AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎక్కువ రుద్దాల్సిన పనిలేదు.. ఇలా చేస్తే గ్యాస్ స్టవ్ బర్నర్లు తళతళ మెరిసిపోతాయ్..

వంటగదిని ఎంత నీట్‌గా ఉంచుకోవాలనుకున్నా, గ్యాస్ స్టవ్ మీద పేరుకుపోయే నూనె మరకలు, మొండి జిడ్డు పెద్ద తలనొప్పిగా మారుతుంటాయి. దీనివల్ల స్టవ్ మురికిగా మారడమే కాకుండా బర్నర్ రంధ్రాలు మూసుకుపోయి గ్యాస్ వృథా అయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. చాలామంది ఈ జిడ్డును వదిలించడానికి గంటల తరబడి కష్టపడి రుద్దుతూ విసిగిపోతుంటారు. కానీ ఎలాంటి ఖరీదైన క్లీనర్లు వాడకుండానే.. ఇంట్లో ఉండే సాధారణ వస్తువులతో స్టవ్‌ను తళతళా మెరిసేలా చేయొచ్చు.

ఎక్కువ రుద్దాల్సిన పనిలేదు.. ఇలా చేస్తే గ్యాస్ స్టవ్ బర్నర్లు తళతళ మెరిసిపోతాయ్..
How To Clean Stains From Gas Stove Easily
Krishna S
|

Updated on: Nov 23, 2026 | 9:26 PM

Share

వంటగదిలో ప్రతిరోజూ వంట చేస్తుండటంతో గ్యాస్ స్టవ్ చుట్టూ నూనె, మసాలాలు, ఆహారపు రేణువులు పేరుకుపోతుంటాయి. తొలుత తేలికపాటి మరకలుగా కనిపించినా, సమయం గడిచేకొద్దీ అవి మందపాటి జిడ్డు పొరగా మారిపోతాయి. వీటిని వదిలించుకోవడానికి గంటల తరబడి రుద్దాల్సిన అవసరం లేదు. కొన్ని సులభమైన పద్ధతులతో తక్కువ శ్రమతోనే స్టవ్‌ను శుభ్రంగా మార్చుకోవచ్చు. స్టవ్ చుట్టూ స్వల్పంగా జిడ్డు పట్టి ఉంటే మైక్రోఫైబర్ వస్త్రం బాగా ఉపయోగపడుతుంది. గోరువెచ్చని నీటిలో గుడ్డను తడిపి, నీటిని బాగా పిండేసి జిడ్డు ఉన్న చోట కొద్దిసేపు ఉంచి మెల్లగా తుడవాలి. ఈ వస్త్రం నూనె, ధూళిని సులభంగా పీల్చుకుంటుంది. ఇక మూలలు, అంచుల వద్ద ఇరుక్కుపోయిన జిడ్డును తీయడానికి పాత టూత్‌బ్రష్ ఉపయోగించవచ్చు. బ్రష్‌కు కొద్దిగా డిష్‌వాషింగ్ లిక్విడ్ వేసి అంచులను సున్నితంగా రుద్దితే చేతులు పట్టని చోటు కూడా శుభ్రపడుతుంది. అయితే బ్రష్ బర్నర్ రంధ్రాలకు లేదా గ్యాస్ పైపులకు తగలకుండా జాగ్రత్త పడాలి.

మొండి మరకలు, గ్రిల్స్, బర్నర్ క్యాప్‌ల కోసం

మరింత జిడ్డుగా ఉన్నప్పుడు గోరువెచ్చని నీటిలో కొన్ని చుక్కల డిష్‌వాషింగ్ లిక్విడ్, కొద్దిగా నిమ్మరసం కలిపి ద్రావణం తయారు చేసుకోవాలి. స్పాంజ్‌ను అందులో ముంచి స్టవ్ చుట్టూ తుడిస్తే మురికి సులువుగా వదులుతుంది. అలాగే స్టవ్ గ్రిల్స్, బర్నర్ క్యాప్‌లను గోరువెచ్చని నీరు, డిష్‌వాషింగ్ లిక్విడ్ ద్రావణంలో కొద్దిసేపు నానబెట్టాలి. తర్వాత మృదువైన బ్రష్‌తో రుద్ది, బాగా కడిగి, పూర్తిగా ఆరిన తర్వాతే తిరిగి అమర్చాలి.

