AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

APPSC గ్రూప్ 2 అభ్యర్థులకు అలర్ట్.. 720 ఉద్యోగాలకు డిసెంబర్ 11 చివరి తేదీ..! వెంటనే అప్లై చేయండి

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ముఖ్యమైన అలర్ట్. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) గ్రూప్-2 సర్వీసెస్‌లో 720 ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు స్వీకరిస్తోంది. ఆన్‌లైన్ దరఖాస్తుల గడువు డిసెంబర్ 11, 2026తో ముగియనుంది. ఇప్పటివరకు అప్లై చేయని అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తోంది. ఈ పోస్టులకు సంబంధించిన ప్రిలిమినరీ స్క్రీనింగ్ టెస్ట్‌ను 2027 ఫిబ్రవరి 21న నిర్వహించనున్నారు.

APPSC గ్రూప్ 2 అభ్యర్థులకు అలర్ట్.. 720 ఉద్యోగాలకు డిసెంబర్ 11 చివరి తేదీ..! వెంటనే అప్లై చేయండి
APPSC Group 2 Application Deadline
Srilakshmi C
|

Updated on: Nov 27, 2026 | 8:22 AM

Share

అమరావతి, నవంబర్ 27: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-2 సర్వీసెస్‌లోని ఎగ్జిక్యూటివ్, నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ నంబర్ 37/2026 విడుదల చేసింది. మొత్తం 720 పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. వీటిలో 471 ఎగ్జిక్యూటివ్ పోస్టులు, 249 నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉన్నాయి. నవంబర్ 10, 2026 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. డిసెంబర్ 11, 2026 రాత్రి 11.59 గంటల వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. చివరి తేదీ దగ్గరపడుతున్న నేపథ్యంలో అభ్యర్థులు తమ విద్యార్హతలు, వయోపరిమితి, ఇతర నిబంధనలను పరిశీలించి దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయాలి.

మొత్తం 720 పోస్టులు.. ఏ విభాగంలో ఎన్ని ఖాళీలు?

ఈ నోటిఫికేషన్‌లో వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు.

ఎగ్జిక్యూటివ్ పోస్టులు – 471

  • డిప్యూటీ తహశీల్దార్ 203
  • డిప్యూటీ ఎంపీడీవో 176
  • జీఎస్టీ ఆఫీసర్ 40
  • ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఎస్‌ఐ 29
  • అసిస్టెంట్ రిజిస్ట్రార్ 10
  • సబ్ రిజిస్ట్రార్ గ్రేడ్-II 7
  • మున్సిపల్ కమిషనర్ గ్రేడ్-III 6

నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టులు – 249

  • అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (GAD) 71
  • అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (ఫైనాన్స్) 5
  • అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (లా) 4
  • సీనియర్ అకౌంటెంట్ (HOD) 90
  • సీనియర్ అకౌంటెంట్ (జిల్లాలు) 1
  • జూనియర్ అకౌంటెంట్ 47
  • జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ 31

