AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆవు నెయ్యి vs గేదె నెయ్యి: మీ శరీరానికి, ఆరోగ్యానికి ఏది మంచిదో తెలుసుకోవటం తప్పనిసరి! లేదంటే..

పూర్వకాలం నుండి మన ఆహారంలో నెయ్యి ఒక ముఖ్యమైన పోషకాహారంగా భాగమైంది. ఇది వంటలకు రుచిని ఇవ్వడమే కాకుండా, శరీరానికి అవసరమైన కొవ్వు ఆమ్లాలు, విటమిన్లను అందిస్తుంది. అయితే, బజారులో దొరికే ఆవు నెయ్యి, గేదె నెయ్యిలలో దేనిని ఎంచుకోవాలి? ఏ నెయ్యి ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తుంది? అనే విషయంలో పోషకాహార నిపుణులు వెల్లడించిన ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు చూద్దాం.

ఆవు నెయ్యి vs గేదె నెయ్యి: మీ శరీరానికి, ఆరోగ్యానికి ఏది మంచిదో తెలుసుకోవటం తప్పనిసరి! లేదంటే..
Cow Ghee Vs Buffalo Ghee
Jyothi Gadda
|

Updated on: Sep 20, 2026 | 11:56 AM

Share

మన భారతీయ వంటకాల్లో నెయ్యికి విశిష్టమైన స్థానం ఉంది. అయితే, మార్కెట్లో లభించే ఆవు నెయ్యి, గేదె నెయ్యి లలో ఆరోగ్యానికి ఏది మేలు చేస్తుంది? అనే సందేహం చాలామందిలో ఉంటుంది. పోషకాహార నిపుణుల ప్రకారం, రెండింటిలోనూ ప్రత్యేకమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కానీ, ఈ రెండింటి మధ్య ఉన్న వ్యత్యాసాలు, మీ శరీరానికి ఏది సరిపోతుందో  నిపుణులు ఏం చెబుతున్నారో వివరంగా తెలుసుకుందాం.

ఆవు నెయ్యి ప్రత్యేకతలు, ప్రయోజనాలు:

ఇది లేత పసుపు రంగులో ఉంటుంది. ఆవు నెయ్యి పసుపు రంగులో ఉండటానికి అందులో ఉండే బీటా-కెరోటిన్, విటమిన్-ఎ కారణం. ఇవి కంటి ఆరోగ్యానికి, చర్మ కాంతికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి ఎంతగానో తోడ్పడతాయి. ఆవు నెయ్యిలో షార్ట్-చైన్ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉండటం వల్ల ఇది జీర్ణవ్యవస్థపై ఒత్తిడి తేకుండా త్వరగా అరిగిపోతుంది. జీర్ణక్రియ సమస్యలు, ఎసిడిటీ ఉన్నవారికి ఇది చాలా మంచిది. గేదె నెయ్యితో పోలిస్తే ఆవు నెయ్యిలో కొవ్వు, కెలరీలు తక్కువగా ఉంటాయి. బరువు తగ్గాలనుకునే వారు, గుండె ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలనుకునే వారు ఆవు నెయ్యిని ఎంచుకోవడం శ్రేయస్కరం.

గేదె నెయ్యి ప్రత్యేకతలు, ప్రయోజనాలు:

గేదె నెయ్యి స్వచ్ఛమైన తెల్లటి రంగులో ఉండి, గట్టి చిక్కదనంతో ఉంటుంది. దీనిని ఎక్కువ కాలం నిల్వ ఉంచుకోవచ్చు. ఇందులో కొవ్వు, కెలరీల పరిమాణం ఎక్కువ. క్రీడాకారులు, వ్యాయామం చేసేవారు, రోజంతా ఎక్కువ శారీరక శ్రమ చేసేవారికి కావలసిన తక్షణ శక్తిని ఇది అందిస్తుంది. బరువు తక్కువగా ఉండి, ఆరోగ్యకరంగా బరువు, కండరాల పరిమాణాన్ని పెంచుకోవాలనుకునే వారికి గేదె నెయ్యి అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే ఇందులోని బాస్పరస్, మెగ్నీషియం ఎముకల బలానికి తోడ్పడతాయి.

ఇవి కూడా చదవండి

మీ ఆరోగ్యానికి ఏది సరిపోతుంది?

ఆవు నెయ్యి ఎంచుకోండి: మీరు తక్కువ కెలరీల డైట్ పాటిస్తున్నట్లయితే, జీర్ణసమస్యలతో బాధపడుతుంటే, లేదా పిల్లలు, వృద్ధుల ఆహారంలో చేర్చాలనుకుంటే ఆవు నెయ్యి ఉత్తమమైన ఎంపిక.

గేదె నెయ్యి ఎంచుకోండి: మీరు బరువు పెరగాలని చూస్తున్నట్లయితే, తీవ్రమైన ఫిజికల్ వర్కవుట్స్ చేస్తుంటే, లేదా సంప్రదాయ తియ్యటి వంటకాల (Sweets) తయారీకి గేదె నెయ్యి చాలా బాగుంటుంది.

రెండింటిలోనూ వాటికి తగిన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కాబట్టి మీ జీవనశైలి, శరీర తత్వం, ఆరోగ్య లక్ష్యాలకు అనుగుణంగా సరైన నెయ్యిని పరిమిత పరిమాణంలో తీసుకుంటూ సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చు.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us