శుభ్రం చేసేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి

స్టవ్ క్లీన్ చేసే ముందు గ్యాస్ ఆఫ్ చేసి, ఉపరితలం పూర్తిగా చల్లారే వరకు వేచి చూడాలి. జిడ్డును తొలగించడానికి స్టీల్ స్క్రబ్బర్ లేదా కత్తి వంటి వాటిని వాడకూడదు; ఇవి స్టవ్ ఉపరితలాన్ని పాడు చేస్తాయి. బర్నర్ రంధ్రాలలోకి నీరు చేరకుండా చూడాలి, వేర్వేరు క్లీనర్లను ఒకదానితో ఒకటి కలపకూడదు. రోజూ వంట పూర్తయ్యాక స్టవ్ చుట్టూ ఒకసారి తుడిస్తే జిడ్డు మందంగా పేరుకుపోకుండా ఉంటుంది. ఈ చిన్న అలవాట్లు, జాగ్రత్తలు పాటిస్తే వంటగది ఎప్పుడూ శుభ్రంగా, గ్యాస్ స్టవ్ కొత్తదానిలా మెరుస్తూ ఉంటుంది.

Follow Us
ఎక్కువ రుద్దాల్సిన పనిలేదు.. ఇలా చేస్తే గ్యాస్ స్టవ్ బర్నర్లు..
ఎక్కువ రుద్దాల్సిన పనిలేదు.. ఇలా చేస్తే గ్యాస్ స్టవ్ బర్నర్లు..
'జబర్దస్త్' కు దూరమైన ఫణి ఇప్పుడేం చేస్తున్నాడో తెలుసా?
'జబర్దస్త్' కు దూరమైన ఫణి ఇప్పుడేం చేస్తున్నాడో తెలుసా?
రెండు ఓటీటీల్లో దుమ్మురేపుతున్న సినిమా..
రెండు ఓటీటీల్లో దుమ్మురేపుతున్న సినిమా..
ఇంటి నిర్మాణంలో చాలా మంది చేసే పెద్ద పొరపాటు ఏదో తెలుసా..?
ఇంటి నిర్మాణంలో చాలా మంది చేసే పెద్ద పొరపాటు ఏదో తెలుసా..?
భారత సైన్యం, పారామిలిటరీ వాట్సాప్ గ్రూపుల్లోకి పాక్ ఏజెంట్స్
భారత సైన్యం, పారామిలిటరీ వాట్సాప్ గ్రూపుల్లోకి పాక్ ఏజెంట్స్
గుడ్లు vs పనీర్.. బరువు తగ్గాలనుకునేవారికి ఏది బెస్ట్..?
గుడ్లు vs పనీర్.. బరువు తగ్గాలనుకునేవారికి ఏది బెస్ట్..?
రాజీనామా చేసిన 11 రోజులకే సీఈఓగా రీఎంట్రీ.. అసలు ఏం జరిగింది?
రాజీనామా చేసిన 11 రోజులకే సీఈఓగా రీఎంట్రీ.. అసలు ఏం జరిగింది?
పూరీలు, బజ్జీలు వేయించిన నూనె నల్లగా మారకుండా ఉండాలంటే ఏం చేయాలి?
పూరీలు, బజ్జీలు వేయించిన నూనె నల్లగా మారకుండా ఉండాలంటే ఏం చేయాలి?
మూడు పెళ్లిళ్లు.. ఐదుగురు పిల్లలు.. ఈ విలన్ ఎలా చనిపోయారంటే?
మూడు పెళ్లిళ్లు.. ఐదుగురు పిల్లలు.. ఈ విలన్ ఎలా చనిపోయారంటే?
ఐపీఎల్ 2027లో ధోనీ కొత్త పాత్ర ఇదే..అసలు విషయం చెప్పిన ఇర్ఫాన్
ఐపీఎల్ 2027లో ధోనీ కొత్త పాత్ర ఇదే..అసలు విషయం చెప్పిన ఇర్ఫాన్