AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra News: వివాహిత ప్రాణం తీసిన ఇన్‌స్టాగ్రామ్ పరిచయం!.. అసలు ఏం జరిగిందంటే

ఈ మధ్యకాలంలో మొదట స్నేహంగా మొదలైన సోషల్ మీడియా పరిచయాలు చివరకు ప్రాణాలు తీసే వరకు వెళ్తున్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే నంద్యాల జిల్లాలో వెలుగు చూసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో వేధింపులు తాళలేక ఓ మహిళ ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Andhra News: వివాహిత ప్రాణం తీసిన ఇన్‌స్టాగ్రామ్ పరిచయం!.. అసలు ఏం జరిగిందంటే
Woman Ends Life Over Photo Leak Threat
J Y Nagi Reddy
| Edited By: |

Updated on: Nov 27, 2026 | 11:44 AM

Share

ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన వ్యక్తి పెట్టిన వేధింపులను తట్టుకోలేక ఓ మహిళ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన నంద్యాల జిల్లాలో కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే.. నంద్యాలలోని దేవనగర్‌కు చెందిన 29 ఏళ్ల అరుణ అనే మహిళకు కొన్నాళ్ల క్రితం ఇన్‌స్టాగ్రామ్‌లో దేవేంద్ర అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త కొన్నాళ్లకు స్నేహంగా మారడంతో ఇద్దరి మధ్య సంబంధాలు కొనసాగాయి.

అయితే సదరు మహిళకు ఇప్పటికే వివాహం జరిగి భర్త కూడా ఉన్నాడు. కానీ భర్తను వదిలేసి తన వెంట రావాలని అరుణపై దేవేంద్ర ఒత్తిడి తేవడం మొదలుపెట్టాడు. అందుకు అరుణ నిరాకరించడంతో దేవేంద్ర ఆమెను బ్లాక్‌మెయిల్ చేయడం ప్రారంభించాడు. తన వెంట రాకపోతే ఇద్దరం కలిసి ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో పెడతానని బెదిరించాడు.

ఇక ఏం చేయాలో అర్థం కాని స్థితిలో పడిపోయిన అరుణ.. దేవేంద్ర పెట్టిన వేధింపులు తాళలేక తీవ్ర నిర్ణయం తీసుకుంది. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నంద్యాల 3 టౌన్ పోలీసులు ఆమె ఆత్మహత్యకు గల అసలు కారణాలను తేల్చేందుకు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
అపూర్వమైన ప్రకృతి దృశ్యాలు.. ఊటీని మైమరిపించే పులిగుండాల
అపూర్వమైన ప్రకృతి దృశ్యాలు.. ఊటీని మైమరిపించే పులిగుండాల
ఒక సామాన్యుడి వేల కోట్ల సామ్రాజ్యం వెనుకున్న రహస్యం ఏమిటి?
ఒక సామాన్యుడి వేల కోట్ల సామ్రాజ్యం వెనుకున్న రహస్యం ఏమిటి?
కార్లు, బైకుల బీమా ప్రీమియంపై కేంద్రం కసరత్తు
కార్లు, బైకుల బీమా ప్రీమియంపై కేంద్రం కసరత్తు
ఇన్సూరెన్స్ లేని బండ్లకు బంకుల్లో నో పెట్రోల్
ఇన్సూరెన్స్ లేని బండ్లకు బంకుల్లో నో పెట్రోల్
ఓటు వేసినప్పుడే ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు వస్తుంది
ఓటు వేసినప్పుడే ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు వస్తుంది
పోటాపోటీగా సాగర్ నీళ్లు విడుదల చేసిన ఏపీ, తెలంగాణ అధికారులు
పోటాపోటీగా సాగర్ నీళ్లు విడుదల చేసిన ఏపీ, తెలంగాణ అధికారులు
కల్లాల్లోనే ధాన్యం రాశులు.. కన్నీరు పెడుతున్న రైతులు
కల్లాల్లోనే ధాన్యం రాశులు.. కన్నీరు పెడుతున్న రైతులు
వరుస చోరీలతో విసిగి.. మాటు వేసి.. దొంగలను పట్టుకున్న రైతులు
వరుస చోరీలతో విసిగి.. మాటు వేసి.. దొంగలను పట్టుకున్న రైతులు
మాకేమైనా బిచ్చం వేస్తున్నారా? ఎస్పీపై కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం
మాకేమైనా బిచ్చం వేస్తున్నారా? ఎస్పీపై కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం
కరెంటు కనెక్షన్ కట్ చేస్తామని కాల్ వస్తే.. చెక్ చేయాల్సిందే
కరెంటు కనెక్షన్ కట్ చేస్తామని కాల్ వస్తే.. చెక్ చేయాల్సిందే