Pragathi : ఆ వాన సాంగ్ వల్ల హీరోయిన్గా సినిమాలు చేయడం మానేశా.. నటి ప్రగతి కామెంట్స్..
దర్శకులు ఒక నటి ఎదుగుదలకు మూలస్తంభాలని ప్రగతి అన్నారు. తన కెరీర్ ఆరంభంలో వర్షం పాటలు చేయడం చాలా కష్టంగా ఉండేదని, ఒక దర్శకుడి కఠిన వ్యాఖ్యలు తనను బాధపెట్టాయని ఆమె వెల్లడించారు. అయితే, ఇప్పుడు మంచి దర్శకులతో పనిచేస్తున్నప్పుడు వాటిని ఆస్వాదిస్తున్నానని, తన ప్రయాణంలో వచ్చిన మార్పును వివరించారు.

టాలీవుడ్ నటి ప్రగతి తన కెరీర్ ప్రయాణాన్ని, ముఖ్యంగా టాలీవుడ్‌లో దర్శకుల పాత్రను, వర్షం పాటలతో ఆమెకున్న అనుబంధాన్ని ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఒక కళాకారిణిగా తన ఎదుగుదలకు, తనలో నటనకు సంబంధించిన కొత్త పార్శ్వాలను వెలికితీయడానికి దర్శకులే ప్రధాన కారణమని ఆమె స్పష్టం చేశారు. డైరెక్టర్స్ డే సందర్భంగా, తన కెరీర్‌లో పనిచేసిన ఎంతోమంది దర్శకులకు ఆమె హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ప్రగతి మాట్లాడుతూ, “ఒక ఆర్టిస్ట్ ఎదగాలన్నా, ఒక ఆర్టిస్ట్ గురించి జనాలు మాట్లాడుకోవాలన్నా, ప్రతి దానికీ కారణం ఒక డైరెక్టర్. డైరెక్టర్ అనేవాడు ప్రతి సినిమాకి మెయిన్ పిల్లర్. నేను డిఫరెంట్ డిఫరెంట్ డైరెక్టర్స్ తో పనిచేసినప్పుడు, డిఫరెంట్ డిఫరెంట్ వేరియేషన్స్ చూస్తూ ఉంటాను. నాలో నేను కొత్త యాక్టర్ ని చూస్తూ ఉంటాను. ఆ క్రెడిట్ మొత్తం ఆ డైరెక్టర్ గారికే వెళ్తుంది” అని పేర్కొన్నారు. ప్రస్తుతం తాను పనిచేస్తున్న దర్శకుడితో కూడా కొత్త విషయాలు నేర్చుకుంటున్నానని, ఆయన కూడా తనతో కొత్తగా ప్రయత్నిస్తున్నారని, ఇది తనకు చాలా ఆనందంగా ఉందని ఆమె తెలిపారు.
వర్షం పాటలలో తన అనుభవాల గురించి ప్రగతి వివరంగా తెలియజేశారు. తన కెరీర్ ఆరంభంలో వర్షం పాటలలో నటించడం చాలా ఇబ్బందికరంగా ఉండేదని, అది చాలా కష్టమైన విషయమని ఆమె అన్నారు. ముఖ్యంగా ఒక మహిళా కళాకారిణికి ఇది మరింత కష్టమని ఆమె చెప్పారు. “నాకు వర్షం అంటే చాలా చాలా ఇష్టం, కానీ వర్షంలో తడవటం అనేది చాలా కష్టం. ఒక ఆర్టిస్ట్ గా అది చాలా కష్టమైన విషయం” అని ఆమె వివరించారు.
తన కెరీర్ తొలినాళ్లలో ఒక సంఘటనను గుర్తుచేసుకుంటూ, ఒక వర్షం పాట చేస్తుంటే తాను ఇబ్బందిపడి, ఇష్టం లేదని చెప్పానని ప్రగతి తెలిపారు. దానికి ఆ దర్శకుడు, “చూడమ్మా, నీకు ఇష్టం లేకపోతే వెళ్ళిపో. నీ ప్లేస్ లో చేయడానికి చాలామంది ఉన్నారు” అని అన్నారని, ఆ మాటలు తనకు చాలా కోపం తెప్పించాయని ఆమె చెప్పారు. అయితే, అప్పట్లో అది తన కెరీర్ ప్రారంభ దశ కావడంతో తాను ఏమీ చేయలేకపోయానని అన్నారు. ఆరోజు ఆ పాట చేసినప్పటికీ, ఆ తర్వాత తాను ఏ వర్షం పాట చేసినా ఆ సంఘటన తన మనసులో నిలిచిపోయేదని ఆమె వివరించారు. ఆ చేదు అనుభవం తర్వాత కూడా వర్షం పాటలు చేసేటప్పుడు ఆ కష్టం వెంటాడేదని ప్రగతి పేర్కొన్నారు.
ఎక్కువ మంది చదివినవి : Tollywood: సినిమా మొత్తం హీరో ఒకే రంగు షర్ట్ లో ఉంటాడు.. హిట్టు కాదన్నారు.. థియేటర్లు హౌస్ ఫుల్ అయ్యాయి..
ఎక్కువ మంది చదివినవి : Tollywood : ఆ సినిమా తర్వాత హీరోయిన్‌కు వెండి పళ్లెంలో పట్టు బట్టలు ఇచ్చాను.. డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి..
