AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 10 Telugu : షాలినీ తీరు మార్చుకో.. వర్షిణికి సంచాలక్ పవర్ కట్.. ఒక్కొక్కరిని ఎండగట్టిన నాగ్..

బిగ్ బాస్ చరిత్రలోనే శనివారం ఎపిసోడ్ కు ఉండే హైప్ గురించి చెప్పక్కర్లేదు. ఎందుకంటే వారం మొత్తం హౌస్ లో జరిగిన గొడవలు, కంటెస్టెంట్స్ తీరును చూపిస్తూ హోస్ట్ నాగార్జున ఉతికారేసింది అప్పుడే. ఇక సీజన్ 10లో సెప్టెంబర్ 19 శనివారం ఎపిసోడ్ లో కంటెస్టెంట్లకు చూపించారు నాగ్.

Bigg Boss 10 Telugu : షాలినీ తీరు మార్చుకో.. వర్షిణికి సంచాలక్ పవర్ కట్.. ఒక్కొక్కరిని ఎండగట్టిన నాగ్..
Bigg Boss 10 Telugu September 19th Episode
Rajitha Chanti
|

Updated on: Sep 20, 2026 | 8:02 AM

Share

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 రెండో వారం శనివారం నాటి వీకెండ్ ఎపిసోడ్ రసవత్తరంగా సాగింది. హోస్ట్ అక్కినేని నాగార్జున హౌస్‌మేట్స్‌కు గట్టి క్లాస్ పీకడంతో పాటు వారి తప్పులను ఎండగట్టారు. ముఖ్యంగా షాలినీ, వర్షిణి, రోహిత్, వంశీ వంటి కంటెస్టెంట్లకు సీరియస్ వార్నింగ్స్ ఇచ్చారు. ఎపిసోడ్ ప్రారంభంలోనే హౌస్‌లో ఉన్న 15 మందిలో కేవలం 13 మందే కనిపిస్తున్నారని నాగార్జున అన్నారు. ఆటలో ఎలాంటి చురుకుదనం చూపించకుండా ప్రేక్షకుల్లా వ్యవహరిస్తున్నారంటూ సృష్టి, కృష్ణులను అందరికీ దూరంగా మూలలో కూర్చోబెట్టి మైండ్ బ్లాక్ అయ్యేలా షాక్ ఇచ్చారు. అలాగే ఈ వారం గేమ్‌లలో సంచాలక్‌గా వ్యవహరించిన వర్షిణి తీరుపై సీరియస్ అయ్యారు. ముఖేష్‌కు ఫేవర్‌గా నిర్ణయం తీసుకుందని, వంశీ చెప్పిన సరైన పాయింట్లను పట్టించుకోలేదని నాగ్ తప్పుబట్టారు. ప్రేక్షకులు కూడా వర్షిణి నిర్ణయానికి వ్యతిరేకంగా ఉండటంతో, ఈ సీజన్ పూర్తయ్యే వరకు ఆమెను సంచాలక్‌గా నియమించబోమని బిగ్ బాస్ శిక్ష విధించారు.

ఎక్కువ మంది చదివినవి : Folk Song: అబ్బబ్బ ఏమున్నది పాట.. డీజేలో మోత మోగిపోతుందిగా.. వింటే స్టెప్పేయాల్సిందే..

టాస్క్ సమయంలో షాలినీ ప్రవర్తనను నాగార్జున తీవ్రంగా ఖండించారు. ఎదుటివారిపైకి మీద మీదకు వెళ్లడం తప్పు అని మందలించారు. “వర్షిణి నిన్ను తోయలేదు, కేవలం టచ్ చేసింది. అనవసరంగా కోపాన్ని ప్రదర్శించవద్దు, ఆంగర్ మేనేజ్‌మెంట్ అలవాటు చేసుకో” అని హెచ్చరించారు. “నువ్వు చేసిందే రైట్ అని అనుకోవద్దు.. నువ్వు చేసిందే ఎదుటి వాళ్లు నీకు చేస్తే నువ్వు తట్టుకోలేవు.. నీకుండే హక్కులే.. అందరికీ ఉంటాయని గుర్తు పెట్టుకో..” అంటూ ఆమెను తీరు మార్చుకోమన్నారు. ఇక నాగ్ క్లాస్ పీకడంతో షాలినీ కంటతడి పెట్టుకుంది.

ఎక్కువ మంది చదివినవి : Cinema : వెంకటేశ్ హీరోగా లవ్ స్టోరీ.. తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్.. తెలుగులో పెద్ద డిజాస్టర్..

ఫిజికల్ టాస్కుల్లో అత్యుత్సాహం ప్రదర్శిస్తున్న రోహిత్‌కు నాగ్ సలహా ఇచ్చారు. “నీ పేరులోనే ‘హిట్’ ఉంది, ఆట బాగుంది కానీ ఆట తీరు మార్చుకో. కోపంతో రెచ్చిపోయేవాడు ఎప్పటికీ గెలవలేడు” అని స్పష్టం చేశారు. అలాగే, కిచెన్‌లో అరుస్తూ వంట చేయకూడదని వంశీకి వార్నింగ్ ఇచ్చారు. ప్రేమగా వండి, ప్రేమగా వడ్డిస్తేనే ఆ ఆహారం ఒంటికి పడుతుందని చురకలు వేశారు. ఇంట్లో కంటెస్టెంట్లు పగటిపూట నిద్రపోతుండటంతో, ఇకపై పగటివేళల్లో ఎవరూ బెడ్ రూమ్‌లోకి వెళ్లకూడదని నాగ్ రూల్ పెట్టారు. చివరగా ముఖేష్, షాలినీ, రామ్ ప్రసాద్, ఝాన్సీ, దేబ్జానీలు ఎలిమినేషన్ డేంజర్ జోన్ నుండి సేఫ్ అయినట్లు నాగార్జున ప్రకటించడంతో ఈ ఎపిసోడ్ ముగిసింది.

ఎక్కువ మంది చదివినవి : Udaya Bhanu: పస్తులు ఉండి ఇతరులకు అన్నం పెట్టిన గొప్ప వ్యక్తి ఆయన.. చివరకు అలాంటి పరిస్థితుల్లో.. ఉదయభాను ఎమోషనల్..

ఎక్కువ మంది చదివినవి : Udaya Bhanu: పస్తులు ఉండి ఇతరులకు అన్నం పెట్టిన గొప్ప వ్యక్తి ఆయన.. చివరకు అలాంటి పరిస్థితుల్లో.. ఉదయభాను ఎమోషనల్..

Follow Us