AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: డ్రైవర్‌కు మూర్ఛ.. కదులుతున్న బస్సులో ప్రయాణికుడి సాహసం.. 73 మంది సేఫ్..

డ్రైవర్‌కు అకస్మాత్తుగా మూర్ఛ రావడంతో అదుపుతప్పిన ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సును ఓ ప్రయాణికుడు తన సమయస్ఫూర్తితో నిలిపివేశాడు. కండక్టర్‌తో కలిసి డ్రైవర్‌ను పక్కకు జరిపి బ్రేకులు వేయడంతో బస్సులోని 73 మంది ప్రయాణికులకు పెను ప్రమాదం తప్పింది. జనగామకు చెందిన రామకోటి ధైర్యసాహసాలను మంత్రి పొన్నం ప్రభాకర్ అభినందించారు.

Telangana: డ్రైవర్‌కు మూర్ఛ.. కదులుతున్న బస్సులో ప్రయాణికుడి సాహసం.. 73 మంది సేఫ్..
Passenger Ramakoti
Ram Naramaneni
|

Updated on: Nov 27, 2026 | 7:49 AM

Share

ఒక్క క్షణం ఏమరపాటుగా ఉన్నా 73 మంది ప్రాణాలు ప్రమాదంలో పడేవి. కదులుతున్న ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు డ్రైవర్ అకస్మాత్తుగా స్పృహ కోల్పోవడంతో ప్రయాణికులంతా భయాందోళనకు గురయ్యారు. అయితే అదే సమయంలో ఓ ప్రయాణికుడు అసాధారణ ధైర్యాన్ని ప్రదర్శించాడు. కండక్టర్‌తో కలిసి పరిస్థితిని చాకచక్యంగా చక్కదిద్ది బస్సును నిలిపివేశాడు. దీంతో భారీ ప్రమాదం తప్పింది.

హనుమకొండ నుంచి హైదరాబాద్‌కు గురువారం మధ్యాహ్నం 2.25 గంటలకు 73 మంది ప్రయాణికులతో ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు బయలుదేరింది. కాజీపేటలోని బాపూజీనగర్ చౌరస్తా దాటిన కొద్దిసేపటికే ఊహించని ఘటన చోటుచేసుకుంది. బస్సు నడుపుతున్న డ్రైవర్ రాజుకు ఒక్కసారిగా మూర్ఛ రావడంతో స్టీరింగ్ అదుపుతప్పి ఒకవైపునకు తిరిగింది. దీంతో బస్సులో ఒక్కసారిగా కలకలం రేగింది. ఏం జరుగుతుందో అర్థంకాక ప్రయాణికులు కేకలు పెట్టారు.

పరిస్థితిని గమనించిన కండక్టర్ విజయ్ వెంటనే డ్రైవర్ వద్దకు చేరుకుని బస్సును నిలిపేందుకు ప్రయత్నించారు. అయినా వాహనం అదుపులోకి రాకపోవడంతో ప్రయాణికుల్లో ఉన్న జనగామకు చెందిన రామకోటి వెంటనే స్పందించారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా కండక్టర్‌కు సహకరించి డ్రైవర్‌ను పక్కకు జరిపారు. అనంతరం బ్రేకులు వేసి బస్సును నిలిపివేయడంతో అందులోని 73 మంది ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.

అయితే బస్సును అదుపులోకి తీసుకునే క్రమంలో రోడ్డు పక్కన ఉన్న ఆగమ్మ అనే వృద్ధురాలితో పాటు మరో మహిళకు వాహనం తగలడంతో స్వల్ప గాయాలయ్యాయి. అదే సమయంలో అటుగా వెళ్తున్న కాజీపేట ఏసీపీ ప్రశాంత్‌రెడ్డి ఘటనను గుర్తించి వెంటనే తన వాహనాన్ని ఆపారు. గాయపడిన వృద్ధురాలితో పాటు డ్రైవర్ రాజును ఆసుపత్రికి తరలించే ఏర్పాట్లు చేశారు.

ప్రమాద సమయంలో ప్రాణాలకు తెగించి వ్యవహరించిన రామకోటి, అప్రమత్తంగా స్పందించిన కండక్టర్ విజయ్‌లను ఏసీపీ ప్రశాంత్‌రెడ్డి శాలువాలు కప్పి అభినందించారు. ఈ విషయం తెలుసుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్ సైతం రామకోటికి ఫోన్ చేసి ఆయన ధైర్యసాహసాలను ప్రశంసించారు.

ఒకవైపు డ్రైవర్ స్పృహ కోల్పోయి.. మరోవైపు బస్సు అదుపుతప్పిన క్లిష్ట సమయంలో రామకోటి చూపిన సమయస్ఫూర్తి 73 మంది ప్రయాణికులను ప్రమాదం నుంచి కాపాడింది. సకాలంలో స్పందిస్తే ఎంతటి విపత్కర పరిస్థితినైనా ఎదుర్కోవచ్చని ఈ ఘటన మరోసారి నిరూపించింది.

