ఆ స్టార్ట్ హీరో సినిమా కోసం తండ్రితోనే గొడవపడిన ఖుష్బూ!
10-08-2026
Pic credit - Instagram
Phani Ch
దక్షిణాది చిత్రసీమలో తనదైన ముద్ర వేసిన సీనియర్ నటి ఖుష్బూ టాలీవుడ్‌లో విక్టరీ వెంకటేష్ సరసన హీరోయిన్‌గా పరిచయమయ్యారు.
అయితే ఈ ప్రాజెక్ట్ కోసం ఆమె తన తండ్రితోనే పోరాడాల్సి వచ్చిందని తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే!
దిగ్గజ నిర్మాత డి. రామానాయుడు తన కుమారుడు వెంకటేష్‌ను కథానాయకుడిగా పరిచయం చేస్తూ 'కలియుగ పాండవులు' చిత్రాన్ని నిర్మించేందుకు సన్నాహాలు చేశారు.
ఆ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం ఖుష్బూను ఎంపిక చేశారు. అయితే ఆ సమయంలో ఖుష్బూ తండ్రికి ఆమెను సౌత్ సినిమాల్లో నటించడం ఇష్టం లేకపోయింది.
దక్షిణాది చిత్ర పరిశ్రమలో నటించడానికి ఆయన తీవ్రంగా వ్యతిరేకత వ్యక్తం చేయడంతో ఇంట్లో పెద్ద గొడవే జరిగింది.
రామానాయుడు గారితో పాటు ఆయన నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ పై ఉన్న నమ్మకంతో ఎలాగైనా ఈ సినిమాలో నటించాలని ఖుష్బూ గట్టిగా నిశ్చయించుకున్నారు.
అందుకోసం తండ్రి మాటను సైతం ఎదురించి ప్రాజెక్ట్‌కు ఓకే చెప్పి హైదరాబాద్ వచ్చి 'కలియుగ పాండవులు' Shooting లో పాల్గొన్న ఖుష్బూ తెలిపింది.
1986లో విడుదలైన 'కలియుగ పాండవులు' చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించింది. ఈ సినిమా విజయంతో వెంకటేష్, ఖుష్బూ ఇద్దరి కెరీర్‌లు ఒక్కసారిగా మలుపు తిరిగి స్టార్‌లుగా ఎదిగారు.