ఈ విధంగా ఎగ్జిక్యూటివ్, నాన్-ఎగ్జిక్యూటివ్ విభాగాల్లో కలిపి మొత్తం 720 పోస్టులు ఉన్నాయి. గ్రూప్-2 పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి బ్యాచిలర్ డిగ్రీ (డిగ్రీ) ఉత్తీర్ణులై ఉండాలి. అయితే కొన్ని పోస్టులకు ప్రత్యేక విద్యార్హతలు నిర్దేశించారు. ఉదాహరణకు అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (ఫైనాన్స్) పోస్టుకు మ్యాథమెటిక్స్, ఎకనామిక్స్ లేదా కామర్స్‌లో డిగ్రీ ఉండాలి. లా విభాగంలోని అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టుకు లా డిగ్రీ అవసరం. సీనియర్ అకౌంటెంట్, జూనియర్ అకౌంటెంట్ పోస్టులకు నిర్దిష్ట డిగ్రీతో పాటు కంప్యూటర్‌కు సంబంధించిన సర్టిఫికెట్ కోర్సు లేదా సంబంధిత కంప్యూటర్ డిగ్రీ వంటి అర్హతలు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. అందువల్ల అభ్యర్థులు తాము దరఖాస్తు చేసుకునే పోస్టుకు సంబంధించిన పూర్తి విద్యార్హతలను అధికారిక నోటిఫికేషన్‌లో పరిశీలించాలి. అభ్యర్థుల వయస్సును 2026 జూలై 1వ తేదీ ప్రామాణికంగా పరిగణిస్తారు. పోస్టును బట్టి కనీస వయస్సు 18, 20 లేదా 21 సంవత్సరాలుగా, గరిష్ఠ వయస్సు 30 లేదా 44 సంవత్సరాలుగా నిర్ణయించారు. రిజర్వేషన్ కేటగిరీలకు నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు ఉంటాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, దివ్యాంగ అభ్యర్థులకు 10 సంవత్సరాలు, మాజీ సైనికులకు నిబంధనల ప్రకారం వయో సడలింపు ఉంటుంది. ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టుకు ప్రత్యేక వయోపరిమితి, శారీరక ప్రమాణాలు కూడా వర్తిస్తాయి.

ఎంపిక విధానం ఎలా ఉంటుంది?

APPSC గ్రూప్-2 నియామక ప్రక్రియలో అభ్యర్థులను ప్రధానంగా మూడు దశల్లో ఎంపిక చేస్తారు.

ఇవి కూడా చదవండి

ప్రిలిమినరీ పరీక్ష (Screening Test)

మొదట ఆబ్జెక్టివ్ విధానంలో ప్రిలిమినరీ స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహిస్తారు. ఈ పరీక్ష ద్వారా మెయిన్స్‌కు అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేస్తారు. ఈ పరీక్షను ఆఫ్‌లైన్ OMR విధానంలో నిర్వహిస్తారు.

మెయిన్స్ పరీక్ష (Main Examination)

ప్రిలిమినరీలో అర్హత సాధించిన అభ్యర్థులకు మెయిన్స్ పరీక్ష నిర్వహిస్తారు. ఇది కంప్యూటర్ ఆధారిత రిక్రూట్‌మెంట్ టెస్ట్ (CBRT) విధానంలో ఉంటుంది. తుది మెరిట్ ప్రధానంగా మెయిన్స్ పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా నిర్ణయిస్తారు.

కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ (CPT)

మెయిన్స్‌లో అర్హత సాధించి తదుపరి ఎంపిక ప్రక్రియకు షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థులు కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్‌లో కూడా అర్హత సాధించాలి. ఇందులో కంప్యూటర్ వినియోగం, ఆఫీస్ ఆటోమేషన్, సంబంధిత సాఫ్ట్‌వేర్‌పై ప్రావీణ్యాన్ని పరీక్షిస్తారు. అనంతరం సర్టిఫికెట్ల పరిశీలన, ఇతర నియామక నిబంధనల ప్రకారం తుది ఎంపిక జరుగుతుంది.

ముఖ్యమైన తేదీలు..

  • APPSC ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం గ్రూప్-2 ప్రిలిమినరీ స్క్రీనింగ్ టెస్ట్‌ను 2027 ఫిబ్రవరి 21న నిర్వహించనున్నారు.
  • దరఖాస్తుల ప్రారంభ తేదీ: నవంబర్ 10, 2026.
  • దరఖాస్తులకు చివరి తేదీ: డిసెంబర్ 11, 2026.
  • ప్రిలిమినరీ పరీక్ష తేదీ: ఫిబ్రవరి 21, 2027.
  • మెయిన్స్ పరీక్ష తేదీ: త్వరలో ప్రకటించనున్నారు.

