AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: ఆకుకూర నోట్లో పెట్టుకున్న సింహం.. వెంటనే ఏం చేసిందో చూస్తే నవ్వు ఆపుకోలేరు!

సింహం అంటేనే వేట.. మాంసాహారం.. అడవిలో తనదైన ఆధిపత్యం. అలాంటి సింహం తొలిసారి ఆకుకూర రుచి చూస్తే ఎలా స్పందిస్తుంది? ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో దీనికి సరదా సమాధానం చెబుతోంది. ఆకుకూరను తినగానే సింహం ఇచ్చిన రియాక్షన్ చూసి నెటిజన్లు నవ్వు ఆపుకోలేకపోతున్నారు.

Watch: ఆకుకూర నోట్లో పెట్టుకున్న సింహం.. వెంటనే ఏం చేసిందో చూస్తే నవ్వు ఆపుకోలేరు!
Lion Trying To Eat Vegetable
Balaraju Goud
|

Updated on: Aug 12, 2026 | 9:06 PM

Share

సింహం అంటేనే వేట.. మాంసాహారం.. అడవిలో తనదైన ఆధిపత్యం. అలాంటి సింహం తొలిసారి ఆకుకూర రుచి చూస్తే ఎలా స్పందిస్తుంది? ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో దీనికి సరదా సమాధానం చెబుతోంది. ఆకుకూరను తినగానే సింహం ఇచ్చిన రియాక్షన్ చూసి నెటిజన్లు నవ్వు ఆపుకోలేకపోతున్నారు.

వైరల్ వీడియోలో ఓ సింహం ఎంతో ఆసక్తిగా ఆహారం కోసం ఎదురు చూస్తోంది. మొదట చూస్తే అది తనకు ఇష్టమైన మాంసాహారం కోసం ఎదురుచూస్తున్నట్లే అనిపించింది. అయితే కెమెరా దాని కాళ్లవైపు వెళ్లగానే అసలు విషయం బయటపడింది. సింహం తన పంజాలో ఆకుకూరను పట్టుకుని కనిపించింది. దాన్ని తినేందుకు సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తుంది.

అయితే ఆకుకూరను నోట్లో పెట్టుకున్న వెంటనే సీన్ మొత్తం మారిపోయింది. ఒక్క ముక్క తినగానే సింహం దాన్ని వెంటనే ఉమ్మివేసింది. అంతేకాదు.. ఆ తర్వాత అది పెట్టిన ముఖ కవళికలు అందరినీ నవ్విస్తున్నాయి. ఏదో చేదు పదార్థం తిన్నట్లుగా ముఖాన్ని ముడుచుకుని, అసహనం వ్యక్తం చేసిన తీరు నెటిజన్లకు తెగ నచ్చేసింది. ఈ వీడియోను ‘nvu_india’ అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్ చేశారు. ఈ వైరల్ వీడియోకు భారీగా వ్యూస్, లైక్స్ వస్తున్నాయి. సింహం ఆకుకూర తిన్న వెంటనే ఇచ్చిన రియాక్షన్‌ను చూసి సోషల్ మీడియా వినియోగదారులు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.

“అన్నా.. మన రాజుకు కూరగాయలు ఎవరు ఇచ్చారు?” అంటూ ఓ నెటిజన్ సరదాగా ప్రశ్నించాడు. “సింహం గడ్డి ఎందుకు తినదో ఇప్పుడు అర్థమైంది” అంటూ మరో వ్యక్తి కామెంట్ చేశాడు. ఇంకొకరు “పాపం సింహం.. కూరగాయలతో మృగరాజును ఆటపట్టించారు” అంటూ నవ్వు తెప్పించేలా స్పందించారు. అయితే సింహాలు సహజంగా మాంసాహార జంతువులు. వాటి ప్రధాన ఆహారం మాంసమే. అందుకే ఆకుకూర రుచి వాటికి నచ్చకపోవడం సహజమేనని నెటిజన్లు సరదాగా వ్యాఖ్యానిస్తున్నారు. వీడియోలోని సింహం నిజంగా తొలిసారే ఆకుకూర తిన్నదా లేదా అన్నది మాత్రం స్వతంత్రంగా ధృవీకరించలేము.

నిజం ఏదైనా.. ఆకుకూరను తిన్న వెంటనే సింహం ఇచ్చిన ఆ ఎక్స్‌ప్రెషన్ మాత్రం నెటిజన్లకు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తోంది.

వైరల్ వీడియోను ఇక్కడ చూడండి.. 

View this post on Instagram

A post shared by NVU India (@nvu_india)

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us