AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఇదేం సినిమా అని ఎవరు కొనలేదు.. కట్ చేస్తే.. థియేటర్లను షేక్ చేసింది.. ఇప్పటికీ ఓ సెన్సేషన్..

రాజేంద్ర ప్రసాద్ నటించిన ఓ సినిమాను మొదట్లో ఎవరూ కొనకపోవడానికి గల కారణాలను వెల్లడించారు. ఈ చిత్రం విడుదలకు ముందున్న ఉత్కంఠను, ఆ తర్వాత సాధించిన బ్లాక్‌బస్టర్ విజయాన్ని వివరించారు. తన మధ్యతరగతి నేపథ్యం, ప్రత్యేకమైన పాత్రల ఎంపిక, తిరుమల సన్నిహిత సంబంధం, న్యూజెర్సీ అసెంబ్లీ, ఆస్ట్రేలియన్ పార్లమెంట్‌లలో అరుదైన సన్మానాలను కూడా పంచుకున్నారు.

Tollywood: ఇదేం సినిమా అని ఎవరు కొనలేదు.. కట్ చేస్తే.. థియేటర్లను షేక్ చేసింది.. ఇప్పటికీ ఓ సెన్సేషన్..
Ladies Tailor Movie
Rajitha Chanti
|

Updated on: Sep 18, 2026 | 10:26 AM

Share

నటుడు రాజేంద్ర ప్రసాద్ తన సినీ ప్రస్థానంలోని అరుదైన అనుభవాలను, ముఖ్యంగా లేడీస్ టైలర్ సినిమా వెనుక ఉన్న కథను ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. లేడీస్ టైలర్ సినిమా విడుదలకు ముందు తీవ్ర ఉత్కంఠను ఎదుర్కొందని, సినిమాను ఎవరూ కొనడానికి ముందుకు రాలేదని ఆయన వెల్లడించారు. ఆ సమయంలో “డూ ఆర్ డై” పరిస్థితి నెలకొందని, అది విజయం సాధించకపోతే తన కెరీర్ ముగిసిపోయేదని పేర్కొన్నారు. పూర్తిస్థాయి హాస్య చిత్రాలపై అప్పటి వరకు పరిశ్రమకు పెద్దగా అనుభవం లేకపోవడంతో, సినిమా భవిష్యత్తుపై తీవ్ర ఆందోళన నెలకొందని తెలిపారు. అయితే, విడుదలైన మొదటి రోజు నుంచే లేడీస్ టైలర్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిందని, ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదని ఆయన వివరించారు.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : తొలి సూపర్ స్టార్ కమెడియన్.. ఖరీదైన కారులో ప్రయాణించి.. 44 ఏళ్ళ వయసులోనే రైల్వే స్టేషన్ రోడ్డు మీద అనాథలా..

రాజేంద్ర ప్రసాద్ తన పాత్రల ఎంపిక గురించి మాట్లాడుతూ, తాను ఎప్పుడూ సాధారణ హీరోల మాదిరిగా పది మందిని కొట్టే లేదా దేశాన్ని ఉద్ధరించే పాత్రలను చేయలేదని స్పష్టం చేశారు. లేడీస్ టైలర్లోని “సన్నాసి” పాత్ర, అప్పుల అప్పారావులోని “అప్పులు చేసేవాడు”, ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళాంలోని “పిసినారి” వంటి పాత్రలు మన సమాజంలో, మన చుట్టూ ఉండే సామాన్య మానవుల ప్రతిబింబాలని అన్నారు. ఈ పాత్రలన్నీ తన జీవితానికి ఒక పరీక్షలాంటివని ఆయన అన్నారు.

ఎక్కువ మంది చదివినవి : Pragathi : ఆ వాన సాంగ్ వల్ల హీరోయిన్‏గా సినిమాలు చేయడం మానేశా.. నటి ప్రగతి కామెంట్స్..

తన వ్యక్తిగత నేపథ్యం గురించి వివరిస్తూ, రాజేంద్ర ప్రసాద్ మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చానని, తల్లిదండ్రులను తొమ్మిదో ఏటనే కోల్పోయానని తెలిపారు. తన జీవితంలో ఎదుర్కొన్న కష్టాలు, పోరాటాలు, చదువుల కోసం పడిన శ్రమ, ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో గోల్డ్ మెడలిస్ట్‌గా నిలిచి, నటుడిగా ఎలా నిలదొక్కుకున్నారో వివరించారు. ఈ అనుభవాలు, జీవిత పాఠాలే తన పాత్రలను అర్థం చేసుకోవడానికి, వాటికి జీవం పోయడానికి ఎంతగానో దోహదపడ్డాయని ఆయన పేర్కొన్నారు. అరుదైన గౌరవాలు, గుర్తింపు గురించి ప్రస్తావిస్తూ, రాజేంద్ర ప్రసాద్ అంతర్జాతీయ స్థాయిలో తనకు లభించిన సన్మానాలను గుర్తు చేసుకున్నారు. న్యూజెర్సీ అసెంబ్లీలో తీర్మానం చేసి తనకు సన్మానం చేశారని, అలాగే ఆస్ట్రేలియన్ పార్లమెంట్ హాల్‌లో తెలుగువారి కోరిక మేరకు ఓ పండుగ సందర్భంగా తనకు సన్మానం లభించిందని చెప్పారు.

ఎక్కువ మంది చదివినవి : K. Raghavendra Rao : నా జీవితంలో ఇప్పటికీ ఎప్పటికీ మర్చిపోలేని సాంగ్ అది.. తెలుగు చరిత్రలో ఒక గొప్ప మైలురాయి.. రాఘవేంద్రరావు..

ఎక్కువ మంది చదివినవి :  Cinema : వామ్మో.. ఇదేక్కడి క్రేజ్ భయ్యా.. 3 సీజన్స్.. 33 ఎపిసోడ్స్.. 6 సంవత్సరాలుగా ఓటీటీలో సంచలనం సృష్టిస్తున్న సిరీస్..

Follow Us