ప్రిలిమ్స్ పరీక్ష ఆఫ్‌లైన్ OMR విధానంలో జరుగుతుంది. మెయిన్స్ పరీక్ష తేదీని కమిషన్ తర్వాత ప్రకటించనుంది. అభ్యర్థులు దరఖాస్తు సమయంలో కింది ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. ఈ అర్హతలు ఉన్నవారు ముగింపు గడువులోగా దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు: రూ.250, పరీక్ష ఫీజు: రూ.80 కలిపి మొత్తం రూ. 330 చొప్పున చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, మాజీ సైనికులు, ఏపీ వైట్ రేషన్ కార్డు కలిగిన కుటుంబాలు, నిబంధనలకు అనుగుణంగా అర్హత ఉన్న నిరుద్యోగ యువతకు రూ.80 పరీక్ష ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది. అయితే రూ.250 ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలి. ఇతర రాష్ట్రాల అభ్యర్థులకు ప్రత్యేక నిబంధనలు వర్తిస్తాయి.

APPSC గ్రూప్-2కు ఎలా దరఖాస్తు చేసుకోవాలి?

  • అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
  • ముందుగా APPSC అధికారిక వెబ్‌సైట్ https://psc.ap.gov.in ను ఓపెన్ చేయాలి.
  • One Time Profile Registration (OTPR) పూర్తి చేసుకోవాలి.
  • ఇప్పటికే OTPR ఉన్నవారు తమ యూజర్ ఐడీతో లాగిన్ కావాలి.
  • గ్రూప్-2 నోటిఫికేషన్ నంబర్ 37/2026ను ఎంపిక చేసుకోవాలి.
  • దరఖాస్తులో అడిగిన వ్యక్తిగత, విద్యార్హత వివరాలను నమోదు చేయాలి.
  • అవసరమైన వివరాలు, పత్రాలను పరిశీలించి అప్లికేషన్ సబ్మిట్ చేయాలి.
  • నిర్ణీత ఫీజును ఆన్‌లైన్‌లో చెల్లించాలి.
  • దరఖాస్తు పూర్తయిన తర్వాత అప్లికేషన్ కాపీని డౌన్‌లోడ్ చేసుకుని భద్రపరచుకోవాలి.

OTPR నమోదు చేసుకున్నంత మాత్రాన దరఖాస్తు పూర్తయినట్లు కాదు. నోటిఫికేషన్‌కు ప్రత్యేకంగా అప్లికేషన్ సమర్పించి, అవసరమైన ఫీజు చెల్లించాలి. ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న డిగ్రీ అభ్యర్థులకు APPSC గ్రూప్-2 నోటిఫికేషన్ మంచి అవకాశంగా చెప్పవచ్చు. ముఖ్యంగా డిప్యూటీ తహశీల్దార్, డిప్యూటీ ఎంపీడీవో, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ వంటి పోస్టులకు పోటీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఫిబ్రవరి 21న జరగనున్న ప్రిలిమినరీ పరీక్షను దృష్టిలో పెట్టుకుని ప్రిపరేషన్ ప్రారంభించాలి. ఇంకా అప్లై చేయని వారు చివరి తేదీ వరకు వేచి ఉండకుండా వీలైనంత త్వరగా దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేసుకోవాలి.

