Cinema : రెండు ఓటీటీల్లోకి వచ్చేసిన మిస్టీరియస్ హారర్ థ్రిల్లర్.. ఎక్కడ చూడొచ్చంటే..
జబర్దస్త్ కమెడియన్ అదిరే అభి దర్శకుడిగా మారిన సంగతి తెలిసిందే. ఆయన తెరకెక్కించిన సినిమా కర్మాఖ్య. మిస్టీరియస్ థ్రిల్లర్ డ్రామాగా జూలై31న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు పాజిటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చింది. ఇక ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ ప్లాట్ ఫామ్ లోకి వచ్చింది.

ఓటీటీ ప్రియులను, ముఖ్యంగా మిస్టరీ-హారర్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులను అలరించేందుకు మరో కొత్త చిత్రం డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోకి వచ్చేసింది. ‘జబర్దస్త్’ షో ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు ఎంతగానో చేరువైన నటుడు ‘అదిరే అభి’ (అభినయ కృష్ణ) స్వయంగా దర్శకత్వం వహించిన మిస్టీరియస్ హారర్ థ్రిల్లర్ మూవీ ‘కర్మాఖ్య’. జులై 31న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందన తెచ్చుకుంది. అయితే, థియేట్రికల్ రిలీజ్ అయిన దాదాపు రెండు నెలల తర్వాత, ఎలాంటి ముందస్తు ప్రకటన లేదా హడావుడి లేకుండా సడన్‌గా ఓటీటీలోకి అడుగుపెట్టి సర్ప్రైజ్ ఇచ్చింది. విశేషమేమిటంటే, ఈ సినిమా ఒకేసారి రెండు ప్రముఖ డిజిటల్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో అందుబాటులోకి రావడం.
ఎక్కువ మంది చదివినవి : Folk Song: అబ్బబ్బ ఏమున్నది పాట.. డీజేలో మోత మోగిపోతుందిగా.. వింటే స్టెప్పేయాల్సిందే..
ప్రస్తుతం ‘కర్మాఖ్య’ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియో, జియో హాట్‌స్టార్ ప్లాట్‌ఫామ్‌లలో స్ట్రీమింగ్ అవుతోంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో ఈ చిత్రం లభిస్తుండగా, జియో హాట్‌స్టార్‌లో తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ వంటి ఐదు భాషల్లో ప్రేక్షకులు ఈ చిత్రాన్ని చూడొచ్చు. ఈ చిత్రంలో సమైరా, సముద్రఖని, ఆనంద్, అభిరామి, శరణ్య ప్రదీప్, మధునందన్, ధనరాజ్, గడ్డం నవీన్, వైష్ణవ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.
ఎక్కువ మంది చదివినవి : Cinema : వెంకటేశ్ హీరోగా లవ్ స్టోరీ.. తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్.. తెలుగులో పెద్ద డిజాస్టర్..
మై ఫిల్మ్స్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వడ్డేపల్లి వాణీనాథ్ మరియు యశ్వంత్ రాజ్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించారు. అదిరే అభి దర్శకత్వ ప్రతిభ, నటీనటుల పనితీరు, థ్రిల్లింగ్ అంశాలు ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. థియేటర్లలో చూడటం మిస్సయిన హారర్ అభిమానులు, థ్రిల్లర్ కథాంశాలను ఇష్టపడే ఓటీటీ వీక్షకులు ఇప్పుడు ‘కర్మాఖ్య’ను తమ ఇంట్లోనే ప్రైమ్ లేదా హాట్‌స్టార్‌లో వీక్షించవచ్చు.
ఎక్కువ మంది చదివినవి : Udaya Bhanu: పస్తులు ఉండి ఇతరులకు అన్నం పెట్టిన గొప్ప వ్యక్తి ఆయన.. చివరకు అలాంటి పరిస్థితుల్లో.. ఉదయభాను ఎమోషనల్..
ఎక్కువ మంది చదివినవి : Udaya Bhanu: పస్తులు ఉండి ఇతరులకు అన్నం పెట్టిన గొప్ప వ్యక్తి ఆయన.. చివరకు అలాంటి పరిస్థితుల్లో.. ఉదయభాను ఎమోషనల్..
