AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. మరో 25 వేల ఉద్యోగాల భర్తీకి సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన!

రాష్ట్ర నిరుద్యోగ యువతకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీపికబురు అందించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 75 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశామని, త్వరలోనే మరో 25 వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు. అచ్చంపేటలో ఇందిరమ్మ చీరల పంపిణీ ప్రారంభోత్సవం సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో సీఎం ఈ ప్రకటన చేశారు. దీంతో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మంది అభ్యర్థుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. కొత్తగా భర్తీ చేయనున్న ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు, ఖాళీల వివరాలపై నిరుద్యోగులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు..

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. మరో 25 వేల ఉద్యోగాల భర్తీకి సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన!
Telangana Government To Fill Another 25,000 Vacancies Soon
Srilakshmi C
|

Updated on: Nov 27, 2026 | 8:00 AM

Share

హైదరాబాద్‌, నవంబర్ 27: తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభవార్త చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 75 వేల ఉద్యోగాలను భర్తీ చేశామని, త్వరలోనే మరో 25 వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు. దీంతో ప్రభుత్వ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న యువతలో ఆశలు చిగురిస్తున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అచ్చంపేటలో నిర్వహించిన బహిరంగ సభలో ఉద్యోగాల భర్తీపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందిరమ్మ చీరల పంపిణీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. రాష్ట్రంలో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన ఉద్యోగ నియామకాల గురించి వివరించారు. రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం పేర్కొన్నారు. ఇప్పటికే 75 వేల ఉద్యోగాలను భర్తీ చేసినట్లు వెల్లడించారు. అంతేకాకుండా త్వరలో మరో 25 వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు.

లక్ష ఉద్యోగాల భర్తీ దిశగా ప్రభుత్వం?

ముఖ్యమంత్రి చేసిన ప్రకటన ప్రకారం ఇప్పటికే భర్తీ చేసిన 75 వేల ఉద్యోగాలకు అదనంగా మరో 25 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తే మొత్తం లక్ష ఉద్యోగాల భర్తీ పూర్తవుతుంది. ఈ ప్రకటనతో ప్రభుత్వ ఉద్యోగాల కోసం పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థుల్లో ఆసక్తి నెలకొంది. అయితే కొత్తగా భర్తీ చేయనున్న 25 వేల ఉద్యోగాలకు సంబంధించి ఏయే శాఖల్లో ఖాళీలు ఉన్నాయి? ఏయే పోస్టులకు నోటిఫికేషన్లు విడుదల చేస్తారు? నియామక ప్రక్రియ ఎప్పుడు ప్రారంభమవుతుంది? అనే అంశాలపై అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. తెలంగాణలో గ్రూప్స్, పోలీస్, ఉపాధ్యాయ, ఇతర ప్రభుత్వ శాఖల ఉద్యోగాల కోసం వేలాది మంది యువత పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో మరో 25 వేల ఉద్యోగాల భర్తీ ప్రకటన నిరుద్యోగులకు ఊరటనిచ్చే అంశంగా మారింది.

ఇవి కూడా చదవండి

అయితే ఉద్యోగాల భర్తీకి సంబంధించిన శాఖల వారీ ఖాళీలు, అర్హతలు, వయోపరిమితి, దరఖాస్తుల తేదీలు, పరీక్షల షెడ్యూల్ వంటి వివరాలు అధికారిక నోటిఫికేషన్ల ద్వారా వెల్లడికావాల్సి ఉంది. కాగా తెలంగాణలో ఇప్పటికే 75 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని, త్వరలో మరో 25 వేల ఉద్యోగాలు కల్పిస్తామని సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. నిరుద్యోగ యువత మాత్రం కొత్త నోటిఫికేషన్ల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

