AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Khammam: తల్లే లోకంగా బతికిన ఆ యువతికి తీరని శోకం.. రోడ్డు ప్రమాదంలో..

భర్త నుంచి విడిపోయి, తల్లిదండ్రులను కోల్పోయినా కుమార్తెకు మంచి భవిష్యత్తు అందించాలనే లక్ష్యంతో ఒంటరిగా జీవనం సాగిస్తున్న ఓ తల్లి రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది. ఖమ్మం జిల్లా వైరాకు చెందిన శ్రీరామినేని ఫణికళ (39) విధులకు వెళ్తుండగా టిప్పర్ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందారు. తల్లిని కోల్పోయిన కుమార్తె రోదనలు స్థానికులను కంటతడి పెట్టించాయి.

Khammam: తల్లే లోకంగా బతికిన ఆ యువతికి తీరని శోకం.. రోడ్డు ప్రమాదంలో..
Mohana Phanikala
Ram Naramaneni
|

Updated on: Nov 27, 2026 | 7:57 AM

Share

కష్టాలు ఎదురైనా కూతురి భవిష్యత్తే తన ప్రపంచంగా భావించింది. జీవితంలో తోడుగా నిలవాల్సిన భర్త దూరమైనా.. పుట్టింటి అండ కోల్పోయినా ఆ తల్లి వెనుకడుగు వేయలేదు. తనకు ఎదురైన కష్టాలేవీ కుమార్తెకు రాకూడదని భావించింది. చిన్న ఉద్యోగం చేస్తూ కూతురిని ప్రయోజకురాలిని చేయాలనే ఆశతో ముందుకు సాగింది. కానీ విధి మరోలా తలచింది. విధులకు బయలుదేరిన ఆమెను రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబళించింది. దీంతో తల్లి ప్రేమనే ప్రపంచంగా భావించిన ఆ యువతి ఒక్కసారిగా ఒంటరిగా మిగిలిపోయింది. తనకు ఇక దిక్కెవరంటూ ఆమె పెట్టిన కన్నీటి పర్యంతమైన రోదనలు స్థానికులను కలచివేశాయి.

ఖమ్మం జిల్లా వైరాకు చెందిన శ్రీరామినేని ఫణికళ (39) తన కుమార్తె మోహన జ్ఞానదీక్షతో కలిసి సోమవరం గ్రామంలో నివసిస్తున్నారు. ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో PROగా పనిచేస్తూ ఫ్యామిలీని పోషిస్తున్నారు. గురువారం కూడా విధులకు హాజరయ్యేందుకు ఇంటి నుంచి బైక్‌పై బయలుదేరారు. అయితే ఇంటి నుంచి వెళ్లిన రెండు నిమిషాలకే ఇందిరమ్మ కాలనీ సమీపంలో ఎదురుగా వచ్చిన టిప్పర్ ఆమె వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఫణికళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

ఫణికళ జీవితంలో ఇప్పటికే ఎన్నో విషాదాలు చోటుచేసుకున్నాయి. సుమారు 20 ఏళ్ల క్రితం వివాహం చేసుకున్న ఆమె.. వ్యక్తిగత విభేదాల కారణంగా తొమ్మిదేళ్ల క్రితమే భర్త నుంచి విడిపోయారు. అప్పటి నుంచి కుమార్తె బాధ్యతను ఒక్కరే మోస్తున్నారు. చిన్నతనంలోనే రోడ్డు ప్రమాదంలో తండ్రిని కోల్పోగా.. రెండేళ్ల క్రితం తల్లి కూడా మరణించారు. అయినప్పటికీ ఆత్మస్థైర్యం కోల్పోకుండా ఉద్యోగం చేసుకుంటూ కుమార్తెకు మంచి చదువు చెప్పించి ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని ఆశపడ్డారు.

తనకు ఎవరూ లేకపోయినా కుమార్తెకు మాత్రం అన్ని విధాలా అండగా నిలవాలని తపించిన ఫణికళను రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు వెంటాడింది. తల్లి మరణవార్తతో కుమార్తె కన్నీరుమున్నీరుగా విలపించింది. ఇక తనకు దిక్కెవరంటూ ఆమె రోదించిన తీరు అక్కడున్న వారిని కదిలించింది. కూతురి భవిష్యత్తు కోసం ఎన్నో కష్టాలను ఎదుర్కొన్న తల్లి.. ఆ కల నెరవేరకముందే కన్నుమూయడంతో సోమవరం గ్రామంలో విషాదం అలుముకుంది.

