మోకాళ్ళల్లో గుజ్జును పెంచే అద్భుతమైన చిట్కా.. ఈ 3 పదార్థాల డ్రింక్ తాగితే అమేజింగ్!
ప్రస్తుత కాలంలో చిన్నవయసు వారిని కూడా మోకాళ్ల నొప్పులు వేధిస్తున్నాయి. పోషకాహార లోపాలు, అధిక బరువు, విటమిన్ డి లోపం, జీవనశైలి మార్పులు ఇందుకు కారణాలు కావచ్చు. మోకాళ్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ఎలాంటి వ్యాయామాలు చేయాలి? సహజ చిట్కాలు నిజంగా పనిచేస్తాయా? నిపుణుల సూచనలు తెలుసుకుందాం.

మోకాళ్ళ నొప్పులు అనేది వయస్సుతో సంబంధం లేకుండా ప్రస్తుత తరంలో సర్వసాధారణంగా మారింది. ఒకప్పుడు పెద్దవారిలో కనిపించే ఈ సమస్య ఇప్పుడు యువకులలోనూ కనిపిస్తోంది. కూర్చున్నా, నిలబడ్డా టక్ టక్ శబ్దాలు రావడం, కీళ్ళలో బరువైన భావన, ఒక అడుగు వేయడానికి బద్ధకించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. చాలా మంది ఎక్సరేలు తీయించుకున్నప్పుడు లిగమెంట్ సమస్యలు, గుజ్జు క్షీణించడం లేదా కీళ్ళ మధ్య వాపు (ఇన్ఫ్లమేషన్) వంటివి బయటపడతాయి. ఈ సమస్యలకు గల కారణాలను, వాటికి సహజసిద్ధమైన పరిష్కారాలేంటి..? వైద్య నిపుణులు ఏం చెబుతున్నారో ఈ కథనంలో తెలుసుకుందాం..
మోకాళ్ళ నొప్పులకు ప్రధాన కారణాలు:
మోకాళ్ళ నొప్పులకు ప్రధాన కారణం పోషకాహార లోపం. దీనితో పాటు, అధిక బరువు, ప్రాసెస్ చేసిన ఆహారం తీసుకోవడం, క్యాల్షియం, విటమిన్ బి12, విటమిన్ డి లోపాలు, రక్తహీనత (ఐరన్ డెఫిషియన్సీ) వంటివి కూడా మోకాళ్ళ నొప్పులకు దారితీస్తాయి. శరీరంలో ఇన్ఫ్లమేషన్ పెరగడం వల్ల కూడా తీవ్రమైన నొప్పులు వస్తాయి.
మోకాళ్ళ గుజ్జును పెంచే పానీయం:
నాలుగు లేదా ఐదు మునక్కాడ ముక్కలు..
పావు స్పూన్ అండు తులసి విత్తనాలు.. అంటే.. మహావీరా విత్తనాలు
పావు స్పూన్ మెంతులు..
ఈ మూడు పదార్థాలను 200 ml నీటిలో రాత్రంతా నానబెట్టాలి. ఉదయాన్నే ఈ మిశ్రమాన్ని కొద్దిగా మరిగించి, ఆ తర్వాత ఫిల్టర్ చేసి తాగాలి. గ్యాస్ సమస్య ఉన్నవారు కొద్దిగా పుదీనా ఆకులను కూడా కలుపుకోవచ్చు. ఈ పానీయం క్యాల్షియం స్థాయిలను పెంచి, కీళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, జాయింట్ పెయిన్స్ ను తగ్గిస్తుంది.
ఆహారం – జీవనశైలి మార్పులు:
మోకాళ్ళ నొప్పుల నివారణకు ఆహారంలో మార్పులు చాలా కీలకం.
ప్రాసెస్ చేసిన నూనెలను మానేసి, గానుగ నూనెలు (ఉదాహరణకు, కుసుమ నూనె) వాడాలి.
మునగాకు, బచ్చలికూర, మెంతికూర, తోటకూర వంటి ఆకుకూరలను రోజూ ఆహారంలో చేర్చుకోవాలి.
జంక్ ఫుడ్ నివారణ: బయటి జంక్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్, ప్రాసెస్డ్ మీట్స్ కు దూరంగా ఉండాలి.
బరువు నిర్వహణ: అధిక బరువు మోకాళ్ళపై తీవ్రమైన ఒత్తిడిని కలిగిస్తుంది. బరువు తగ్గడానికి సమయానికి తగినంత ఆహారం తీసుకోవాలి, అది కూడా తక్కువ పరిమాణంలో. ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో రెండు ఇడ్లీలు, మధ్యాహ్నం భోజనంలో అన్నం తగ్గించి కూరలు ఎక్కువగా తీసుకోవాలి. రాత్రి భోజనం తేలికగా (జొన్న రొట్టె లేదా పుల్కా) సూర్యాస్తమయానికి ముందే పూర్తి చేయాలి. ఆకలితో ఉండటం వల్ల గ్యాస్ సమస్యలు వచ్చి బరువు పెరిగే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
నిద్ర – జీర్ణవ్యవస్థ: మంచి నిద్ర, ఉదయాన్నే సరైన మల విసర్జన కూడా బరువు నియంత్రణకు, తద్వారా మోకాళ్ళ నొప్పుల నివారణకు దోహదపడతాయి.
సహజసిద్ధమైన తైలం..
తీవ్రమైన మోకాళ్ళ నొప్పుల నుంచి ఉపశమనం కోసం.. ఇంట్లో తయారు చేసుకునే సహజసిద్ధమైన ఈ నూనెను కూడా ఉపయోగించవచ్చు..
కావలసినవి: నువ్వుల నూనె, వాము పువ్వు, పుదీనా పువ్వు, కర్పూరం.
తయారీ: 50 గ్రాముల వాము పువ్వు, 50 గ్రాముల పుదీనా పువ్వు, 50 గ్రాముల కర్పూరం తీసుకొని 150 ml నువ్వుల నూనెలో కలపాలి. ఇవి నూనెలో వెంటనే కరిగిపోతాయి.
వాడే విధానం: ఈ నూనెను మోకాళ్ళ పైన, కింద భాగంలో మర్దన చేయాలి. నూనె రాయడానికి ముందు ఒక ఐస్ క్యూబ్ తో మోకాళ్ళ వద్ద రుద్దితే రక్త ప్రసరణ మెరుగుపడి, నూనె ప్రభావం 3 రోజుల్లోనే కనిపిస్తుంది.
వ్యాయామాలు:
చిన్నపాటి వ్యాయామాలు కూడా మోకాళ్ళ ఆరోగ్యానికి చాలా అవసరం. పొద్దున్నే లేవగానే ఒక దిండును మడిచి మోకాళ్ళ కింద పెట్టి, కాళ్లను ముందుకు-వెనక్కి, పక్కలకు, అలాగే క్లాక్‌వైస్, యాంటీ-క్లాక్‌వైస్ దిశల్లో కదపడం వల్ల మోకాళ్ళ కండరాలు బలపడతాయి.
ఈ సహజసిద్ధమైన చిట్కాలు, సరైన ఆహారం, జీవనశైలి మార్పులు, వ్యాయామాలను పాటించడం ద్వారా మోకాళ్ళ నొప్పులు లేకుండా ఆరోగ్యంగా, సంతోషంగా జీవించవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు.
అయితే.. ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే.. ఏమైనా అనారోగ్య సమస్యలుంటే నేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది.
