ఉసిరి ఎవరు తినకూడదో తెలుసా?

samatha

20 November 2026

Pic credit - Pinterest

శీతాకాలం వచ్చిందంటే చాలు ఉసిరి ఎక్కువగా లభిస్తుంది. అందుకే చాలా మంది ఈ సమయంలో దీనిని ఎక్కువగా తింటుంటారు.

శీతాకాలం

ఇక ఉసిరితో ఊహించని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి.

ఆరోగ్య ప్రయోజనాలు

అందువలన ప్రతి రోజూ ఒక ఉసిరి తినడం వలన ఇది శరీరానికి చాలా మేలు చేస్తుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.

శరీరానికి మేలు

అయితే ఇది ఆరోగ్యానికి చాలా మంచిదే అయినప్పటికీ కొంత మంది అస్సలే దీనిని తినకూడదు అని చెబుతున్నారు పండితులు. దాని గురించి తెలుసుకుందాం.

కొందరు తినకూడదు

షుగర్ తక్కువగా ఉన్నవారు అస్సలే ఉసిరి తినకూడదు. దీని వలన శరీరంలో షుగర్ లెవల్స్ ఇంకా తగ్గిపోయే ఛాన్స్ ఉంది.

షుగర్ తక్కువగా ఉన్నవారు

అంతే కాకుండా ఎవరు అయితే బీపీ మందులు వేసుకుంటున్నారో వారు కూడా వీలైనంత వరకు డాక్టర్‌ను సంప్రదించిన తర్వాతనే ఉసిరి తినాలి.

బీపీ మందులు

ఉసిరి పుల్లటి స్వభావం కలిగి ఉంటుంది అందువలన, గ్యాస్, ఎసిడిటీ, అల్సర్ ఉన్నవాళ్ళు పరగడుపున తినకూడదు, కడుపు మంట వస్తుంది.

గ్యాస్ ఎసిడిటీ

అదే విధంగా రక్తం పలుచగా చేసే మాత్రలు వేసుకునే వాళ్ళు కూడదు తినకూడదు, ఎందుకు అంటే? రక్తస్రావం అయ్యే ప్రమాదం ఉంది.

రక్తం పలచబడే మందులు వాడే వారు