Follow Us
కూతురి భవిష్యత్తే లోకంగా బతికిన తల్లి.. రోడ్డు ప్రమాదంలో మృతి!
కూతురి భవిష్యత్తే లోకంగా బతికిన తల్లి.. రోడ్డు ప్రమాదంలో మృతి!
డ్రైవర్‌కు మూర్ఛ.. 73 మందిని కాపాడిన ప్రయాణికుడు!
డ్రైవర్‌కు మూర్ఛ.. 73 మందిని కాపాడిన ప్రయాణికుడు!
వెండి నగలు నల్లబడ్డాయా? ఈ సింపుల్ చిట్కాలతో కొత్తవాటిలా మెరవాలంటే
వెండి నగలు నల్లబడ్డాయా? ఈ సింపుల్ చిట్కాలతో కొత్తవాటిలా మెరవాలంటే
ఇందిరమ్మ బీమా పొందాలంటే కచ్చితంగా ఇంటి పన్ను చెల్లించాలా?
ఇందిరమ్మ బీమా పొందాలంటే కచ్చితంగా ఇంటి పన్ను చెల్లించాలా?
నువ్వు కెప్టెన్సీ మెటీరియల్ కాదు బ్రో.. తిలక్‌పై ఫ్యాన్స్ ఫైర్
నువ్వు కెప్టెన్సీ మెటీరియల్ కాదు బ్రో.. తిలక్‌పై ఫ్యాన్స్ ఫైర్
పీఎఫ్ ఖాతాదారులకు మరో సూపర్‌న్యూస్
పీఎఫ్ ఖాతాదారులకు మరో సూపర్‌న్యూస్
.కార్తీ 'ఖైదీ' సినిమాను రిజెక్ట్ చేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా?
.కార్తీ 'ఖైదీ' సినిమాను రిజెక్ట్ చేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా?
ఆ ఇద్దరు కలిసి కొంప ముంచేశారు.. అందుకే చిత్తుగా ఓడిపోయాం..: తిలక్
ఆ ఇద్దరు కలిసి కొంప ముంచేశారు.. అందుకే చిత్తుగా ఓడిపోయాం..: తిలక్
జిమ్‌కు వెళ్లే ముందు ఉప్పునీళ్లు తాగడం మంచిదేనా? ఇది తెలుసుకోండి!
జిమ్‌కు వెళ్లే ముందు ఉప్పునీళ్లు తాగడం మంచిదేనా? ఇది తెలుసుకోండి!
అనూహ్యంగా బంగారం ధరల్లో భారీ మార్పులు.. ఇవాల్టీ రేట్లు ఇవే..
అనూహ్యంగా బంగారం ధరల్లో భారీ మార్పులు.. ఇవాల్టీ రేట్లు ఇవే..
అపూర్వమైన ప్రకృతి దృశ్యాలు.. ఊటీని మైమరిపించే పులిగుండాల
అపూర్వమైన ప్రకృతి దృశ్యాలు.. ఊటీని మైమరిపించే పులిగుండాల
ఒక సామాన్యుడి వేల కోట్ల సామ్రాజ్యం వెనుకున్న రహస్యం ఏమిటి?
ఒక సామాన్యుడి వేల కోట్ల సామ్రాజ్యం వెనుకున్న రహస్యం ఏమిటి?
కార్లు, బైకుల బీమా ప్రీమియంపై కేంద్రం కసరత్తు
కార్లు, బైకుల బీమా ప్రీమియంపై కేంద్రం కసరత్తు
ఇన్సూరెన్స్ లేని బండ్లకు బంకుల్లో నో పెట్రోల్
ఇన్సూరెన్స్ లేని బండ్లకు బంకుల్లో నో పెట్రోల్
ఓటు వేసినప్పుడే ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు వస్తుంది
ఓటు వేసినప్పుడే ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు వస్తుంది
పోటాపోటీగా సాగర్ నీళ్లు విడుదల చేసిన ఏపీ, తెలంగాణ అధికారులు
పోటాపోటీగా సాగర్ నీళ్లు విడుదల చేసిన ఏపీ, తెలంగాణ అధికారులు
కల్లాల్లోనే ధాన్యం రాశులు.. కన్నీరు పెడుతున్న రైతులు
కల్లాల్లోనే ధాన్యం రాశులు.. కన్నీరు పెడుతున్న రైతులు
వరుస చోరీలతో విసిగి.. మాటు వేసి.. దొంగలను పట్టుకున్న రైతులు
వరుస చోరీలతో విసిగి.. మాటు వేసి.. దొంగలను పట్టుకున్న రైతులు
మాకేమైనా బిచ్చం వేస్తున్నారా? ఎస్పీపై కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం
మాకేమైనా బిచ్చం వేస్తున్నారా? ఎస్పీపై కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం
కరెంటు కనెక్షన్ కట్ చేస్తామని కాల్ వస్తే.. చెక్ చేయాల్సిందే
కరెంటు కనెక్షన్ కట్ చేస్తామని కాల్ వస్తే.. చెక్ చేయాల్సిందే