Chiranjeevi: చిరు Vs చిరు.. ఆ సినిమాను పక్కనబెట్టారా..?
2027 సంక్రాంతికి చిరంజీవి నటిస్తున్న రెండు సినిమాల మధ్య ఆసక్తికరమైన రిలీజ్ పోటీ కనిపిస్తోంది. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘కాకా’ సినిమాను జనవరి 13న విడుదల చేయనున్నట్లు టీమ్ మరోసారి స్పష్టం చేసింది. మరోవైపు ‘విశ్వంభర’ మేకర్స్ కూడా సంక్రాంతి రేసుపై దృష్టి పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ఒకే హీరో నటించిన రెండు సినిమాలు ఒకే పండక్కి పోటీ పడే పరిస్థితి వస్తుందా అనే ఆసక్తి నెలకొంది. తుది రిలీజ్ ప్లాన్‌పై మరింత స్పష్టత రావాల్సి ఉంది.
చిరంజీవితో చిరంజీవి పోటీ.. ఇండస్ట్రీలో జరుగుతున్న ఇంట్రెస్టింగ్ వార్ ఇది.. మేమొస్తామంటే మేమొస్తామంటూ ఇటో చిరంజీవి సినిమా.. అటో చిరంజీవి సినిమా రెడీ అవుతున్నాయి. చూసే వాళ్లకు ఇది నమ్మడానికి కాస్త కష్టంగానే ఉన్నా కూడా చివరికి ఏ చిరంజీవి వస్తారనేది ఆసక్తికరంగానే మారింది. మరింతకీ ఈ మెగా వార్ వెనక ఏం జరుగుతుంది..? మన శంకరవరప్రసాద్ గారు సినిమాతో ఫామ్‌లోకి వచ్చిన చిరంజీవి.. మరోసారి సంక్రాంతికే వచ్చి బాక్సాఫీస్ బద్దలు కొట్టాలని చూస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో 2027 సంక్రాంతికి కూడా చిరు సినిమా రావడం ఖాయం. కానీ అది ఏ సినిమా అనే విషయంలోనే చిన్న కన్ఫ్యూజన్ నడుస్తుంది. ఓవైపు కాకా నేను తగ్గనంటుంటే.. టైమ్ కోసం విశ్వంభర మేకర్స్ కూడా వేచి చూస్తున్నారు. బాబీ తెరకెక్కిస్తున్న కాకా సినిమా షూటింగ్ వేగంగా జరుగుతుంది.. వాళ్లు పండగనే టార్గెట్ చేసుకుని మరీ షూట్ చేస్తున్నారు. ఇప్పటికే ఫస్టాఫ్ కూడా లాక్ అయిపోయింది.. సెకండాఫ్ షూట్ వేగంగా జరుగుతుంది. అయితే ఈ రేసులోకి సడన్‌గా విశ్వంభర రావడంతో.. పండక్కి కాకా తప్పుకుంటున్నాడేమో అనే ప్రచారం మొదలైంది.. ఎందుకంటే విశ్వంభరకు సంక్రాంతి పర్ఫెక్ట్ టైమ్ అని మేకర్స్ భావిస్తున్నారు. గత కొన్ని రోజులుగా విశ్వంభర సంక్రాంతికి రావడం దాదాపు ఖాయం అనుకుంటున్న తరుణంలో నేనింకా రేసులోనే ఉన్నానంటూ కాకా టీం ట్వీట్ చేసారు. ఎట్టి పరిస్థితుల్లో కాకా జనవరి 13నే విడుదల కానుందని వాళ్లు మళ్లీ కన్ఫర్మ్ చేసారు. ఈ లెక్కన చిరు Vs చిరు పోరు నడుస్తుంది. మరి ఈ రేసులో చివరికి నిలిచేదెవరో.. పండక్కి వచ్చేదెవరో చూడాలంటే మరికొన్నాళ్లు వేచి చూడాల్సిందే.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Abhishek Sharma: 30 బంతుల్లో సెంచరీ …అభిషేక్ శర్మ వరల్డ్ రికార్డ్
ర్యాపిడో, ఓలా , ఊబర్‌కు కేంద్రం కీలక ఆదేశాలు!
దేశవ్యాప్తంగా పనీర్ బ్యాన్! 5 వేల లైసెన్సులు రద్దు!
UPI కొత్త నిబంధనలు.. సామాన్యులపై ప్రభావం ఎంత?
Nirmala Seetharaman: ఎం.ఎస్.సుబ్బులక్ష్మి పాట పాడుతూ.. కంటతడి పెట్టుకున్న నిర్మలా సీతారామన్
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!
3,000 కి.మీ. నడిచి అమ్మవారి చెంతకు చేరిన బుల్లి ఏనుగు!
ఆహా.. ఈ పానీపూరీ అదృష్టమే.. అదృష్టం..
జలపాతం వద్ద షాకింగ్ సీన్..
ముంబై వీధుల్లో బిచ్చమెత్తుకుంటున్న ఎమ్మెల్యే.. ఏం జరిగిందంటే
అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన భారతీయ రైల్వే

