AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏడాదికి 4 సార్లు ఉచితంగా సిబిల్ స్కోర్ రిపోర్ట్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.. చాలా సింపుల్..

ప్రస్తుత ఆర్ధిక పరిస్థితుల్లో చాలామంది బ్యాంకుల నుంచి వివిధ రకాల రుణాలు తీసుకుంటున్నారు. అయితే మీరు ఏ రుణం తీసుకోవాలన్నా క్రెడిట్ స్కోర్ మెరుగ్గా ఉండాలి. క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉంటే ఏ బ్యాంక్ కూడా మీకు రుణాలు, క్రెడిట్ కార్డులు మంజూరు చేయదు.

ఏడాదికి 4 సార్లు ఉచితంగా సిబిల్ స్కోర్ రిపోర్ట్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.. చాలా సింపుల్..
Sibil Score
Venkatrao Lella
|

Updated on: Nov 17, 2026 | 10:03 PM

Share

మీకు బ్యాంక్ నుంచి రుణాలు రావాలన్నా, క్రెడిట్ కార్డులు తీసుకోవాలన్నా సిబిల్ స్కోర్ అనేది తప్పనిసరి. సిబిల్ స్కోర్ మెరుగ్గా లేకపోతే ఏ బ్యాంక్ రుణం లేదా క్రెడిట్ కార్డులు జారీ చేయవు. దీంతో మీరు భవిష్యత్తులో రుణాలు పొందాలని భావిస్తున్నా.. క్రెడిట్ కార్డు కోసం అప్లై చేసుకుంటున్నా క్రెడిట్ రిపోర్ట్ తప్పనిసరిగా చెక్ చేసుకోవాలి. కేవలం ఇదే కాదు మీ పేరుపై జరిగే ఆర్ధిక మోసాలకు చెక్ పెట్టాలన్నా తప్పనిసరిగా తనిఖీ చేసుకోవాలి. మీకు తెలియకుండా మీ పేరుపై తీసుకునే మోసపూరిత రుణాలు బయటపడతాయి. మీ పాన్ కార్డు ద్వారా ఎవరైనా లోన్ తీసుకున్నా ఇది చూసుకోవడం వల్ల మీకు తెలిసిపోతుంది. దీంతో మీరు వెంటనే స్పందించడం వల్ల మోసాల నుంచి బయటపడతారు.

నాలుగుసార్లు ఫ్రీ

మీరు క్రెడిట్ రిపోర్ట్ చెక్ చేసుకోవడానికి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఏడాదికి నాలుగుసార్లు ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మీరు ఏజెంట్‌ లేదా థర్డ్ పార్టీని ఆశ్రయించాల్సిన అవసరం లేదు. ఆన్లైన్ ద్వారా చూసుకోవచ్చు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రూల్స్ ప్రకారం.. దేశంలోని అన్ని క్రెడిట్ బ్యూరోలు ప్రతి ఏడాదికి ఒకసారి ఉచితంగా క్రెడిట్ రిపోర్ట్‌ను చూసుకునే అవకాశం కల్పిస్తున్నాయి. భారతదేశంలో మొత్తం నాలుగు క్రెడిట్ బ్యూరోలు రిపోర్ట్ అందిస్తున్నాయి. ట్రాన్స్‌యూనియన్ సిబిల్, ఎక్స్‌పీరియన్, ఈక్విఫాక్స్, సిఆర్ఐఎఫ్ హై మార్క్ రిపోర్ట్ సేవలను అందిస్తున్నాయి. మీరు ఒక్కొ సంస్థను నుంచి ఒకసారి రిపోర్ట్ డౌన్ లోడ్ చేసుకోవచ్చు. దీని వల్ల నాలుగు సార్లు ఫ్రీగా క్రెడిట్ స్కోర్ తనిఖీ చేసుకోవచ్చు.

ఆన్‌లైన్‌లో ఉచిత క్రెడిట్ రిపోర్ట్‌ ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి..?

– సిబిల్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి

– మీ మొబైల్ నెంబర్‌తో లాగిన్ అవ్వండి. ఇప్పటివరకు అకౌంట్ లేకపోతే ముందుగా ఖాతా సృష్టించుకోండి

-మీ ఇమెయిల్, మొబైల్ నంబర్, ఇతర అవసరమైన సమాచారాన్ని అందించండి

-మీ మొబైల్‌కు వచ్చిన OTPని నమోదు చేయండి

-Run your Free Report ఆప్షణ్‌పై  క్లిక్ చేయండి.

-అక్కడ మీ క్రెడిట్ రిపోర్ట్ చూడటంతోె పాటు డౌన్ లోడ్ కూడా చేసుకోవచ్చు

-ఎక్స్పీరియన్, ఈక్విఫాక్స్, CRIF హై మార్క్ లాంటి వెబ్ సైట్ల నుంచి కూడా ఇదే తరహాలో చూసుకోవచ్చు

Follow Us