Jr NTR: సర్జరీ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్.. వారికి ప్రత్యేక అభినందనలు తెలిపిన తారక్
టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ కు ఇవాళ (ఆగస్టు 12) సర్జరీ జరిగిన సంగతి తెలిసిందే. కొన్ని రోజుల క్రితం భుజానికి గాయం కావడంతో హైదరాబాద్ లోని కిమ్స్ ఆస్పత్రిలో బుధవారం తారక్ కు విజయవంతంగా శస్త్ర చికిత్స జరిగింది.

గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ కు శస్త్ర చికిత్స విజయవంతంగా జరిగింది. కొన్ని రోజుల క్రితం భుజానికి గాయం కావడంతో బుధవారం (ఆగస్టు 12) సికింద్రాబాద్ లోని కిమ్స్ ఆస్పత్రిలో తారక్ కు విజయవంతంగా సర్జరీ జరిగింది. ఈ సర్జరీ పూర్తయిన తర్వాత ఎన్టీఆర్ ఆరోగ్యంగా ఉన్నారని కిమ్స్ వైద్యులు ప్రత్యేకంగా హెల్త్ బులిటెన్ కూడా విడుదల చేశారు. ఈ క్రమంలో తన సర్జరీపై స్వయంగా జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు. ఈ మేరకు ఎక్స్ (ట్విట్టర్)లో ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టారు తారక్. ‘మీ అందరి నుంచి వెల్లువెత్తిన ప్రేమ, ప్రార్థనలకు ధన్యవాదాలు. నా కోసం మీరు ప్రార్థనలు చేసినందుకు చాలా కృతజ్ఞుడిని. సర్జరీ విజయవంతమైంది. ఇప్పుడు నేను క్షేమంగా ఉన్నాను. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. స్నేహితులు, కుటుంబం, ఫ్యాన్స్ మద్దతు నాకు ప్రతిరోజు బలాన్ని ఇస్తుంది. త్వరలోనే మళ్లీ కలుద్దాం’ అని ట్వీట్ చేశారు ఎన్టీఆర్. ఈ సందర్భంగా కిమ్స్ ఆస్పత్రి వైద్య బృందానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు తారక్. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. అభిమానులు, నెటిజన్లు రియాక్ట్ అవుతున్నారు. ఎన్టీఆర్ త్వరగా కోలుకోవాలని పోస్టులు పెడుతున్నారు.
కాగా ఎన్టీఆర్ కు గాయమైనప్పుడు మొదట కొద్ది రోజులు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందనుకున్నారు.అయితే గాయం తీవ్రత ఎక్కువగా ఉండడం, భవిష్యత్ లోనూ ఎలాంటి పరిణామాలు తలెత్తకుండా ఉండడానికి సర్జరీ చేయాలని డాక్టర్లు సూచించారు. దీంతో ఎన్టీఆర్ కు శస్త్ర చికిత్స జరిగింది.
ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం డ్రాగన్ సినిమా చేస్తున్నారు ఎన్టీఆర్. కేజీఎఫ్, సలార్ సినిమాలతో పాన్ ఇండియా రేంజ్ లో ఫేమస్ అయిన కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతోన్న ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన లేటెస్ట్ సెన్సేషన్ రుక్మిణీ వసంత్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే నేషనల్ క్రష్ రష్మిక మందన్నా కూడా నటిస్తోందని ప్రచారం జరుగుతోంది.
జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్..
I am overwhelmed by the outpouring of love and prayers from all of you. The surgery was successful and I’m doing well. My heartfelt gratitude to the amazing team of doctors at KIMS. To my friends, family, and fans; your support gives me strength every single day. See you soon!…
— Jr NTR (@tarak9999) August 12, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




