స్టార్ హీరోతో ప్రేమలో హీరోయిన్.. పెళ్లి వార్తలపై తల్లి కౌంటర్..
Rajitha Chanti
Pic credit - Instagram
11 August 2026
సినీ ప్రపంచంలో నటీనటుల మధ్య ప్రేమ, పెళ్లి వార్తలు రావడం సహజమే. అయితే కొన్నిసార్లు ఈ గాసిప్స్ తీవ్రంగా ప్రచారంలోకి వచ్చి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి.
తాజాగా సౌత్ ఇండస్ట్రీలో యంగ్ హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శన్ పెళ్లికి సంబంధించిన వార్తలు మరోసారి నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. తాజాగా ఆమె తల్లి కౌంటరిచ్చింది.
మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ కుమారుడు, హీరో ప్రణవ్ మోహన్‌లాల్‌తో కళ్యాణి వివాహం జరగనుందంటూ సామాజిక మాధ్యమాల్లో పుకార్లు షికారు చేశాయి.
అక్కినేని నాగచైతన్య సరసన 'హలో' చిత్రంతో తెలుగు చిత్రసీమలోకి అడుగుపెట్టిన కళ్యాణి ప్రియదర్శన్, ఆ తర్వాత 'చిత్రలహరి', 'రణరంగం' వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకుల ఆదరణ పొందారు.
అనంతరం మలయాళ, తమిళ చిత్ర పరిశ్రమలపై దృష్టి సారించి స్టార్ హీరోయిన్‌గా నిలిచారు. ఇటీవల వచ్చిన మలయాళ చిత్రం 'లోక చాప్టర్ 1: చంద్ర' బాక్సాఫీస్ వద్ద విజయం సాధించింది.
ప్రణవ్ మోహన్‌లాల్, కళ్యాణి ప్రియదర్శన్ చిన్ననాటి నుంచే మంచి స్నేహితులు. 2022లో వీరిద్దరూ జంటగా నటించిన 'హృదయం' చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ విజయాన్ని సాధించింది.
ఆ సినిమాలో వీరి కెమిస్ట్రీ, అలాగే బయట వీరిద్దరూ దిగిన కొన్ని పర్సనల్ ఫొటోలు వైరల్ అవ్వడంతో నిజ జీవితంలోనూ వీరు పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలకు బలం చేకూరింది.
ఈ గాసిప్స్‌పై కళ్యాణి తల్లి, నటి లిస్సీ ప్రియదర్శన్ స్పందించారు. కళ్యాణి - ప్రణవ్‌ల పెళ్లి వార్తలపై ఒక నెటిజన్ చేసిన కామెంట్‌కు స్పందిస్తూ, అవన్నీ పూర్తిగా తప్పుడు వార్తలని స్పష్టం చేశారు.