AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రొయ్యల వెనుక ఉన్న నల్లటి నరాన్ని ఎందుకు తొలగించాలి? ఆరోగ్యానికి కలిగే ముప్పు ఎంటో తెలిస్తే..

సముద్రపు ఆహారంలో రొయ్యలకు ప్రత్యేకమైన స్థానం ఉంది. వీటితో చేసే వేపుళ్లు, కూరలు ఎంతో రుచిగా ఉంటాయి. అయితే, రొయ్యలను వండే సమయంలో చేసే ఒక చిన్న పొరపాటు మీ ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుందని మీకు తెలుసా? రొయ్యల వీపు భాగంలో పొడవుగా ఉండే నల్లటి నరాన్ని చాలామంది శుభ్రం చేయకుండానే వండేస్తుంటారు. కానీ, ఆ నల్లటి దారాన్ని తొలగించడం ఆరోగ్య పరంగా ఎంత ముఖ్యామో ఇప్పుడు తెలుసుకుందాం.

రొయ్యల వెనుక ఉన్న నల్లటి నరాన్ని ఎందుకు తొలగించాలి? ఆరోగ్యానికి కలిగే ముప్పు ఎంటో తెలిస్తే..
Black Vein In Shrimp
Jyothi Gadda
|

Updated on: Sep 19, 2026 | 9:11 AM

Share

రొయ్యలు వండేముందు వాటి వెనుక భాగంలో ఉండే నల్లటి నరాన్ని తప్పనిసరిగా తొలగించాలి. చాలామంది దీనిని సాధారణ రక్తనాళం అనుకుంటారు. కానీ ఇది రొయ్యల జీర్ణనాళం.. దీనిని తొలగించకుండా వండితే కూర రుచి చేదుగా మారడమే కాకుండా, ఇతర సమస్యలు కూడా తప్పవు. కాబట్టి ఆరోగ్య భద్రత, రుచి కోసం వండే ముందు నల్లటి నరాన్ని తీసివేసి, రొయ్యలను క్షుణ్ణంగా శుభ్రం చేయడం శ్రేయస్కరం. అసలు ఆ నల్లటి నరం ఏమిటి?

చాలామంది ఆ నల్లటి గీతను రొయ్యల రక్తనాళం అని భావిస్తుంటారు. కానీ, అది రక్తనాళం కాదు, రొయ్యల జీర్ణనాళం. రొయ్యలు సముద్రంలో తినే చిన్న చిన్న పురుగులు, ఇసుక, వ్యర్థ పదార్థాలు ఈ నాళం గుండానే ప్రయాణిస్తాయి. అనగా ఆ నల్లటి నరంలో జీర్ణక్రియకు సంబంధించిన వ్యర్థాలు, ఇసుక నిండి ఉంటాయి.

నల్లటి నరాన్ని తొలగించకపోతే కలిగే అనర్థాలు

కూర రుచి పాడవుతుంది: నల్లటి నరంలో ఇసుక, మురికి ఉండటం వల్ల వంటకం తింటున్నప్పుడు ఇసుక తగిలి అసౌకర్యంగా ఉంటుంది. అంతేకాకుండా ఇది కూర రుచిని చేదుగా మార్చేస్తుంది.

ఇవి కూడా చదవండి

ఫుడ్ పాయిజనింగ్ ముప్పు: రొయ్య జీర్ణనాళంలో హానికరమైన బ్యాక్టీరియా, పరాన్నజీవులు ఉంటాయి. రొయ్యలను సరిగ్గా ఉడికించకపోయినా లేదా ఆ నరాన్ని తీసివేయకపోయినా, ఆ బ్యాక్టీరియా మన శరీరంలోకి చేరి ఫుడ్ పాయిజనింగ్‌కు దారితీస్తుంది.

జీర్ణకోశ సమస్యలు: ఈ వ్యర్థాలను తీసుకోవడం వల్ల కడుపునొప్పి, ఎసిడిటీ, వాంతులు, విరేచనాలు వంటి సమస్యలు వస్తాయి.

రొయ్యలను ఎలా శుభ్రం చేయాలి?:

రొయ్య పైపొర తలను తొలగించాలి. చాకు లేదా టూత్‌పిక్ సహాయంతో రొయ్య వీపు భాగంలో సన్నగా కోత పెట్టాలి. అక్కడ కనిపించే నల్లటి లేదా ముదురు రంగు నరాన్ని బయటకు లాగి వేయాలి. ఆ తర్వాత రొయ్యలను ఉప్పు, నిమ్మరసం లేదా పసుపు వేసి మంచి నీటితో శుభ్రంగా కడగాలి. ఆరోగ్యకరమైన ఆహారం కోసం రొయ్యలను వండేటప్పుడు కాస్త సమయం కేటాయించి ఆ నల్లటి నరాన్ని తప్పక తొలగించండి!

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
వీపుపై చిన్నారితో తల్లి పోరాటానికి సెల్యూట్‌!
వీపుపై చిన్నారితో తల్లి పోరాటానికి సెల్యూట్‌!
కాళ్లకు ఇనుప గొలుసులు, తాళం.. నదిలో ప్రత్యక్షమైన నవదంపతుల శవాలు
కాళ్లకు ఇనుప గొలుసులు, తాళం.. నదిలో ప్రత్యక్షమైన నవదంపతుల శవాలు
హైస్పీడ్‌తో ఉండే విమానం టైర్లు ల్యాండింగ్ సమయంలో ఎందుకు పేలవు?
హైస్పీడ్‌తో ఉండే విమానం టైర్లు ల్యాండింగ్ సమయంలో ఎందుకు పేలవు?
శ్రీవారి సన్నిధిలో ఆర్.పి పట్నాయక్, నటి ఉదయభాను నాది నీరాజనం
శ్రీవారి సన్నిధిలో ఆర్.పి పట్నాయక్, నటి ఉదయభాను నాది నీరాజనం
కాంతివంతమైన చర్మం కోసం అమ్మమ్మల కాలం నాటి సున్నిపిండి తయారీ
కాంతివంతమైన చర్మం కోసం అమ్మమ్మల కాలం నాటి సున్నిపిండి తయారీ
ఈ గాడ్జెట్​ ఉంటే తాళాలు, పర్స్ ఎక్కడ పెట్టారో వెతకాల్సిన పనిలేదు
ఈ గాడ్జెట్​ ఉంటే తాళాలు, పర్స్ ఎక్కడ పెట్టారో వెతకాల్సిన పనిలేదు
తినే కొద్దీ తినాలి అనిపించే మొక్కజొన్న గారెలు..
తినే కొద్దీ తినాలి అనిపించే మొక్కజొన్న గారెలు..
అబ్బాయిల గుండెల్లో ప్రింట్ అయిన బ్యూటీ..
అబ్బాయిల గుండెల్లో ప్రింట్ అయిన బ్యూటీ..
జేసీబీ కొంటే లాభమా..? నష్టమా..? తెరవెనుకున్న షాకింగ్‌ నిజాలు ఇవే!
జేసీబీ కొంటే లాభమా..? నష్టమా..? తెరవెనుకున్న షాకింగ్‌ నిజాలు ఇవే!
నిమ్మకాయ నుంచి ఒక్క చుక్క కూడా వదలకుండా రసం పిండాలా?.. ఇలా చేయండి
నిమ్మకాయ నుంచి ఒక్క చుక్క కూడా వదలకుండా రసం పిండాలా?.. ఇలా చేయండి