AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Washing Machine: వాషింగ్ మెషిన్ కొనేస్తే సరిపోదు.. ఈ ఖర్చులు ఉంటాయని మీకు తెలుసా?

Washing Machine: ఆన్‌లైన్‌లో ముఖ్యంగా అమెజాన్‌లో మెషిన్ కొనుగోలు చేసినప్పుడు, కొరియర్ డెలివరీ అయిన 48 గంటల్లో టెక్నీషియన్ వస్తారని చూపిస్తుంది. కానీ ఈ సందర్భంలో మెషిన్ డెలివరీ అయిన ఏడు రోజుల తర్వాత టెక్నీషియన్ వస్తారు. మూడు రోజులు వేచి..

Washing Machine: వాషింగ్ మెషిన్ కొనేస్తే సరిపోదు.. ఈ ఖర్చులు ఉంటాయని మీకు తెలుసా?
Washing Machine
Subhash Goud
|

Updated on: Sep 20, 2026 | 11:07 AM

Share

వాషింగ్ మెషిన్ కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నారా? కేవలం మెషిన్ ధరతోనే అన్ని ఖర్చులు అయిపోతాయని భావిస్తే పొరపాటే. కొనుగోలు తర్వాత కూడా కొన్ని అదనపు ఖర్చులు, ఇన్‌స్టాలేషన్ ప్రక్రియలో కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. వాటికి ముందుగానే సిద్ధమైతే మెరుగైన అనుభవం ఉంటుంది. ఓ వ్యక్తి రివ్యూ 9 కేజీ కెపాసిటీ ఫుల్లీ ఆటోమేటిక్ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషిన్ కొనుగోలు, ఇన్‌స్టాలేషన్, వినియోగ అనుభవం ఆధారంగా ఈ ఆర్టికల్‌ను అందిస్తున్నాము.

అదనపు ఖర్చులు:

మెషిన్ కొనుగోలుతో పాటు, అదనంగా ఎదురైన మొదటి ఖర్చు ప్రత్యేక వాషింగ్ మెషిన్ ట్యాప్. దీని ధర సుమారు రూ.250. ఇది సాధారణ హార్డ్‌వేర్ షాపుల్లో లభిస్తుంది. అలాగే మెషిన్ స్టాండ్, బాడీ కవర్‌కు కలిపి రూ.1600 అదనంగా ఖర్చవుతుంది. ఇవి డస్ట్, సన్ లైట్ నుండి మెషిన్‌ను రక్షించడానికి అవసరం. టెక్నీషియన్ వీటిని తీసుకువచ్చేటప్పుడు కాల్ చేసి అడుగుతారు. ఆన్‌లైన్‌లో కూడా వీటి ధరలు దాదాపుగా ఇదే విధంగా ఉంటాయి. మెషిన్ శుభ్రతకు లిక్విడ్ వాష్ తప్పనిసరి, సర్ఫ్ వాడకూడదు అని టెక్నీషియన్ సూచిస్తుంటారు. ఇది కూడా నిరంతరం ఉండే అదనపు ఖర్చే. మొత్తం మీద కొనుగోలు ధరతో పాటు దాదాపు రూ.2500 అదనంగా ఖర్చయ్యాయి.

ఇన్‌స్టాలేషన్ ప్రక్రియ, సవాళ్లు:

ఆన్‌లైన్‌లో మెషిన్ కొనుగోలు చేసినప్పుడు, కొరియర్ డెలివరీ అయిన 48 గంటల్లో టెక్నీషియన్ వస్తారని చూపిస్తుంది. కానీ ఈ సందర్భంలో మెషిన్ డెలివరీ అయిన రెండు, మూడు రో జులకు టెక్నీషియన్ వస్తారు. టెక్నీషియన్ ఇన్‌స్టాలేషన్ కోసం ఎలాంటి చార్జీలు తీసుకోలేరు. కేవలం స్టాండ్, బాడీ కవర్ కోసం మాత్రమే చెల్లించాల్సి వచ్చిందని కొనుగోలదారుడు చెబుతున్నాడు. ఇన్‌స్టాలేషన్ చేసేటప్పుడు, మనం వాషింగ్ మెషిన్ ఎక్కడ పెట్టాలనుకుంటున్నామో అక్కడ వాటర్ కనెక్షన్, డ్రైనేజీ ఏరియా, స్విచ్ బోర్డు అన్నీ అందుబాటులో ఉండేలా సిద్ధం చేసుకోవాలి. టెక్నీషియన్ కేవలం ట్యాప్‌కి పైప్ కనెక్షన్ ఇస్తారు తప్ప, వేరే ఏర్పాట్లు చేయరు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి: Gold Price Today: పసిడి ప్రియులకు షాక్.. మళ్లీ ఆకాశాన్ని తాకుతున్న ధరలు..!

ఇన్‌స్టాలేషన్ పూర్తయిన తర్వాత టెక్నీషియన్ మెషిన్ ఎలా ఉపయోగించాలో స్పష్టంగా వివరిస్తారు. పవర్ బటన్ ఆన్ చేసి, బట్టలు లోడ్ చేసి, వాషింగ్ మోడ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎక్కువగా డైలీ వాష్ మోడ్ ఉపయోగిస్తారు. లిక్విడ్ వేసి స్టార్ట్ బటన్ నొక్కగానే మెషిన్ పని చేయడం ప్రారంభిస్తుంది. డైలీ వాష్ మోడ్‌కు సుమారు 1.5 గంటల సమయం పడుతుంది. ఈ సమయంలో మెషిన్ ఆటోమేటిక్‌గా నీరు తీసుకుంటుంది. మురికి నీటిని బయటికి పంపేస్తుంది. ఉతకడం పూర్తయిన తర్వాత కాస్త ఆరబెట్టి ఆటోమేటిక్‌గా పవర్ ఆఫ్ అవుతుంది.

ఇది కూడా చదవండి: Heat Solutions Heat: రేకుల షెడ్డులో వేడితో తట్టుకోలేకపోతున్నారా? ఇలా చేస్తే ఏసీలాంటి కూలింగ్‌..!

మెషిన్ తక్కువ శబ్దాన్ని చేస్తుంది. అయితే, బట్టలను పిండేటప్పుడు చాలా వేగంగా స్పిన్ అవుతుంది కాబట్టి మెషిన్ కొద్దిగా షేక్ అవుతుంది. మెషిన్ కింద ఫ్లోర్ సమానంగా, శుభ్రంగా ఉంటే వైబ్రేషన్ సమస్య ఉండదు. టైల్స్ ఉన్న ఫ్లోర్ అయితే మరింత మంచిది. అప్పుడు స్టాండ్ కూడా అవసరం ఉండకపోవచ్చు. ఉతకడం పూర్తయిన తర్వాత అలారం మోగుతుంది. బట్టలు దాదాపుగా ఆరిపోయినట్లుగానే ఉంటాయి. 5-10 నిమిషాలు ఎండలో ఆరబెడితే సరిపోతుంది. ఉతికే నాణ్యత కూడా చాలా బాగుందని చెబుతున్నారు.

ఇది కూడా చదవండి: Compound Walls: ప్రహరీ గోడ కడుతున్నారా? ఈ చిన్న పొరపాటు చేస్తే గోడ బీటలు వారడం ఖాయం!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us