వాయిదాల మీద వాయిదాలు.. క్లారిటీ లేదా? కన్ఫ్యూజ్ అవుతున్నారా..?
టాలీవుడ్‌లో రూ.50 కోట్లకు పైగా బడ్జెట్‌తో తెరకెక్కుతున్న పలు మీడియం రేంజ్ హీరోల సినిమాలు వరుస వాయిదాలతో వార్తల్లో నిలుస్తున్నాయి. సాయి ధరమ్ తేజ్ ‘సంబరాల ఏటిగట్టు’, అడివి శేష్ ‘గూఢచారి 2’, నిఖిల్ ‘స్వయంభు’, ‘ది ఇండియా హౌజ్’, గోపీచంద్ ‘భరతవర్ష’తో పాటు మరికొన్ని సినిమాల రిలీజ్ డేట్లపై స్పష్టత కనిపించడం లేదని కథనం చెబుతోంది. షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్, విడుదల ప్రణాళికల్లో ఆలస్యాలు ఎందుకు జరుగుతున్నాయనే చర్చ మొదలైంది.
వాళ్లేం చిన్న హీరోలు కాదు.. వాళ్లు చేస్తున్నదేం చిన్న సినిమాలు కాదు.. ఒక్కో దాని బడ్జెట్ కనీసం 50 కోట్లకు పైగానే ఉంది. అయినా కూడా వాయిదాలు తప్పట్లేదు.. షూటింగ్స్ మీద క్లారిటీ లేదు. అంతంత బడ్జెట్ పెడుతున్నా విడుదలపై వాళ్లలో వాళ్లకే క్లారిటీ రావట్లేదా లేదంటే కథ విషయంలోనే కన్ఫ్యూజ్ అవుతున్నారా..? అసలు తేడా ఎక్కడ జరుగుతుంది..? హీరోల ప్లానింగ్ మిస్ ఫైర్ అవుతుందా..? ఒకప్పుడు మీడియం రేంజ్ సినిమాలన్నీ పర్ఫెక్ట్ ప్లానింగ్ ప్రకారం చెప్పిన టైమ్‌కే వచ్చేవి. కానీ ఇప్పుడలా కాదు.. అన్నీ వాయిదాల మీద వాయిదాలే. దర్శక నిర్మాతలకు క్లారిటీ లేదా లేదంటే హీరోలే కన్ఫ్యూజ్ అవుతున్నారా అనేది తెలియట్లేదు. సాయి ధరమ్ తేజ్ సంబరాల ఏటిగట్టునే తీసుకోండి.. 2025, సెప్టెంబర్ 25కి డేట్ ఇస్తే ఇప్పటికీ రాలేదు సినిమా.. 2027 జనవరి 13కి డేట్ లాక్ అయింది. కాస్త ఆలస్యమైనా.. కన్ఫ్యూజ్ లేకుండా సినిమాలు చేసే అడివి శేష్ కూడా ఈ మధ్య బాగా వాయిదాలకి అలవాటు పడిపోయారు. ఆయన నటిస్తున్న గూఢచారి 2 రెండేళ్లుగా సెట్స్‌పైనే ఉంది. మే 1నే విడుదలన్నారు.. సీన్ కట్ చేస్తే 2027, ఫిబ్రవరి 5న రిలీజ్ అంటున్నారు. మరోవైపు నిఖిల్ స్వయంభు రిలీజ్ డేట్ మీద మేకర్స్ దగ్గర కూడా సమాధానం లేదు. దాదాపు 60 కోట్లతో తెరకెక్కుతున్న స్వయంభు ఏప్రిల్ నుంచి ఇదిగో అదుగో అంటున్నారే కానీ రిలీజ్ మాత్రం చేయట్లేదు. నిఖిల్ మరో సినిమా ది ఇండియా హౌజ్ పరిస్థితి ఇంతే. గోపీచంద్ భరతవర్ష సినిమా రిలీజ్‌పైనా ఏ అప్‌డేట్స్ లేవు. పూరీ జగన్నాథ్ స్లమ్ డాగ్, శర్వానంద్-సంపత్ నంది భోగి సినిమాల డేట్స్ వాయిదాలు పడుతూనే ఉన్నాయి. మొత్తానికి ఈ మీడియం రేంజ్ సినిమాలన్నీ బయటికొచ్చేదెప్పుడో..?
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Abhishek Sharma: 30 బంతుల్లో సెంచరీ …అభిషేక్ శర్మ వరల్డ్ రికార్డ్
ర్యాపిడో, ఓలా , ఊబర్‌కు కేంద్రం కీలక ఆదేశాలు!
దేశవ్యాప్తంగా పనీర్ బ్యాన్! 5 వేల లైసెన్సులు రద్దు!
UPI కొత్త నిబంధనలు.. సామాన్యులపై ప్రభావం ఎంత?
Nirmala Seetharaman: ఎం.ఎస్.సుబ్బులక్ష్మి పాట పాడుతూ.. కంటతడి పెట్టుకున్న నిర్మలా సీతారామన్
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!
3,000 కి.మీ. నడిచి అమ్మవారి చెంతకు చేరిన బుల్లి ఏనుగు!
ఆహా.. ఈ పానీపూరీ అదృష్టమే.. అదృష్టం..
జలపాతం వద్ద షాకింగ్ సీన్..
ముంబై వీధుల్లో బిచ్చమెత్తుకుంటున్న ఎమ్మెల్యే.. ఏం జరిగిందంటే
అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన భారతీయ రైల్వే

