AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఒక్క రూపాయి కూడా కట్టక్కర్లేదు.. డ్రైవింగ్ లైసెన్స్‌ ఉన్నవారికి కేంద్రం సూపర్ న్యూస్..

Driving Licence: డ్రైవింగ్ లైసెన్స్ నిబంధనలను కేంద్ర ప్రభుత్వం కఠినతరం చేయనుంది. ఇందుకు సంబంధించి ముసాయిదాను సిద్దం చేసింది. త్వరలోనే వీటిని అమల్లోకి తీసుకుచ్చేందుకు కసరత్తు చేస్తోంది. రోడ్డు ప్రమాదాలను నివారించడమే లక్ష్యంగా డ్రైవింగ్ లైసెన్స్ జారీ ప్రక్రియను కఠినం చేస్తోంది. అయితే డ్రైవింగ్ లైసెన్స్‌లోని వివరాలను అప్డేట్ చేసుకునే ప్రక్రియను సులభతరం చేసింది.

ఒక్క రూపాయి కూడా కట్టక్కర్లేదు.. డ్రైవింగ్ లైసెన్స్‌ ఉన్నవారికి కేంద్రం సూపర్ న్యూస్..
Driving Licence
Venkatrao Lella
|

Updated on: Nov 27, 2026 | 1:48 PM

Share

డ్రైవింగ్ లైసెన్స్ పొందాలంటే ఇక ప్రక్రియ కఠినతరం కానుంది. ఇప్పటివరకు డ్రైవింగ్ లైసెన్స్ పొందే ప్రాసెస్ చాలా సింపుల్‌గా ఉండేది. ముందుగా లెర్నింగ్ లైసెన్స్ పరీక్ష రాసి, ఆ తర్వాత ఆరు నెలల్లోపు డ్రైవింగ్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి వచ్చేది. డ్రైవింగ్ టెస్ట్‌లో అర్హత సాధిస్తే 10 రోజుల్లో డ్రైవింగ్ లైసెన్స్ పోస్ట్ ద్వారా రవాణాశాఖ ఇంటికి పంపించేంది. కానీ ఇక నుంచి కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వశాఖ డ్రైవింగ్ లైసెన్స్ నిబంధనలను కఠినతరం చేసింది. ఈ మేరకు కేంద్ర మోటారు వాహన నిబంధనలకు ప్రధాన సవరణల ముసాయిదాను కేంద్రం సిద్ధం చేసింది. ఇందులో భాగంగా లెర్నింగ్ లైసెన్స్ పరీక్షను మరింత కఠినతరం చేస్తున్నారు. ఈ కొత్త రూల్స్ ఏంటనేది చూద్దాం.

లెర్నర్ లైసెన్స్ పరీక్ష మార్కులు పెంపు

గతంలో లెర్నర్ లైసెన్స్ పరీక్షలో ఉత్తీర్ణత మార్కులు 60 శాతంగా ఉండేది. కానీ ఇప్పుడు కనీసం 75 శాతం మార్కులు అవసరమయ్యేలా కొత్త నిబంధన తీసుకొస్తున్నారు. డ్రైవింగ్ లైసెన్స్ పొందే ముందు దరఖాస్తుదారులకు రహదారి చిహ్నాలు, ట్రాఫిక్ నియమాలు, సురక్షిత డ్రైవింగ్‌పై పూర్తి అవగాహన ఉండేలా చూసేందుకు ఉత్తీర్ణత మార్కులను పెంచారు. సురక్షిత డ్రైవింగ్‌పై ఆన్‌లైన్ ట్యుటోరియల్ కనీసం 30 నిమిషాల నిడివి ఉండేలా మార్పులు చేయనున్నారు. ఇది పూర్తి చేసేందుకు గతంలో నిర్ణయించిన ఏడు రోజుల సమయాన్ని 15 రోజులకు పెంచనున్నారు. ట్యుటోరియల్ పూర్తి చేసిన తర్వాత నిర్దేశించిన కాలపరిమితిలోపు లెర్నింగ్ లైసెన్స్ టెస్ట్ రాయాల్సి ఉంటుంది.

