AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గుడ్లు vs పనీర్.. బరువు తగ్గాలనుకునే వారికి ఏది బెస్ట్..? పోషకాలు, కేలరీల లెక్కలు తెలుసుకోండి..

అధిక బరువు, పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వును కరిగించుకోవడానికి చాలామంది రకరకాల కసరత్తులు చేస్తుంటారు. అయితే బరువు తగ్గే క్రమంలో వ్యాయామంతో పాటు సరైన డైట్ పాటించడం అత్యంత కీలకం. ముఖ్యంగా ప్రోటీన్ కోసం ఆహారంలో గుడ్లు చేర్చుకోవాలా? లేక పనీర్ తినాలా? అనే డౌట్ చాలామందిని వేధిస్తుంటుంది. ఈ రెండింటిలో ఏది త్వరగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది? అనేది తెలుసుకుందాం..

గుడ్లు vs పనీర్.. బరువు తగ్గాలనుకునే వారికి ఏది బెస్ట్..? పోషకాలు, కేలరీల లెక్కలు తెలుసుకోండి..
Eggs Vs Paneer For Weight Loss
Krishna S
|

Updated on: Nov 23, 2026 | 8:45 PM

Share

ప్రస్తుతం చాలా మంది అధిక బరువు లేదా పొట్ట సమస్యలతో సతమతమవుతున్నారు. దీంతో బరువు తగ్గేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే బరువు నియంత్రణలో డైట్‌దే కీలక పాత్ర కావడంతో ఆహారంలో ఏం చేర్చుకోవాలనే గందరగోళం ఎక్కువ మందిలో కనిపిస్తుంది. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వారికి గుడ్లు తినాలా? పనీర్ తినాలా? అనే ప్రశ్న తరచూ ఎదురవుతుంది. బరువు తగ్గడానికి కేలరీల లోటు చాలా అవసరం. గుడ్లలో ప్రోటీన్ పుష్కలంగా ఉండటమే కాకుండా కేలరీలు తక్కువగా ఉంటాయి. ఇవి త్వరగా కడుపు నిండిన భావనను కలిగిస్తాయి. రోజువారీ ఆహారంలో ఉడికించిన గుడ్లను లేదా తక్కువ నూనెతో వండిన గుడ్లను చేర్చుకోవడం మంచిది. కానీ గుడ్లను ఎక్కువ నూనెలో వేయించి తింటే లేదా వాటితో పాటు అధిక కేలరీల ఆహారాన్ని తీసుకుంటే బరువు తగ్గే లక్ష్యం దెబ్బతింటుంది.

శాకాహారులకు పనీర్ ఒక మంచి ప్రత్యామ్నాయంగా నిలుస్తుంది. ఇందులో ప్రోటీన్, కాల్షియం వంటి ముఖ్య పోషకాలు లభిస్తాయి. ఇవి శరీరానికి శక్తిని అందిస్తాయి. అయితే గుడ్లతో పోలిస్తే పనీర్‌లో కొవ్వు, కేలరీల శాతం కొంచెం ఎక్కువగా ఉంటుంది. రుచి బాగుంటుంది కదా అని పనీర్‌ను అతిగా తింటే బరువు తగ్గడానికి బదులు ఊబకాయం పెరిగే ప్రమాదం ఉంది. అందువల్ల పనీర్‌ను తక్కువ నూనెతో, మితంగా తీసుకోవడం మంచిది. బరువు తగ్గడం అనేది ఏ ఒక్క ఆహార పదార్థంతోనో సాధ్యమయ్యే ప్రక్రియ కాదు. దీనికి సమతుల్య ఆహారంతో పాటు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, శారీరక శ్రమ చేయడం ఎంతో ముఖ్యం.

ఆహారంలో ఫైబర్ అధికంగా ఉండే కూరగాయలను కూడా తప్పనిసరిగా చేర్చుకోవాలి. గుడ్లు, పనీర్ రెండింటినీ సరైన మోతాదులో తీసుకుంటే కడుపు నిండినట్లు అనిపించడమే కాకుండా, బరువు కూడా అదుపులో ఉంటుంది. కానీ ఏ ఆహారాన్నైనా అధిక మొత్తంలో తీసుకోవడం మంచిది కాదు. మొత్తానికి మీ ఆహారపు అలవాట్లు, శారీరక అవసరాలకు తగినట్లుగా గుడ్లు లేదా పనీర్‌ను మితంగా తీసుకుంటూ, వ్యాయామం, ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటిస్తే సులభంగా బరువు తగ్గవచ్చు.

Follow Us
గుడ్లు vs పనీర్.. బరువు తగ్గాలనుకునేవారికి ఏది బెస్ట్..?
గుడ్లు vs పనీర్.. బరువు తగ్గాలనుకునేవారికి ఏది బెస్ట్..?
రాజీనామా చేసిన 11 రోజులకే సీఈఓగా రీఎంట్రీ.. అసలు ఏం జరిగింది?
రాజీనామా చేసిన 11 రోజులకే సీఈఓగా రీఎంట్రీ.. అసలు ఏం జరిగింది?
పూరీలు, బజ్జీలు వేయించిన నూనె నల్లగా మారకుండా ఉండాలంటే ఏం చేయాలి?
పూరీలు, బజ్జీలు వేయించిన నూనె నల్లగా మారకుండా ఉండాలంటే ఏం చేయాలి?
మూడు పెళ్లిళ్లు.. ఐదుగురు పిల్లలు.. ఈ విలన్ ఎలా చనిపోయారంటే?
మూడు పెళ్లిళ్లు.. ఐదుగురు పిల్లలు.. ఈ విలన్ ఎలా చనిపోయారంటే?
ఐపీఎల్ 2027లో ధోనీ కొత్త పాత్ర ఇదే..అసలు విషయం చెప్పిన ఇర్ఫాన్
ఐపీఎల్ 2027లో ధోనీ కొత్త పాత్ర ఇదే..అసలు విషయం చెప్పిన ఇర్ఫాన్
ఎన్నో తప్పులు చేశా.. ఏళ్ల కష్టం తర్వాతే ఆ విషయం అర్థమైంది
ఎన్నో తప్పులు చేశా.. ఏళ్ల కష్టం తర్వాతే ఆ విషయం అర్థమైంది
పాము విషం నుంచి మనిషి ప్రాణాలను కాపాడుతున్నది ఈ జంతువే..
పాము విషం నుంచి మనిషి ప్రాణాలను కాపాడుతున్నది ఈ జంతువే..
శోభనం సీన్.. నేను బెడ్‌పైకి వెళ్లగానే ఆ హీరోయిన్ ఏడ్చేసింది
శోభనం సీన్.. నేను బెడ్‌పైకి వెళ్లగానే ఆ హీరోయిన్ ఏడ్చేసింది
భారత్‌లో 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ పొందిన టాప్ 5 కార్లు ఇవే!
భారత్‌లో 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ పొందిన టాప్ 5 కార్లు ఇవే!
వైభవ్, హర్షిత్‌కు మరో ఛాన్స్.. ఈసారి లెక్క సరిచేస్తారా?
వైభవ్, హర్షిత్‌కు మరో ఛాన్స్.. ఈసారి లెక్క సరిచేస్తారా?