AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. వైకుంఠ ద్వార దర్శనాలకు టికెట్ల విడుదల అప్పుడే..

వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి టోకెన్ల విడుదల తేదీని టీటీడీ ప్రకటించింది. నవంబర్ 28వ తేదీ నుంచి టోకెన్లను రిలీజ్ చేయనుంది. ఈ సారి సామాన్య భక్తులకు దర్శనాలు కల్పించేందుకు టీటీడీ మొగ్గు చూపింది. ఎక్కువ టోకెన్లను సామాన్యులకే కేటాయించనుంది. వివరాలు ఇవిగో..

శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. వైకుంఠ ద్వార దర్శనాలకు టికెట్ల విడుదల అప్పుడే..
Tirumala
Venkatrao Lella
|

Updated on: Nov 27, 2026 | 2:17 PM

Share

తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ తెలిపింది. వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించిన టికెట్ల విడుదల తేదీలను ఎట్టకేలకు ప్రకటించింది. ఈ మేరకు ఒక షెడ్యూల్ తాజాగా టీటీడీ విడుదల చేసింది. ఈ నెల 28వ తేదీన శ్రీవాణి దర్శనం టికెట్లు జారీ చేయనున్నట్లు ప్రకటించిన టీటీడీ.. ఆ తర్వాత 30వ తేదీన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించింది. ఇక టోకెన్లు లేనివారికి కూడా దర్శన అవకాశం కల్పించనుంది. నేరుగా తిరుమలలోని ఉచిత క్యూలైన్లలోకి వెళ్లి స్వామివారి వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవచ్చు.

టైమింగ్స్ ఇవే..

-నవంబర్ 28వ తేదీన ఉదయం 10 గంటలకు శ్రీవాణి దర్శన కోటా టికెట్లను ఆన్లైన్‌లో విడుదల చేయనున్నారు

-నవంబర్ 30వ తేదీన ఉదయం 10 గంటలకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను రిలీజ్ చేయనున్నారు

-స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్లు(ఎస్‌ఎస్‌డీ) కోసం డిసెంబర్ 1 నుంచి 5వ తేదీ వరకు లక్కీ డిప్ ఉంటుంది. డిసెంబర్ 1న ఉదయం 10 గంటల నుంచి ప్రారంభం కానున్న లక్కీ డిప్ ప్రక్రియ డిసెంబర్ 5 సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతోంది. డిసెంబర్ 7న మధ్యాహ్నం మూడు గంటలకు ఈ-డిప్‌ ద్వారా టోకెన్లు కేటాయిస్తారు

-డిసెంబర్ 8వ తేదీన దాతల దర్శన టోకెన్లను విడుదల చేయనున్నారు.

దర్శనాలు ఎప్పుడంటే..?

డిసెంబర్ 20,21వ తేదీల్లో స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్లు పొందిన భక్తులకు దర్శనం ఉంటుంది. ఈ రెండు రోజుల్లో రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను రద్దు చేశారు. వైకుంఠ ద్వార దర్శనం టికెట్లు అన్నీ ఆన్లైన్ ద్వారా విడుదల చేస్తున్నారు. ఎప్పటిలాగే టోకెన్లు లేని భక్తులు తిరుమలలో నేరుగా క్యూలైన్‌లోకి వచ్చి స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. https://ttdevasthanams.ap.gov.in మాత్రమే టికెట్లను బుక్ చేసుకోవాలని టీటీడీ తెలిపింది. దళారులను నమ్మి మోసపోవద్దని సూచించింది. వైకుంఠ ఏకాదశి, ద్వాదశి తొలి రెండు రోజులైన డిసెంబర్ 20, 21 తేదీల్లో ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేశారు. ఈ సారి ఎక్కువమంది సామాన్య భక్తులకు దర్శనాలు కల్పించేలా టీటీడీ ఏర్పాట్లు చేసింది. గతంలో ఆప్‌లైన్ ద్వారా టికెట్లను కేటాయించేవారు. కానీ తొక్కిసలాట జరిగి భక్తులు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు చోటుచేసుకున్నాయి. దీంతో పూర్తిగా అన్ని టోకెన్లను ఆన్‌లైన్ ద్వారా విడుదల చేసే ప్రక్రియను టీటీడీ శ్రీకారం చుట్టింది. కాగా 2026లో వైకుంఠ ద్వార దర్శనాలు డిసెంబర్ 20 నుంచి 29వ తేదీ వరకు పది రోజుల పాటు జరగనున్నాయి

Follow Us
అపూర్వమైన ప్రకృతి దృశ్యాలు.. ఊటీని మైమరిపించే పులిగుండాల
అపూర్వమైన ప్రకృతి దృశ్యాలు.. ఊటీని మైమరిపించే పులిగుండాల
ఒక సామాన్యుడి వేల కోట్ల సామ్రాజ్యం వెనుకున్న రహస్యం ఏమిటి?
ఒక సామాన్యుడి వేల కోట్ల సామ్రాజ్యం వెనుకున్న రహస్యం ఏమిటి?
కార్లు, బైకుల బీమా ప్రీమియంపై కేంద్రం కసరత్తు
కార్లు, బైకుల బీమా ప్రీమియంపై కేంద్రం కసరత్తు
ఇన్సూరెన్స్ లేని బండ్లకు బంకుల్లో నో పెట్రోల్
ఇన్సూరెన్స్ లేని బండ్లకు బంకుల్లో నో పెట్రోల్
ఓటు వేసినప్పుడే ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు వస్తుంది
ఓటు వేసినప్పుడే ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు వస్తుంది
పోటాపోటీగా సాగర్ నీళ్లు విడుదల చేసిన ఏపీ, తెలంగాణ అధికారులు
పోటాపోటీగా సాగర్ నీళ్లు విడుదల చేసిన ఏపీ, తెలంగాణ అధికారులు
కల్లాల్లోనే ధాన్యం రాశులు.. కన్నీరు పెడుతున్న రైతులు
కల్లాల్లోనే ధాన్యం రాశులు.. కన్నీరు పెడుతున్న రైతులు
వరుస చోరీలతో విసిగి.. మాటు వేసి.. దొంగలను పట్టుకున్న రైతులు
వరుస చోరీలతో విసిగి.. మాటు వేసి.. దొంగలను పట్టుకున్న రైతులు
మాకేమైనా బిచ్చం వేస్తున్నారా? ఎస్పీపై కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం
మాకేమైనా బిచ్చం వేస్తున్నారా? ఎస్పీపై కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం
కరెంటు కనెక్షన్ కట్ చేస్తామని కాల్ వస్తే.. చెక్ చేయాల్సిందే
కరెంటు కనెక్షన్ కట్ చేస్తామని కాల్ వస్తే.. చెక్ చేయాల్సిందే