Folk Song: అబ్బబ్బ ఏమున్నది పాట.. డీజేలో మోత మోగిపోతుందిగా.. వింటే స్టెప్పేయాల్సిందే..
ఫోక్ సాంగ్స్ .. కొన్నాళ్లుగా సోషల్ మీడియా, యూట్యూబ్ ను షేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. రోజుకో పాట నెట్టింట సెన్సేషన్ అవుతుంది. ఇక ఇప్పుడు పాత పాటలకు సరికొత్తగా మార్చి డీజే వెర్షన్ లో రిలీజ్ చేస్తున్నారు. ఇప్పుడు అలాంటి ఓ పాట నెట్టింట దుమ్మురేపుతుంది. అటు వినాయక నిమజ్జనంలో డీజేలలో ఈ పాట మోగిపోతుంది.

ప్రస్తుతం తెలంగాణ పల్లె పాటలకు ప్రపంచమే ఫిదా అవుతున్న సంగతి తెలిసిందే. భాష అర్థం కాకపోయినా దేశ సరిహద్దులు దాటి ఈ ఫోక్ సాంగ్స్ దుమ్మురేపుతున్నాయి. ఇక యూట్యూబ్, సోషల్ మీడియాలో ఈ పాటలకు వచ్చే క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. ముఖ్యంగా పల్లెటూరి వాతావరణం, అక్కడి మనుషుల ఆత్మీయతలు, అందచందాలను ప్రతిబింబించే పాటలు ఎంతో మందిని అలరిస్తుంటాయి. కొన్నాళ్లుగా ఫోక్ సాంగ్స్ సంచలనం సృష్టిస్తున్నాయి. ఇక ఇప్పుడు ఎక్కడా విన్నా ఓ పాట మారుమోగుతుంది. మనం మాట్లాడుకుంటున్న ఆ సాంగ్ పేరు “అబ్బబ్బగా పోరి”. ఈ పాట డీజేలలో మోత మోగిపోతుందనే చెప్పాలి. జోగుల వెంకటేష్ పాడిన ఈ పాట పల్లెటూరి యువతి అందాన్ని, ఆమె నడక తీరును, అలంకారాన్ని ఎంతో ముచ్చటగా వర్ణిస్తుంది. కళ్యాణ్ కీస్ అందించిన సంగీతం కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తుంది. మాధురి రాథోడ్, ఈశ్వర్ సాయి నటించిన ఈ వీడియో సాంగ్ తమ నటనతో, ఆకట్టుకునే డ్యాన్స్ మూవ్స్‌తో పాటను మరింత రక్తికట్టించారు.
ఎక్కువ మంది చదివినవి : Tollywood : తొలి సూపర్ స్టార్ కమెడియన్.. ఖరీదైన కారులో ప్రయాణించి.. 44 ఏళ్ళ వయసులోనే రైల్వే స్టేషన్ రోడ్డు మీద అనాథలా..
తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో ఉపయోగించే నాటు పదాలు, అందమైన యాస ఈ పాటకు ప్రధాన బలం. “పట్టు చీర పైట రప రప లాడంగా”, “జడనిండా చామంతి పువ్వులే పెట్టింది” వంటి పదాలు పల్లెటూరి వాతావరణాన్ని కళ్లకు కడతాయి. వినగానే కాళ్లకు ఊపు తెప్పించే బీట్, జానపద శైలికి తగినట్లుగా సాగే ఆకట్టుకునే ట్యూన్ ఈ పాటను యూట్యూబ్‌లో ట్రెండింగ్ శ్రేణిలో నిలబెట్టాయి.
ఎక్కువ మంది చదివినవి : Pragathi : ఆ వాన సాంగ్ వల్ల హీరోయిన్గా సినిమాలు చేయడం మానేశా.. నటి ప్రగతి కామెంట్స్..
ప్రస్తుతం ఈ సాంగ్ యూట్యూబ్ లో దూసుకుపోతుంది. ఇప్పటివరకు 61 లక్షలకు పైగా వ్యూస్ రాబట్టింది. ఇప్పుడు వినాయక నిమజ్జనంలో ఈ పాట డీజేలలో మారుమోగుతుంది.
ఎక్కువ మంది చదివినవి : K. Raghavendra Rao : నా జీవితంలో ఇప్పటికీ ఎప్పటికీ మర్చిపోలేని సాంగ్ అది.. తెలుగు చరిత్రలో ఒక గొప్ప మైలురాయి.. రాఘవేంద్రరావు..
అబ్బబ్బ గా పోరీ సాంగ్..
ఎక్కువ మంది చదివినవి : Cinema : వామ్మో.. ఇదేక్కడి క్రేజ్ భయ్యా.. 3 సీజన్స్.. 33 ఎపిసోడ్స్.. 6 సంవత్సరాలుగా ఓటీటీలో సంచలనం సృష్టిస్తున్న సిరీస్..
సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
