AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: పెళ్లి సంబంధం కోసం మ్యాట్రిమోనీ కి వెళ్తే.. ఏకంగా రూ.12 లక్షలు కాజేశారు.

రోజురోజుకూ ఆన్‌లైన్ మోసాలు పెరిగిపోతున్నాయి. వీటిపై పోలీసులు ఎన్ని హెచ్చరికలు జారీ చేస్తున్నా.. ప్రజలు మాత్రం అప్రమత్తం అవ్వట్లేదు. ఏదో ఒక రూపంలో మోసపోతూనే ఉన్నారు. తాజాగా పెళ్లి సంబంధాల కోసం మ్యాట్రిమోనీ వెబ్‌సైట్‌ను ఆశ్రయించిన ఓ వ్యాపారవేత్త సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి ఏకంగా రూ. 12.75 లక్షలు పోగొట్టుకున్నాడు.

Hyderabad: పెళ్లి సంబంధం కోసం మ్యాట్రిమోనీ కి వెళ్తే.. ఏకంగా రూ.12 లక్షలు కాజేశారు.
Gold Trading Scam Via Matrimony Site
Anand T
|

Updated on: Nov 27, 2026 | 8:00 AM

Share

మ్యాట్రిమోనీ వెబ్‌సైట్‌లో పెళ్లి సంబంధాలు వెతుకుతున్న ఓ వ్యాపారవేత్తకు సైబర్ నేరగాళ్లు భారీ కుచ్చుటోపీ పెట్టారు. అమ్మాయి పేరుతో వ్యాపారవేత్తకు గాలం వేసి, బంగారం ట్రేడింగ్‌లో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే అధిక మొత్తంలో లాభాలు వస్తాయని నమ్మించి ఏకంగా రూ. 12.75 లక్షలు కాజేశారు. చివరకు మోసపోయానని గ్రహించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగోలుకు చెందిన ఒక వ్యాపారవేత్త గత ఫిబ్రవరి నెలలో ప్రముఖ మ్యాట్రిమోనీ వెబ్‌సైట్‌లో పెళ్లి సంబంధాల కోసం వెతకడం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే అతనికి ‘దీక్ష సింగిరెడ్డి’ అనే ప్రొఫైల్‌తో ఓ మహిళ పరిచయమైంది. ఈ పరిచయం కాస్తా స్నేహంగా మారింది. ఈ చనువుతోనే తాను ఒక గోల్డ్ ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నానని.. తనకు బాగా లాభాలు కూడా వస్తున్నాయని తెలిపింది.

తనకు నిజంగానే లాభాలు వచ్చినట్టు ఫేక్ స్క్రీన్‌షాట్‌లను అతనికి చూపించి ఎట్టకేలకు నమ్మించింది. దీంతో అవన్నీ నిజమేనని నమ్మిన వ్యాపారవేత్త సదరు ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్‌లో పలు దఫాలుగా మొత్తం రూ. 12.75 లక్షలను సైబర్ నేరగాళ్లు సూచించిన ఖాతాలకు బదిలీ చేశాడు. అయితే తన అకౌంట్‌లో లాభాలు కనిపిస్తున్నప్పటికీ.. వాటిని విత్‌డ్రా చేసుకోవడం సాధ్యం కాలేదు. దీనిపై ఆ మహిళను సంప్రదించినా సమాధానం లేకపోవడంతో మోసపోయానని గ్రహించాడు.