ఏపీపీఎస్సీ గ్రూప్‌ 2 ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
APPSC గ్రూప్ 2లో 720ఉద్యోగాలకు ముగుస్తున్న గడువు.. డైరెక్ట్ లింక్
APPSC గ్రూప్ 2లో 720ఉద్యోగాలకు ముగుస్తున్న గడువు.. డైరెక్ట్ లింక్
టీ20 హిస్టరీలోనే టీమిండియా ప్లేయర్ సరికొత్త రికార్డు..!
టీ20 హిస్టరీలోనే టీమిండియా ప్లేయర్ సరికొత్త రికార్డు..!
OLXలో బుల్లెట్ అమ్మకానికి పెట్టాడు.. టెస్ట్ రైడ్ పేరుతో బురిడీ!
OLXలో బుల్లెట్ అమ్మకానికి పెట్టాడు.. టెస్ట్ రైడ్ పేరుతో బురిడీ!
ప్రియుడికి నగలు ఇచ్చింది.. చివరకు ప్రాణాలే తీసుకుంది!
ప్రియుడికి నగలు ఇచ్చింది.. చివరకు ప్రాణాలే తీసుకుంది!
UGC NET 2026 అభ్యర్థులకు అలర్ట్.. కీలక అప్‌డేట్ ఇదిగో..!
UGC NET 2026 అభ్యర్థులకు అలర్ట్.. కీలక అప్‌డేట్ ఇదిగో..!
డిసెంబర్‌లో ఈ రోజుల్లో బ్యాంకులు బంద్.. మొత్తం ఎన్ని రోజులంటే..?
డిసెంబర్‌లో ఈ రోజుల్లో బ్యాంకులు బంద్.. మొత్తం ఎన్ని రోజులంటే..?
చలికాలంలో ఈ ఆకుకూరలన్నీ తింటున్నారా..? జాగ్రత్త, ఈ పురుగులుంటాయ్!
చలికాలంలో ఈ ఆకుకూరలన్నీ తింటున్నారా..? జాగ్రత్త, ఈ పురుగులుంటాయ్!
పెళ్లి సంబంధం కోసం మ్యాట్రిమోనీ కి వెళ్తే.. ఏకంగా రూ.12 లక్షలు
పెళ్లి సంబంధం కోసం మ్యాట్రిమోనీ కి వెళ్తే.. ఏకంగా రూ.12 లక్షలు
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. మరో 25 వేల ఉద్యోగాల భర్తీకి CM ప్రకటన
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. మరో 25 వేల ఉద్యోగాల భర్తీకి CM ప్రకటన
కూతురి భవిష్యత్తే లోకంగా బతికిన తల్లి.. రోడ్డు ప్రమాదంలో మృతి!
కూతురి భవిష్యత్తే లోకంగా బతికిన తల్లి.. రోడ్డు ప్రమాదంలో మృతి!
అపూర్వమైన ప్రకృతి దృశ్యాలు.. ఊటీని మైమరిపించే పులిగుండాల
అపూర్వమైన ప్రకృతి దృశ్యాలు.. ఊటీని మైమరిపించే పులిగుండాల
ఒక సామాన్యుడి వేల కోట్ల సామ్రాజ్యం వెనుకున్న రహస్యం ఏమిటి?
ఒక సామాన్యుడి వేల కోట్ల సామ్రాజ్యం వెనుకున్న రహస్యం ఏమిటి?
కార్లు, బైకుల బీమా ప్రీమియంపై కేంద్రం కసరత్తు
కార్లు, బైకుల బీమా ప్రీమియంపై కేంద్రం కసరత్తు
ఇన్సూరెన్స్ లేని బండ్లకు బంకుల్లో నో పెట్రోల్
ఇన్సూరెన్స్ లేని బండ్లకు బంకుల్లో నో పెట్రోల్
ఓటు వేసినప్పుడే ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు వస్తుంది
ఓటు వేసినప్పుడే ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు వస్తుంది
పోటాపోటీగా సాగర్ నీళ్లు విడుదల చేసిన ఏపీ, తెలంగాణ అధికారులు
పోటాపోటీగా సాగర్ నీళ్లు విడుదల చేసిన ఏపీ, తెలంగాణ అధికారులు
కల్లాల్లోనే ధాన్యం రాశులు.. కన్నీరు పెడుతున్న రైతులు
కల్లాల్లోనే ధాన్యం రాశులు.. కన్నీరు పెడుతున్న రైతులు
వరుస చోరీలతో విసిగి.. మాటు వేసి.. దొంగలను పట్టుకున్న రైతులు
వరుస చోరీలతో విసిగి.. మాటు వేసి.. దొంగలను పట్టుకున్న రైతులు
మాకేమైనా బిచ్చం వేస్తున్నారా? ఎస్పీపై కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం
మాకేమైనా బిచ్చం వేస్తున్నారా? ఎస్పీపై కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం
కరెంటు కనెక్షన్ కట్ చేస్తామని కాల్ వస్తే.. చెక్ చేయాల్సిందే
కరెంటు కనెక్షన్ కట్ చేస్తామని కాల్ వస్తే.. చెక్ చేయాల్సిందే