AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shubman Gill: సెంచరీ మిస్ అయినా చరిత్ర సృష్టించిన గిల్.. తొలి భారతీయుడిగా రికార్డు

Shubman Gill: న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో శుభ్‌మన్ గిల్ 98 పరుగుల వద్ద ఔటైనా WTCలో 3 వేల పరుగులు చేసిన తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించాడు. రిషభ్ పంత్ కూడా ఈ మైలురాయిని అందుకున్నాడు. మరోవైపు యశస్వి జైస్వాల్ 2,673 పరుగులతో విరాట్ కోహ్లీని వెనక్కి నెట్టి టాప్-5లోకి చేరాడు. WTCలో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్ల జాబితా ఇదే.

Shubman Gill: సెంచరీ మిస్ అయినా చరిత్ర సృష్టించిన గిల్.. తొలి భారతీయుడిగా రికార్డు
Shubman Gill Test
Rakesh
|

Updated on: Nov 21, 2026 | 1:09 PM

Share

Shubman Gill: భారత్, న్యూజిలాండ్ మధ్య వెల్లింగ్టన్‌లో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అరుదైన ఘనత సాధించాడు. మూడో రోజు ఆటలో 98 పరుగుల వద్ద ఔటై సెంచరీ చేజార్చుకున్నప్పటికీ, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) చరిత్రలో 3 వేల పరుగుల మైలురాయిని అందుకున్న తొలి భారత బ్యాటర్‌గా నిలిచాడు. ఇదే మ్యాచ్‌లో రిషభ్ పంత్ కూడా ఈ ఘనత సాధించాడు. మరోవైపు యశస్వి జైస్వాల్ తన 85 పరుగుల ఇన్నింగ్స్‌తో విరాట్ కోహ్లీని వెనక్కి నెట్టి టాప్-5లోకి వచ్చాడు.

3 వేల పరుగుల క్లబ్‌లో గిల్

న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో గిల్ 146 బంతుల్లో 98 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లో 9 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. అయితే మూడో రోజు చివరి ఓవర్లో జేకబ్ డఫీ బౌలింగ్‌లో బౌల్డ్ కావడంతో శతకానికి రెండు పరుగుల దూరంలో నిలిచిపోయాడు. అయినప్పటికీ ఈ ఇన్నింగ్స్‌తో డబ్ల్యూటీసీలో గిల్ పరుగుల సంఖ్య 3,015కు చేరింది. ఇప్పటివరకు 43 టెస్టుల్లో 77 ఇన్నింగ్స్‌లు ఆడిన గిల్ 43కు పైగా సగటుతో ఈ పరుగులు సాధించాడు. ఇందులో 10 సెంచరీలు, 10 అర్ధ సెంచరీలు ఉన్నాయి.

రెండో భారతీయుడిగా రికార్డు

టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ కూడా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ లో 3 వేల పరుగుల మార్కును దాటాడు. న్యూజిలాండ్‌తో మూడో రోజు ఆట ముగిసే సమయానికి అతడు 55 పరుగులతో నాటౌట్‌గా ఉన్నాడు. దీంతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ లో పంత్ పరుగుల సంఖ్య 3,003కు చేరింది. ఇప్పటివరకు 43 మ్యాచ్‌ల్లో 75 ఇన్నింగ్స్‌లు ఆడిన పంత్ 42.90 సగటుతో పరుగులు చేశాడు. అతడి ఖాతాలో 6 సెంచరీలు, 19 అర్ధ సెంచరీలు ఉన్నాయి. నాలుగో రోజు కూడా బ్యాటింగ్ చేసే అవకాశం ఉండటంతో గిల్‌ను దాటి అగ్రస్థానానికి చేరుకునే ఛాన్స్ పంత్‌కు ఉంది.

కోహ్లీని వెనక్కి నెట్టిన జైస్వాల్

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్ల జాబితాలో యశస్వి జైస్వాల్ ఐదో స్థానానికి చేరుకున్నాడు. వెల్లింగ్టన్ టెస్టులో 85 పరుగులు చేసిన అతడు తన మొత్తం WTC పరుగులను 2,673కు పెంచుకున్నాడు. ఇప్పటివరకు 31 మ్యాచ్‌ల్లో 57 ఇన్నింగ్స్‌లు ఆడిన జైస్వాల్ 48.60 సగటుతో పరుగులు చేశాడు. దీంతో 2,617 పరుగులతో ఉన్న విరాట్ కోహ్లీని ఆరో స్థానానికి నెట్టాడు. జైస్వాల్ ప్రదర్శనతో భారత క్రికెట్‌లో మరో యువ బ్యాటర్ తన స్థానం బలపరుచుకున్నాడు.

అత్యధిక పరుగులు చేసిన టాప్-5 బ్యాటర్లు

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ లో భారత బ్యాటర్ల పరుగుల జాబితాలో గిల్ 3,015 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నాడు. పంత్ 3,003 పరుగులతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్ శర్మ 2,716 పరుగులతో మూడో స్థానంలో ఉన్నాడు. రవీంద్ర జడేజా 2,675 పరుగులతో నాలుగో స్థానంలో ఉండగా, జైస్వాల్ 2,673 పరుగులతో ఐదో స్థానానికి చేరుకున్నాడు. విరాట్ కోహ్లీ 2,617 పరుగులతో ఆరో స్థానంలో ఉన్నాడు. కేఎల్ రాహుల్ 2,419 పరుగులతో ఏడో స్థానంలో కొనసాగుతున్నాడు. ఈ జాబితాలో యువ ఆటగాళ్లు పైకి రావడం భారత టెస్ట్ క్రికెట్‌కు మంచి సంకేతంగా చెప్పొచ్చు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us