AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఆ సినిమాను ఆ హీరో తప్ప మరెవరు చేయలేరు.. అందుకే నేను రిజెక్ట్ చేశా.. నటుడు సుమంత్..

యువకుడు, ప్రేమకథ వంటి చిత్రాలతో టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు హీరో సుమంత్. ఒకప్పుడు హీరోగా అలరించిన ఆయన.. ఇప్పుడు సహయ నటుడిగా మెప్పిస్తున్నారు. ప్రస్తుతం సుమంత్ నటించిన లేటేస్ట్ మూవీ న్యూటన్స్ థర్డ్ లా. ఈ సినిమాను తక్కువ స్క్రీన్లలో విడుదల చేసినప్పటికీ ప్రీమియర్ షోల తర్వాత వసూళ్లు పెరుగుతాయని అన్నారు. తెలుగు థ్రిల్లర్ చిత్రాలకు కొత్త మార్గాన్ని సుమంత్, త్రినాథ్ ఈ చిత్రంతో చూపిస్తున్నారు.

Tollywood: ఆ సినిమాను ఆ హీరో తప్ప మరెవరు చేయలేరు.. అందుకే నేను రిజెక్ట్ చేశా.. నటుడు సుమంత్..
Sumanth
Rajitha Chanti
|

Updated on: Aug 11, 2026 | 1:17 PM

Share

నటుడు సుమంత్ న్యూటన్స్ థర్డ్ లా మూవీ ప్రమోషన్లలో భాగంగా తన సినీ ప్రయాణం, కెరీర్ నిర్ణయాలపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అయిన దేశముదురు చిత్రాన్ని తాను ఎందుకు వదులుకోవాల్సి వచ్చిందో వివరించారు. తన కెరీర్‌లో నువ్వే కావాలి వంటి రెండు పెద్ద హిట్ చిత్రాలను డేట్స్ సమస్యల వల్ల, ముఖ్యంగా యువకుడు పెళ్లి సంబంధం చిత్రంతో బిజీగా ఉండటం వల్ల వదులుకోవాల్సి వచ్చిందని, అది తనకు ఒక పెద్ద రిగ్రెట్ అని సుమంత్ వెల్లడించారు. దేశముదురు చిత్రం గురించి మాట్లాడుతూ, తాను అప్పుడు ఆ ఆఫర్‌ను తిరస్కరించానని ఒప్పుకున్నారు. అయితే, ఫ్రాంక్‌గా చెప్పాలంటే, అల్లు అర్జున్ తప్ప ఆ సినిమాను మరెవరూ ఆడించలేరని, తాను చేసి ఉంటే అది ఆడేది కాదని బలంగా చెప్పారు.

ఎక్కువ మంది చదివినవి : Jason Sanjay: ఇద్దరి మధ్య ఎప్పుడూ గొడవలే.. దూరమయ్యాకే విలువ తెలిసింది.. విజయ్ దళపతి కొడుకు జాసన్ సంజయ్..

ప్రస్తుతం సుమంత్ నటిస్తున్న న్యూటన్స్ థర్డ్ లా చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా బడ్జెట్ విషయంలో రాజీ పడకుండా, అనుకున్న బడ్జెట్‌లోనే పూర్తి చేశారని, ఒక్క రోజు కూడా అదనంగా తీసుకోలేదని సుమంత్ వెల్లడించారు. ఈ చిత్రానికి క్లైమాక్స్ అద్భుతంగా ఉంటుందని, అది ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుందని పేర్కొన్నారు. మలయాళ థ్రిల్లర్ చిత్రాలకు తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆకర్షితులవుతారని, అయితే అడివి శేష్ క్షణం, గూఢాచారి వంటి చిత్రాలతో తెలుగులో కూడా అద్భుతమైన థ్రిల్లర్‌లను తీయవచ్చని నిరూపించారని సుమంత్ గుర్తు చేసుకున్నారు. ఆయన స్ఫూర్తితోనే ఈ కథ మరింత బెటర్‌గా తయారైందని, తెలుగులో కూడా మంచి థ్రిల్లర్ తీస్తే ఎంత బాగుంటుందో ఈ సినిమా ద్వారా చూపించాలనుకున్నామని చెప్పారు. ఈటీవీ నుంచి వస్తున్న ఈ ప్రయత్నం ఒక మలయాళ సినిమా కన్నా మంచి తెలుగు థ్రిల్లర్ తీయాలనే ఆకాంక్షతో కూడుకున్నదని ఆయన అన్నారు.

ఎక్కువ మంది చదివినవి : Cinema : ఓటీటీలో దుమ్మురేపుతున్న సస్పెన్స్ థ్రిల్లర్.. 3 ఏళ్లుగా ట్రెండ్ అవుతున్న క్రైమ్ సిరీస్..

ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్ గురించి మాట్లాడుతూ, సుమంత్ న్యూటన్స్ థర్డ్ లాలో చాలా కొత్తగా చూస్తున్నామని, త్రినాథ్ పాత్ర అద్భుతంగా ఉందని ఒక ఇంటర్వ్యూయర్ పేర్కొన్నారు. అయితే, సినిమా తక్కువ స్క్రీన్లలో విడుదలవుతున్నదనే ప్రశ్నపై, సుమంత్ స్పందిస్తూ, అది నిజం కాదని, ప్రారంభంలో 100 స్క్రీన్లలో విడుదల అవుతోందని, ఇది ఒక కొత్త సినిమాకు సరిపోతుందని భావిస్తున్నామని చెప్పారు. ప్రీమియర్ షోల రెస్పాన్స్ చాలా బాగుంది కాబట్టి, శనివారం నుండి థియేటర్ల సంఖ్య ఖచ్చితంగా పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : గ్లామర్ సీన్స్ చేస్తానని ఏడ్చేశాను.. నాకెందుకు అలాంటి సీన్స్ రాలేదు.. టాలీవుడ్ హీరోయిన్..

సుమంత్, అల్లు అర్జున్..

Sumanth, Allu Arjun

Sumanth, Allu Arjun

ఎక్కువ మంది చదివినవి :  Cinema : రూ.150 కోట్లు పెట్టి పరమ చెత్త సినిమా తీశారు.. ఇండస్ట్రీలో అతిపెద్ద డిజాస్టర్.. ఇప్పటికీ కోలుకోని నిర్మాత..

Follow Us