వెంటనే మల్కాజ్‌గిరి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, నిందితుల బ్యాంక్ ఖాతాలు, ఫోన్ నంబర్ల ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేశారు. మ్యాట్రిమోనీ సైట్లలో పరిచయమయ్యే అపరిచితుల మాటలు నమ్మి ఆర్థిక లావాదేవీలు జరపవద్దని పోలీసులు ప్రజలకు సూచిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
పెళ్లి సంబంధం కోసం మ్యాట్రిమోనీ కి వెళ్తే.. ఏకంగా రూ.12 లక్షలు
పెళ్లి సంబంధం కోసం మ్యాట్రిమోనీ కి వెళ్తే.. ఏకంగా రూ.12 లక్షలు
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. మరో 25 వేల ఉద్యోగాల భర్తీకి CM ప్రకటన
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. మరో 25 వేల ఉద్యోగాల భర్తీకి CM ప్రకటన
కూతురి భవిష్యత్తే లోకంగా బతికిన తల్లి.. రోడ్డు ప్రమాదంలో మృతి!
కూతురి భవిష్యత్తే లోకంగా బతికిన తల్లి.. రోడ్డు ప్రమాదంలో మృతి!
డ్రైవర్‌కు మూర్ఛ.. 73 మందిని కాపాడిన ప్రయాణికుడు!
డ్రైవర్‌కు మూర్ఛ.. 73 మందిని కాపాడిన ప్రయాణికుడు!
వెండి నగలు నల్లబడ్డాయా? ఈ సింపుల్ చిట్కాలతో కొత్తవాటిలా మెరవాలంటే
వెండి నగలు నల్లబడ్డాయా? ఈ సింపుల్ చిట్కాలతో కొత్తవాటిలా మెరవాలంటే
ఇందిరమ్మ బీమా పొందాలంటే కచ్చితంగా ఇంటి పన్ను చెల్లించాలా?
ఇందిరమ్మ బీమా పొందాలంటే కచ్చితంగా ఇంటి పన్ను చెల్లించాలా?
నువ్వు కెప్టెన్సీ మెటీరియల్ కాదు బ్రో.. తిలక్‌పై ఫ్యాన్స్ ఫైర్
నువ్వు కెప్టెన్సీ మెటీరియల్ కాదు బ్రో.. తిలక్‌పై ఫ్యాన్స్ ఫైర్
పీఎఫ్ ఖాతాదారులకు మరో సూపర్‌న్యూస్
పీఎఫ్ ఖాతాదారులకు మరో సూపర్‌న్యూస్
.కార్తీ 'ఖైదీ' సినిమాను రిజెక్ట్ చేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా?
.కార్తీ 'ఖైదీ' సినిమాను రిజెక్ట్ చేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా?
ఆ ఇద్దరు కలిసి కొంప ముంచేశారు.. అందుకే చిత్తుగా ఓడిపోయాం..: తిలక్
ఆ ఇద్దరు కలిసి కొంప ముంచేశారు.. అందుకే చిత్తుగా ఓడిపోయాం..: తిలక్
అపూర్వమైన ప్రకృతి దృశ్యాలు.. ఊటీని మైమరిపించే పులిగుండాల
అపూర్వమైన ప్రకృతి దృశ్యాలు.. ఊటీని మైమరిపించే పులిగుండాల
ఒక సామాన్యుడి వేల కోట్ల సామ్రాజ్యం వెనుకున్న రహస్యం ఏమిటి?
ఒక సామాన్యుడి వేల కోట్ల సామ్రాజ్యం వెనుకున్న రహస్యం ఏమిటి?
కార్లు, బైకుల బీమా ప్రీమియంపై కేంద్రం కసరత్తు
కార్లు, బైకుల బీమా ప్రీమియంపై కేంద్రం కసరత్తు
ఇన్సూరెన్స్ లేని బండ్లకు బంకుల్లో నో పెట్రోల్
ఇన్సూరెన్స్ లేని బండ్లకు బంకుల్లో నో పెట్రోల్
ఓటు వేసినప్పుడే ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు వస్తుంది
ఓటు వేసినప్పుడే ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు వస్తుంది
పోటాపోటీగా సాగర్ నీళ్లు విడుదల చేసిన ఏపీ, తెలంగాణ అధికారులు
పోటాపోటీగా సాగర్ నీళ్లు విడుదల చేసిన ఏపీ, తెలంగాణ అధికారులు
కల్లాల్లోనే ధాన్యం రాశులు.. కన్నీరు పెడుతున్న రైతులు
కల్లాల్లోనే ధాన్యం రాశులు.. కన్నీరు పెడుతున్న రైతులు
వరుస చోరీలతో విసిగి.. మాటు వేసి.. దొంగలను పట్టుకున్న రైతులు
వరుస చోరీలతో విసిగి.. మాటు వేసి.. దొంగలను పట్టుకున్న రైతులు
మాకేమైనా బిచ్చం వేస్తున్నారా? ఎస్పీపై కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం
మాకేమైనా బిచ్చం వేస్తున్నారా? ఎస్పీపై కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం
కరెంటు కనెక్షన్ కట్ చేస్తామని కాల్ వస్తే.. చెక్ చేయాల్సిందే
కరెంటు కనెక్షన్ కట్ చేస్తామని కాల్ వస్తే.. చెక్ చేయాల్సిందే