Follow Us
డిసెంబర్‌లో ఈ రోజుల్లో బ్యాంకులు బంద్.. మొత్తం ఎన్ని రోజులంటే..?
డిసెంబర్‌లో ఈ రోజుల్లో బ్యాంకులు బంద్.. మొత్తం ఎన్ని రోజులంటే..?
చలికాలంలో ఈ ఆకుకూరలన్నీ తింటున్నారా..? జాగ్రత్త, ఈ పురుగులుంటాయ్!
చలికాలంలో ఈ ఆకుకూరలన్నీ తింటున్నారా..? జాగ్రత్త, ఈ పురుగులుంటాయ్!
పెళ్లి సంబంధం కోసం మ్యాట్రిమోనీ కి వెళ్తే.. ఏకంగా రూ.12 లక్షలు
పెళ్లి సంబంధం కోసం మ్యాట్రిమోనీ కి వెళ్తే.. ఏకంగా రూ.12 లక్షలు
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. మరో 25 వేల ఉద్యోగాల భర్తీకి CM ప్రకటన
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. మరో 25 వేల ఉద్యోగాల భర్తీకి CM ప్రకటన
కూతురి భవిష్యత్తే లోకంగా బతికిన తల్లి.. రోడ్డు ప్రమాదంలో మృతి!
కూతురి భవిష్యత్తే లోకంగా బతికిన తల్లి.. రోడ్డు ప్రమాదంలో మృతి!
డ్రైవర్‌కు మూర్ఛ.. 73 మందిని కాపాడిన ప్రయాణికుడు!
డ్రైవర్‌కు మూర్ఛ.. 73 మందిని కాపాడిన ప్రయాణికుడు!
వెండి నగలు నల్లబడ్డాయా? ఈ సింపుల్ చిట్కాలతో కొత్తవాటిలా మెరవాలంటే
వెండి నగలు నల్లబడ్డాయా? ఈ సింపుల్ చిట్కాలతో కొత్తవాటిలా మెరవాలంటే
ఇందిరమ్మ బీమా పొందాలంటే కచ్చితంగా ఇంటి పన్ను చెల్లించాలా?
ఇందిరమ్మ బీమా పొందాలంటే కచ్చితంగా ఇంటి పన్ను చెల్లించాలా?
నువ్వు కెప్టెన్సీ మెటీరియల్ కాదు బ్రో.. తిలక్‌పై ఫ్యాన్స్ ఫైర్
నువ్వు కెప్టెన్సీ మెటీరియల్ కాదు బ్రో.. తిలక్‌పై ఫ్యాన్స్ ఫైర్
పీఎఫ్ ఖాతాదారులకు మరో సూపర్‌న్యూస్
పీఎఫ్ ఖాతాదారులకు మరో సూపర్‌న్యూస్
అపూర్వమైన ప్రకృతి దృశ్యాలు.. ఊటీని మైమరిపించే పులిగుండాల
అపూర్వమైన ప్రకృతి దృశ్యాలు.. ఊటీని మైమరిపించే పులిగుండాల
ఒక సామాన్యుడి వేల కోట్ల సామ్రాజ్యం వెనుకున్న రహస్యం ఏమిటి?
ఒక సామాన్యుడి వేల కోట్ల సామ్రాజ్యం వెనుకున్న రహస్యం ఏమిటి?
కార్లు, బైకుల బీమా ప్రీమియంపై కేంద్రం కసరత్తు
కార్లు, బైకుల బీమా ప్రీమియంపై కేంద్రం కసరత్తు
ఇన్సూరెన్స్ లేని బండ్లకు బంకుల్లో నో పెట్రోల్
ఇన్సూరెన్స్ లేని బండ్లకు బంకుల్లో నో పెట్రోల్
ఓటు వేసినప్పుడే ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు వస్తుంది
ఓటు వేసినప్పుడే ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు వస్తుంది
పోటాపోటీగా సాగర్ నీళ్లు విడుదల చేసిన ఏపీ, తెలంగాణ అధికారులు
పోటాపోటీగా సాగర్ నీళ్లు విడుదల చేసిన ఏపీ, తెలంగాణ అధికారులు
కల్లాల్లోనే ధాన్యం రాశులు.. కన్నీరు పెడుతున్న రైతులు
కల్లాల్లోనే ధాన్యం రాశులు.. కన్నీరు పెడుతున్న రైతులు
వరుస చోరీలతో విసిగి.. మాటు వేసి.. దొంగలను పట్టుకున్న రైతులు
వరుస చోరీలతో విసిగి.. మాటు వేసి.. దొంగలను పట్టుకున్న రైతులు
మాకేమైనా బిచ్చం వేస్తున్నారా? ఎస్పీపై కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం
మాకేమైనా బిచ్చం వేస్తున్నారా? ఎస్పీపై కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం
కరెంటు కనెక్షన్ కట్ చేస్తామని కాల్ వస్తే.. చెక్ చేయాల్సిందే
కరెంటు కనెక్షన్ కట్ చేస్తామని కాల్ వస్తే.. చెక్ చేయాల్సిందే