా ఉన్నారు. అందరికీ పేరు పేరునా థాంక్స్. అయితే ఈ ఇష్యూ క్లోజ్ అయినా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఇంకా వరలక్ష్మి గారిది, నాది ఫోటోస్ పెట్టి అసత్య ప్రచారం చేస్తున్నారు. ఈ విషయం ఇంతటితో ఆపేస్తే మంచిది. లేకుంటే వారిపై లీగల్‌గా యాక్షన్ తీసుకుంటాను. దయచేసి ఈ విషయాన్ని ఇంతటితో ఆపేయండి. ఈ సందర్భంగా నేను ముఖ్యంగా థాంక్స్ చెప్పాల్సింది వరలక్ష్మి గారికి. ఆమెకు జరిగిన అన్యాయాన్ని ఆమె ధైర్యంగా చెప్పారు. అయితే కొంతమంది దాన్ని తప్పుగా ప్రచారం చేశారు. రియల్‌గా లైవ్‌లోకి వచ్చి జబర్దస్త్ వెంకీ అలా చేయలేదని చెప్పడం నిజంగా ఆవిడకు హ్యాట్సాఫ్. ప్రతీ ఒక్క ఆడపిల్ల ఎవరికైనా అన్యాయం జరిగితే ధైర్యంగా బయటకు వచ్చి మాట్లాడాలి. అదే సమయంలో కొంతమంది మాత్రం నిజానిజాలు తెలుసుకోకుండా తప్పుడు ఆరోపణలు చేయకూడదు.’ అంటూ హితవు పలికారు జబర్దస్త్ వెంకీ. ప్రస్తుతం ఈ నటుడి వీడియోలు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతున్నాయి.

ఇవి కూడా చదవండి

జబర్దస్త్ వెంకీ వీడియో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us