ENE Repeat Review: ENE రిపీట్ రివ్యూ.. కుర్రాళ్లు ఈజ్ బ్యాక్.. కామెడీ డ్రామా..!
2018లో తరుణ్ భాస్కర్ నుంచి వచ్చిన సినిమా ‘ఈ నగరానికి ఏమైంది?’.. ఈ సినిమాకు కల్ట్ ఫ్యాన్ బేస్ ఉంది.. అలాంటి సినిమాకు సీక్వెల్ చేయడం అంటే మాటలు కాదు.. తాజాగా ఈ చిత్ర పార్ట్ 2 విడుదలైంది.. ENE రిపీట్ పేరుతో వచ్చిన ఈ సినిమా మెప్పించిందా..? ఎలా ఉంది అనేది పూర్తి రివ్యూలో చూద్దాం..

మూవీ రివ్యూ: ENE రిపీట్
నటీనటులు: విశ్వక్ సేన్, మాగంటి శ్రీనాథ్, అభినవ్ గోమఠం, వెంకటేష్ కాకుమాను, గీతా భాస్కర్, జీవన్ కుమార్, మహేష్ చింతల, ప్రియదర్శిని రామ్ తదితరులు..
సంగీతం: వివేక్ సాగర్
సినిమాటోగ్రఫీ: ఏజే ఆరోన్
ఎడిటింగ్: రవితేజ గిరిజాల
దర్శకత్వం: తరుణ్ భాస్కర్
నిర్మాతలు: సృజన్ యరబోలు, సందీప్ నాగిరెడ్డి
కథ:
వివేక్ (విశ్వక్ సేన్), కార్తీక్ (మాగంటి శ్రీనాథ్), కౌశిక్ (అభినవ్ గోమఠం), ఉప్పి (వెంకటేష్ కాకుమాను) ప్రాణ స్నేహితులు. కలిసి తీసిన ఫస్ట్ మూవీ బోల్తా పడటంతో ఆర్థికంగా చిక్కుల్లో పడి, నలుగురూ తలో దారి చూసుకుని తమ కెరీర్‌లో బిజీ అవుతారు. పాత బాకీలు కట్టే భారం తనపై వేసుకున్న వివేక్ పెళ్లిళ్ల ఈవెంట్లు నిర్వహించే ఒక సంస్థలో జాబ్ చేస్తుంటాడు. కౌశిక్ యాక్టర్‌గా సెటిల్ అవ్వగా, ఉప్పి ఎడిటింగ్ వైపు, కార్తీక్ కెమెరామెన్‌గా తమ పనుల్లో పడిపోతారు. ఇలా సాగుతున్న టైమ్‌లో కొన్ని ఊహించని మలుపుల వల్ల ఉప్పి బంధువైన కీర్తన (శివాత్మిక రాజశేఖర్)తో కార్తీక్ ప్రేమలో పడతాడు. కానీ అప్పటికే ఆమెకు వేరే అబ్బాయితో పెళ్లి ఫిక్స్ అయిపోతుంది. ఈ గందరగోళం మధ్య కార్తీక్ తన లవ్‌ను దక్కించుకోవడానికి ఎలాంటి ప్రయత్నాలు చేశాడు, అతనికి తోడుగా మిగిలిన ముగ్గురు ఫ్రెండ్స్ చేసిన హంగామా ఏంటి, చివరికి వాళ్ల ఫ్రెండ్‌షిప్ ఎలా నిలబడింది అన్నదే ఈ కథ..
కథనం:
తొలి భాగంతో యూత్‌లో మంచి క్రేజ్ తెచ్చుకున్న డైరెక్టర్ తరుణ్ భాస్కర్ మరోసారి తన పెన్ పవర్ చూపించారు. నాలుగు బలమైన క్యారెక్టర్లను డిజైన్ చేసి, వాటి చుట్టూ సరదాగా నడిచేలా స్క్రీన్‌ప్లే అల్లుకున్నారు. ఫస్ట్ పార్ట్ ఫార్మాట్‌నే ఫాలో అవుతూ, ఈసారి బ్యాక్‌డ్రాప్ మార్చి కథనాన్ని ముందుకు తీసుకెళ్లారు. అదే నలుగురు గ్యాంగ్ మళ్లీ కొత్త సమస్యల్లో చిక్కుకుని, తమ సత్తా చాటుకోవడానికి మరో సినిమా తీయాల్సి రావడం అనే పాయింట్ చుట్టూ డ్రామా నడుస్తుంది. ఈ జనరేషన్‌కు ఇట్టే కనెక్ట్ అయ్యే వన్-లైనర్స్, హుషారైన డైలాగ్స్‌తో ఫస్ట్ హాఫ్ అంతా చాలా సరదాగా, నవ్వులతో గడిచిపోతుంది. అభినవ్ గోమఠం అయితే కావాల్సినంత మీమ్ కంటెంట్ మరోసారి ఇచ్చేసాడు. ముఖ్యంగా ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌లో భల్లూకంతో వచ్చే కామెడీ ఎపిసోడ్ థియేటర్లలో