బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో దూసుకుపోతున్న బాంధవి శ్రీధర్

19 September  2026

Rajeev 

Pic credit - Instagram

తెలుగు సినీ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అవసరం లేని పేరు బాంధవి శ్రీధర్. మోడల్‌గా తన ప్రయాణాన్ని మొదలుపెట్టి సినిమాల్లోకి వచ్చింది ఈ అందాల భామ.

చిన్నప్పుడే పలు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా కనిపించింది. అయితే హీరోయిన్‌గా ఆమెకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన సినిమా మాత్రం ‘మసూద’.

ఈ హారర్ థ్రిల్లర్‌లో నాజియా పాత్రలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్న బాంధవి.. ఆ తర్వాత వరుస అవకాశాలతో తన కెరీర్‌ను ముందుకు తీసుకెళ్తోంది.

మిస్టర్ పర్ఫెక్ట్, రభస, మొగుడు, రామయ్య వస్తావయ్య, మజ్ను వంటి చిత్రాల్లో బాలనటిగా కనిపించింది. ఆ తర్వాత మోడలింగ్‌పై దృష్టి పెట్టింది ఆమె.

2019లో మిస్ ఇండియా ఆంధ్రప్రదేశ్ టైటిల్‌ను సొంతం చేసుకోవడంతో పాటు మిస్ ఇండియా ఫ్యాషన్ ఐకాన్‌గా కూడా గుర్తింపు తెచ్చుకుంది.

తర్వాత ‘లైట్ హౌస్’, ‘జాట్’ వంటి ప్రాజెక్టుల్లోనూ కనిపించిన బాంధవి.. ప్రస్తుతం మరిన్ని సినిమాలతో బిజీగా మారుతోంది.

సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ బాంధవి శ్రీధర్ యాక్టివ్‌గా ఉంటోంది. తాజాగా ఎరుపు రంగు చీరలో చేసిన ఫోటోషూట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.