AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇళ్లలో వెలిగించే అగరబత్తులు, దోమల కాయిల్స్ పొగతో క్యాన్సర్ వస్తుందా? నిజానిజాలేంటో తెలిస్తే..

మనదేశంలో ఇళ్లలో అగరబత్తులు వెలిగించడం, దోమల నివారణకు మస్కిటో కాయిల్స్ వాడటం సహజం. అయితే, వీటి నుంచి వచ్చే పొగ వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్ వస్తుందనే వార్తలు తరచూ ప్రజల్లో ఆందోళన కలిగిస్తుంటాయి. ఈ అంశంపై ప్రముఖ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ చింతన్ షా, ఇతర వైద్య నిపుణులు కీలక విషయాలు వెల్లడించారు.

ఇళ్లలో వెలిగించే అగరబత్తులు, దోమల కాయిల్స్ పొగతో క్యాన్సర్ వస్తుందా? నిజానిజాలేంటో తెలిస్తే..
Mosquito Coils Cancer Risk
Jyothi Gadda
|

Updated on: Sep 20, 2026 | 10:51 AM

Share

ఇళ్లలో రోజూ వాడే అగరబత్తులు, మస్కిటో కాయిల్స్ నుండి వచ్చే పొగ వల్ల క్యాన్సర్ వస్తుందనే ప్రచారంపై క్యాన్సర్ నిపుణులు స్పష్టతనిచ్చారు. ఇళ్లలో సాధారణంగా అగరబత్తులు లేదా దోమల కాయిల్స్ వాడటం వల్ల నేరుగా క్యాన్సర్ వస్తుందనడానికి స్పష్టమైన లేదా నిర్దిష్టమైన ఆధారాలు లేవని ఆంకాలజిస్టులు స్పష్టం చేశారు. క్యాన్సర్ అనేది జన్యుపరమైన అంశాలు, పొగాకు, మద్యం వాడకం, అంటువ్యాధులు, ఇతర జీవనశైలి కారకాల కలయిక వల్ల వస్తుంది. కేవలం రోజువారీ పూజల కోసం అగరబత్తులు వెలిగించినంత మాత్రాన క్యాన్సర్ బారిన పడతారని భయపడాల్సిన అవసరం లేదని తెలిపారు.

అసలైన ప్రమాదం ఎక్కడ ఉందంటే…

క్యాన్సర్ నేరుగా రాకపోయినా, ఈ పొగలో ఉండే సూక్ష్మ కణాలు, రసాయనాలు ఇంటి లోపలి గాలి నాణ్యతను దెబ్బతీస్తాయి. ముఖ్యంగా, గాలి ఆడని గదుల్లో తలుపులు, కిటికీలు మూసివేసి ఉండే చిన్న గదుల్లో వీటిని ఎక్కువ సేపు వెలిగించినప్పుడు పొగ గదిలోనే పేరుకుపోతుంది. రోజూ రాత్రంతా మూసివున్న గదిలో మస్కిటో కాయిల్స్ పొగ పీల్చడం వల్ల శ్వాసకోశ సంబంధిత సమస్యలు, ఆస్తమా, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం పెరుగుతుంది.

వైద్యుల సూచనలు, జాగ్రత్తలు:

ఇంటి పరిసరాలను, గాలిని ఆరోగ్యకరంగా ఉంచుకోవడానికి వైద్యులు క్రింది సూచనలు చేశారు. అగరబత్తులు లేదా కాయిల్స్ వెలిగించినప్పుడు గది కిటికీలు, తలుపులు తెరిచి ఉంచాలి. దోమల నివారణకు పొగనిచ్చే కాయిల్స్ కంటే దోమతెరలు లేదా పొగ రాని ఎలక్ట్రిక్ వేపరైజర్లు వాడటం సురక్షితం. ఒకేసారి ఎక్కువ అగరబత్తులు వెలిగించకుండా, తక్కువ పొగనిచ్చే ఉత్పత్తులను ఎంచుకోవడం మంచిది. నిద్రించే గదుల్లో రాత్రంతా కాయిల్స్ వెలిగించి ఉంచడం ఏమాత్రం మంచిది కాదు.

ఇవి కూడా చదవండి

అగరబత్తులు, దోమల కాయిల్స్ వాడకం వల్ల నేరుగా క్యాన్సర్ రాకపోయినా, మూసివున్న ప్రదేశాల్లో ఆ పొగను నిరంతరం పీల్చడం శ్వాసకోశ వ్యవస్థకు హానికరం. కాబట్టి సరైన వెలుతురు, గాలి ప్రసరించే వాతావరణంలో మాత్రమే వీటిని ఉపయోగించాలని నిపుణులు సలహా ఇస్తున్నారు.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!