Follow Us
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. మరో 25 వేల ఉద్యోగాల భర్తీకి CM ప్రకటన
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. మరో 25 వేల ఉద్యోగాల భర్తీకి CM ప్రకటన
కూతురి భవిష్యత్తే లోకంగా బతికిన తల్లి.. రోడ్డు ప్రమాదంలో మృతి!
కూతురి భవిష్యత్తే లోకంగా బతికిన తల్లి.. రోడ్డు ప్రమాదంలో మృతి!
డ్రైవర్‌కు మూర్ఛ.. 73 మందిని కాపాడిన ప్రయాణికుడు!
డ్రైవర్‌కు మూర్ఛ.. 73 మందిని కాపాడిన ప్రయాణికుడు!
వెండి నగలు నల్లబడ్డాయా? ఈ సింపుల్ చిట్కాలతో కొత్తవాటిలా మెరవాలంటే
వెండి నగలు నల్లబడ్డాయా? ఈ సింపుల్ చిట్కాలతో కొత్తవాటిలా మెరవాలంటే
ఇందిరమ్మ బీమా పొందాలంటే కచ్చితంగా ఇంటి పన్ను చెల్లించాలా?
ఇందిరమ్మ బీమా పొందాలంటే కచ్చితంగా ఇంటి పన్ను చెల్లించాలా?
నువ్వు కెప్టెన్సీ మెటీరియల్ కాదు బ్రో.. తిలక్‌పై ఫ్యాన్స్ ఫైర్
నువ్వు కెప్టెన్సీ మెటీరియల్ కాదు బ్రో.. తిలక్‌పై ఫ్యాన్స్ ఫైర్
పీఎఫ్ ఖాతాదారులకు మరో సూపర్‌న్యూస్
పీఎఫ్ ఖాతాదారులకు మరో సూపర్‌న్యూస్
.కార్తీ 'ఖైదీ' సినిమాను రిజెక్ట్ చేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా?
.కార్తీ 'ఖైదీ' సినిమాను రిజెక్ట్ చేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా?
ఆ ఇద్దరు కలిసి కొంప ముంచేశారు.. అందుకే చిత్తుగా ఓడిపోయాం..: తిలక్
ఆ ఇద్దరు కలిసి కొంప ముంచేశారు.. అందుకే చిత్తుగా ఓడిపోయాం..: తిలక్
జిమ్‌కు వెళ్లే ముందు ఉప్పునీళ్లు తాగడం మంచిదేనా? ఇది తెలుసుకోండి!
జిమ్‌కు వెళ్లే ముందు ఉప్పునీళ్లు తాగడం మంచిదేనా? ఇది తెలుసుకోండి!
అపూర్వమైన ప్రకృతి దృశ్యాలు.. ఊటీని మైమరిపించే పులిగుండాల
అపూర్వమైన ప్రకృతి దృశ్యాలు.. ఊటీని మైమరిపించే పులిగుండాల
ఒక సామాన్యుడి వేల కోట్ల సామ్రాజ్యం వెనుకున్న రహస్యం ఏమిటి?
ఒక సామాన్యుడి వేల కోట్ల సామ్రాజ్యం వెనుకున్న రహస్యం ఏమిటి?
కార్లు, బైకుల బీమా ప్రీమియంపై కేంద్రం కసరత్తు
కార్లు, బైకుల బీమా ప్రీమియంపై కేంద్రం కసరత్తు
ఇన్సూరెన్స్ లేని బండ్లకు బంకుల్లో నో పెట్రోల్
ఇన్సూరెన్స్ లేని బండ్లకు బంకుల్లో నో పెట్రోల్
ఓటు వేసినప్పుడే ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు వస్తుంది
ఓటు వేసినప్పుడే ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు వస్తుంది
పోటాపోటీగా సాగర్ నీళ్లు విడుదల చేసిన ఏపీ, తెలంగాణ అధికారులు
పోటాపోటీగా సాగర్ నీళ్లు విడుదల చేసిన ఏపీ, తెలంగాణ అధికారులు
కల్లాల్లోనే ధాన్యం రాశులు.. కన్నీరు పెడుతున్న రైతులు
కల్లాల్లోనే ధాన్యం రాశులు.. కన్నీరు పెడుతున్న రైతులు
వరుస చోరీలతో విసిగి.. మాటు వేసి.. దొంగలను పట్టుకున్న రైతులు
వరుస చోరీలతో విసిగి.. మాటు వేసి.. దొంగలను పట్టుకున్న రైతులు
మాకేమైనా బిచ్చం వేస్తున్నారా? ఎస్పీపై కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం
మాకేమైనా బిచ్చం వేస్తున్నారా? ఎస్పీపై కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం
కరెంటు కనెక్షన్ కట్ చేస్తామని కాల్ వస్తే.. చెక్ చేయాల్సిందే
కరెంటు కనెక్షన్ కట్ చేస్తామని కాల్ వస్తే.. చెక్ చేయాల్సిందే