నటి శ్రుతి హాసన్ తన వ్యక్తిగత, ఆరోగ్య సమస్యలపై ఎప్పుడూ బహిరంగంగా మాట్లాడుతుంటారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె పీసీఓఎస్ (PCOS) గురించి పంచుకున్నారు.
శ్రుతి హాసన్
తనకు 13 ఏళ్ల వయసులో మొదటిసారి పీరియడ్స్ వచ్చాయని, పీరియడ్స్ మొదలైన కొద్ది గంటల్లోనే తీవ్రమైన కడుపునొప్పి వచ్చేదని, ప్రతి నెలా కనీసం 12 రోజుల పాటు తీవ్ర వేదన అనుభవించేదాన్నని తెలిపారు.
శ్రుతి హాసన్
స్కూల్ రోజుల్లో నొప్పి భరించలేక స్పృహతప్పి పడిపోవడం, వాంతులు చేసుకోవడం జరిగేదని.. నొప్పులు తగ్గక ఆసుపత్రికి వెళ్ళి ఐవీ ఫ్లూయిడ్స్, పెయిన్ కిల్లర్స్ తీసుకోవాల్సి వచ్చేదని పేర్కొన్నారు.
శ్రుతి హాసన్
సినిమాల్లోకి వచ్చిన తర్వాత కూడా ఈ సమస్య తీవ్రంగా వేధించిందని ఆమె చెప్పారు. పీరియడ్స్ సమయంలో డ్యాన్స్ సీన్లు, యాక్షన్ ఘట్టాల్లో నటించడం నరకంలా ఉండేదని అన్నారు.
శ్రుతి హాసన్
షూటింగ్ బ్రేక్‌లో క్యారవాన్‌లోకి వెళ్లి వాంతులు చేసుకునేదాన్నని గుర్తుచేసుకున్నారు. నొప్పి తగ్గడానికి వాడే పెయిన్ కిల్లర్స్ వల్ల మత్తుగా, అయోమయంగా అనిపించేదని తెలిపారు.
శ్రుతి హాసన్
2020లో బర్త్ కంట్రోల్ మాత్రలు వాడటం వల్ల కొంత ఉపశమనం లభించినప్పటికీ, హార్మోనల్ మార్పుల వల్ల మానసికంగా ఒత్తిడికి గురై ప్రతిదానికీ ఏడ్చేదాన్నని శ్రుతి చెప్పారు.
శ్రుతి హాసన్
కోవిడ్ లాక్‌డౌన్ సమయంలో హైదరాబాద్‌లోని ఇంటి మెట్లపైనే తీవ్రమైన నొప్పితో స్పృహ తప్పి పడిపోయినట్లు వెల్లడించారు. ఆ తర్వాత సరైన వైద్యుల సలహాలు తీసుకున్నానని అన్నారు.
శ్రుతి హాసన్
నాన్-హార్మోనల్ మందులు వాడటం ప్రారంభించానని, ప్రస్తుతం తన ఆరోగ్యం అదుపులోనే ఉందన్నారు. మహిళలు ఎదుర్కొనే పీరియడ్స్ బాధలపై సమాజంలో అవగాహన పెరగాలని అన్నారు.