AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Weather Report: పొంచిఉన్న అల్పపీడనం.. తెలుగురాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉండబోతుందంటే?

తెలుగురాష్ట్రాలకు వాతావరణ శాఖ కీలక సూచనలు జారీ చేసింది. ఉత్తర అంతర్గత ఒడిశాపై ఉన్న అల్పపీడనం, దానికి సంబంధించిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఏపీ, తెలంగాణలో రాబోయే మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే చాన్స్ ఉందని అంచనా వేసింది. కాబట్టి ఏ జిల్లాల్లో వాతావరణం ఎలా ఉండబోతుందో చూద్దాం.

Weather Report: పొంచిఉన్న అల్పపీడనం.. తెలుగురాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉండబోతుందంటే?
Andhra Telangana Rain Forecast
Anand T
|

Updated on: Nov 21, 2026 | 12:41 PM

Share

ఉత్తర అంతర్గత ఒడిశాపై ఉన్న అల్పపీడన ప్రాంతం, ఉత్తర ఛత్తీస్‌గఢ్, దాని పరిసర ప్రాంతాలపైకి విస్తరించిందని.. దీనికి సంబంధించిన ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి, ఎత్తు వెళ్లేకొద్దీ నైరుతి దిశగా వంగి ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల మూడు రోజుల పాటు పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.

రాష్ట్రంలో రాబోయే 3 రోజుల వాతావరణం ఇదే

కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం: అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో కోస్తాంధ్ర ప్రాంతంలో శని, ఆదివారాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముందని.. సోమవారం ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేసింది. అలాగే వర్షాల సమయంలో గంటకు 40 నుండి 50 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉందని తెలిపింది.

రాయలసీమ: ఇక రాయలసీమలోని పలు ప్రాంతాల్లో శని, ఆదివారాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముందని.. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముందని తెలిపింది. అలాగే బలమైన గాలులు గంటకు 30-40 కి.మీ వేగంతో వీచే అవకాశం ఉందని తెలిపింది.

తెలంగాణలో వాతావరణం ఇలా

ఇక ఈ అల్పపీడనం, ఉపరితల ఆవర్తన ప్రభావం ఇటు తెలంగాణపై కూడా ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో రాబోయే మూడు రోజుల పాటు కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షాలు కూడా కురుస్తాయని తెలిపింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us