గట్టిగా నవ్వులు పూయిస్తుంది. అలాగే మధ్యమధ్యలో మెరిసే స్పెషల్ గెస్ట్ రోల్స్ కూడా ఆడియన్స్‌కు మంచి కిక్ ఇస్తాయి. అయితే సినిమా ముందుకు వెళ్లేకొద్దీ కొన్ని మైనస్‌లు బయటపడతాయి. సీక్వెల్ అనగానే ప్రేక్షకులు కోరుకునే ఫ్రెష్‌నెస్ చాలా చోట్ల మిస్ అయింది. పాత పద్ధతిలోనే సాగే కొన్ని ఘట్టాలు సాగదీసినట్లు అనిపించి, అక్కడక్కడా గ్రిప్ తగ్గిన ఫీలింగ్ కలిగిస్తాయి. పైగా విశ్వక్ సేన్ పోషించిన వివేక్ రోల్‌కు ఇంకాస్త బలమైన స్కోప్ ఇచ్చి ఉంటే బాగుండేది. అసలు సమస్యకు తగ్గ సంతృప్తికరమైన పరిష్కారం చూపించకుండా, సరైన ఎమోషనల్ టచ్ పండకుండానే సినిమాను హడావిడిగా ముగించినట్లు అనిపిస్తుంది. అయితే జెన్ జీతో పాటు మామూలు ఆడియన్స్‌కు నచ్చేలా ఈ సినిమాను డిజైన్ చేసారు తరుణ్ భాస్కర్.
నటీనటులు:
ఈ సినిమాకు అసలైన పిల్లర్ అభినవ్ గోమఠం.. కౌశిక్ రోల్‌లో ఆయన పండించిన హ్యూమర్, బాడీ లాంగ్వేజ్, సరదా ఎక్స్‌ప్రెషన్స్ ఆడియన్స్‌ను కడుపుబ్బా నవ్విస్తాయి. ఫారెస్ట్ ట్రాక్‌లో ఆయన పెర్ఫార్మెన్స్ పీక్స్‌లో ఉంటుంది. విశ్వక్ సేన్ తనకు దక్కిన స్కోప్ మేరకు వివేక్ పాత్రలో డీసెంట్‌గా మెప్పించాడు. ఉప్పిగా వెంకటేష్ కాకుమాను ఎప్పటిలాగే నాచురల్‌గా ఆకట్టుకున్నాడు. కార్తీక్ పాత్రలో మాగంటి శ్రీనాథ్ తన వంతుగా రాణించినప్పటికీ, తొలి భాగంలో ఆ రోల్ చేసిన సాయి సుశాంత్ రెడ్డికి అలవాటు పడ్డ ఆడియన్స్ ఈ కొత్త ఫేస్‌కు సెట్ అవ్వడానికి కాస్త టైమ్ పడుతుంది. ఆ మార్పు కాస్త ఇబ్బందిగా అనిపించే అవకాశం ఉంది. హీరోయిన్ శివాత్మిక రాజశేఖర్ తన స్క్రీన్ ప్రెజెన్స్‌తో మంచి మార్కులు కొట్టేసింది. రాబిన్ పాత్రలో మహేష్ చింతల, అలాగే ప్రియదర్శిని రామ్ తమ తమ రోల్స్‌లో చక్కగా ఒదిగిపోయారు. మిగిలిన సపోర్టింగ్ ఆర్టిస్టులు, స్పెషల్ అప్పియరెన్స్ ఇచ్చిన వాళ్లంతా సినిమాకు అదనపు బలాన్నిచ్చారు.
టెక్నికల్ టీం:
వివేక్ సాగర్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమా మూడ్‌ను పర్ఫెక్ట్‌గా ఎలివేట్ చేసింది. ఎడిటర్ రవితేజ గిరిజాల తన కత్తెరకు పదును పెట్టి సినిమా ఫ్లోకు తగ్గట్టుగా నీట్ వర్క్ అందించారు. ఏజే ఆరోన్ కెమెరా వర్క్. నవ్వు తెప్పించే సందర్భాలను, ఇంపార్టెంట్ ఎపిసోడ్స్‌ను ఆయన విజువల్స్ చాలా రిచ్‌గా, ఫ్రెష్‌గా ప్రజెంట్ చేశాయి. నిర్మాతలు సృజన్ యరబోలు, సందీప్ నాగిరెడ్డి ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా పెట్టిన ఖర్చు, మేకింగ్ క్వాలిటీ స్క్రీన్ మీద క్లియర్‌గా కనిపిస్తోంది. తరుణ్ భాస్కర్ కూడా మరోసారి తన మ్యాజిక్ చూపించాడు. ఇందులో కామెడీతో పాటు ఫిలాసఫీ కూడా చాలా బాగా జొప్పించారు.
పంచ్ లైన్:
ఓవరాల్‌గా ENE రిపీట్.. సరదాగా సాగే ఫన్ ఫిల్డ్ ఎంటర్‌టైనర్..!