ఈ విషయంలో ఊరట

అయితే డ్రైవింగ్ లైసెన్స్ పొందినవారు తమ కార్డులోని వివరాలను అప్డేట్ చేసుకునే ప్రక్రియను మరింత సులభతరం చేశారు. మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడీ, అడ్రస్ వంటివి ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేకుండా ఉచితంగా అప్డేట్ చేసుకోవచ్చు. గతంలో ఇందుకోసం రూ.200 వరకు ఫీజులు వసూలు చేసేవారు. ఇప్పుడు వాటిని పూర్తిగా మాఫీ చేశారు. వ్యక్తిగత వివరాల్లో మార్పుల కోసం రిక్వెస్ట్ పెట్టుకున్నప్పుడు 15 రోజుల్లోపు నిర్ణయం తీసుకోవాలి. ఒకవేళ దరఖాస్తు రిజెక్ట్ చేస్తే సరైన కారణాలు పొందుపర్చాలి. అలాగే అడ్రస్‌లో మార్పులకు సంబంధించిన దరఖాస్తులను 30 రోజుల్లోపు నిర్ణయం తీసుకోకపోతే ఆటోమేటిక్‌గా ఆమోదం పొందినట్లు పరిగణిస్తారు. డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో మరింత పారదర్శకత తీసుకురావడం కోసం కేంద్రం ఈ కొత్త నిర్ణయాలు అమలు చేయాలని చూస్తోంది. దేశంలో రోడ్డు ప్రమాాదాలు రోజురోజుకి పెరుగుతున్నాయి. దీనికి కారణం నిబంధనలపై అవగామణ లేకపోవడమేనని కేంద్రం చెబుతోంది. దీంతో రోడ్డు ప్రమాదాలను కట్టడి చేసేందుకు డ్రైవింగ్ లైసెన్స్ నిబంధనలను కఠినం చేయనుంది.

Follow Us
అపూర్వమైన ప్రకృతి దృశ్యాలు.. ఊటీని మైమరిపించే పులిగుండాల
అపూర్వమైన ప్రకృతి దృశ్యాలు.. ఊటీని మైమరిపించే పులిగుండాల
ఒక సామాన్యుడి వేల కోట్ల సామ్రాజ్యం వెనుకున్న రహస్యం ఏమిటి?
ఒక సామాన్యుడి వేల కోట్ల సామ్రాజ్యం వెనుకున్న రహస్యం ఏమిటి?
కార్లు, బైకుల బీమా ప్రీమియంపై కేంద్రం కసరత్తు
కార్లు, బైకుల బీమా ప్రీమియంపై కేంద్రం కసరత్తు
ఇన్సూరెన్స్ లేని బండ్లకు బంకుల్లో నో పెట్రోల్
ఇన్సూరెన్స్ లేని బండ్లకు బంకుల్లో నో పెట్రోల్
ఓటు వేసినప్పుడే ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు వస్తుంది
ఓటు వేసినప్పుడే ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు వస్తుంది
పోటాపోటీగా సాగర్ నీళ్లు విడుదల చేసిన ఏపీ, తెలంగాణ అధికారులు
పోటాపోటీగా సాగర్ నీళ్లు విడుదల చేసిన ఏపీ, తెలంగాణ అధికారులు
కల్లాల్లోనే ధాన్యం రాశులు.. కన్నీరు పెడుతున్న రైతులు
కల్లాల్లోనే ధాన్యం రాశులు.. కన్నీరు పెడుతున్న రైతులు
వరుస చోరీలతో విసిగి.. మాటు వేసి.. దొంగలను పట్టుకున్న రైతులు
వరుస చోరీలతో విసిగి.. మాటు వేసి.. దొంగలను పట్టుకున్న రైతులు
మాకేమైనా బిచ్చం వేస్తున్నారా? ఎస్పీపై కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం
మాకేమైనా బిచ్చం వేస్తున్నారా? ఎస్పీపై కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం
కరెంటు కనెక్షన్ కట్ చేస్తామని కాల్ వస్తే.. చెక్ చేయాల్సిందే
కరెంటు కనెక్షన్ కట్ చేస్తామని కాల్ వస్తే.. చెక్ చేయాల్సిందే