AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

UGC NET 2026 అభ్యర్థులకు అలర్ట్.. కీలక అప్‌డేట్ ఇదిగో..!

యూజీసీ నెట్ డిసెంబర్ 2026 పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) కీలక అప్‌డేట్ ఇచ్చింది. పరీక్షలకు సంబంధించిన ఎగ్జామినేషన్ సిటీ ఇంటిమేషన్ స్లిప్పులను విడుదల చేసింది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ లాగిన్ వివరాలను నమోదు చేసి పరీక్షా కేంద్రం ఉన్న నగరానికి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోవచ్చు. డిసెంబర్ 14 నుంచి 18 వరకు, అలాగే డిసెంబర్ 21న పరీక్షలు నిర్వహించనున్నారు..

UGC NET 2026 అభ్యర్థులకు అలర్ట్.. కీలక అప్‌డేట్ ఇదిగో..!
UGC NET December Exam 2026 Date
Srilakshmi C
|

Updated on: Nov 27, 2026 | 8:09 AM

Share

హైదరాబాద్, నవంబర్ 27: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (UGC NET) డిసెంబర్ 2026 పరీక్షలకు సంబంధించి కీలక ప్రకటన చేసింది. పరీక్షలకు హాజరుకానున్న అభ్యర్థుల కోసం ఎగ్జామినేషన్ సిటీ ఇంటిమేషన్ స్లిప్పులను విడుదల చేసింది. ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ పరీక్ష ఏ నగరంలో నిర్వహించనున్నారనే వివరాలను ముందుగానే తెలుసుకునేందుకు ఈ స్లిప్పులు ఉపయోగపడతాయి. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి తమ అప్లికేషన్ వివరాలతో లాగిన్ అయి సిటీ ఇంటిమేషన్ స్లిప్పును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ఎప్పటి నుంచి పరీక్షలు నిర్వహిస్తారు?

యూజీసీ నెట్ డిసెంబర్ 2026 పరీక్షలను డిసెంబర్ 14 నుంచి 18వ తేదీ వరకు, అలాగే డిసెంబర్ 21న నిర్వహించనున్నట్లు ఎన్‌టీఏ వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన పరీక్షా కేంద్రాల్లో కంప్యూటర్ ఆధారిత విధానంలో (CBT) పరీక్షలు జరగనున్నాయి. ఈ పరీక్షలకు మొత్తం 87 సబ్జెక్టులను ఎంపిక చేశారు. అభ్యర్థులు తమ సబ్జెక్టుకు సంబంధించిన పరీక్ష తేదీ, షిఫ్ట్, ఇతర వివరాలను ఎన్‌టీఏ విడుదల చేసే అధికారిక పరీక్ష షెడ్యూల్‌లో పరిశీలించాలి.

సిటీ ఇంటిమేషన్ స్లిప్పును ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి?

  • అభ్యర్థులు కింది సూచనలను పాటించి తమ పరీక్షా నగరానికి సంబంధించిన సమాచార పత్రాన్ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
  • ముందుగా ఎన్‌టీఏ అధికారిక వెబ్‌సైట్ https://ugcnet.nta.ac.in/ ను సందర్శించాలి.
  • హోమ్‌పేజీలో UGC NET December 2026 Examination City Intimation Slip లింక్‌పై క్లిక్ చేయాలి.
  • అనంతరం అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ వంటి లాగిన్ వివరాలను నమోదు చేయాలి.
  • స్క్రీన్‌పై కనిపించే సెక్యూరిటీ పిన్‌ను నమోదు చేసి సబ్మిట్ చేయాలి.
  • మీ పరీక్షా నగరానికి సంబంధించిన ఇంటిమేషన్ స్లిప్ కనిపిస్తుంది.
  • అందులో ఉన్న వివరాలను జాగ్రత్తగా పరిశీలించాలి.
  • భవిష్యత్తు అవసరాల కోసం సిటీ ఇంటిమేషన్ స్లిప్పును డౌన్‌లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవాలి.

సిటీ స్లిప్.. అడ్మిట్ కార్డు ఒక్కటే కాదు!

అభ్యర్థులు ముఖ్యంగా ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఎన్‌టీఏ విడుదల చేసిన ఎగ్జామినేషన్ సిటీ ఇంటిమేషన్ స్లిప్పు అడ్మిట్ కార్డు కాదు. ఈ సమాచార పత్రం ద్వారా అభ్యర్థులు తమ పరీక్ష ఏ నగరంలో నిర్వహించనున్నారో ముందుగానే తెలుసుకోవచ్చు. అయితే పరీక్షా కేంద్రం పూర్తి చిరునామా, రిపోర్టింగ్ సమయం, పరీక్షకు సంబంధించిన ఇతర సూచనలు అడ్మిట్ కార్డులో ఉంటాయి. కాబట్టి సిటీ స్లిప్పు వచ్చిన వెంటనే అడ్మిట్ కార్డు కూడా వచ్చిందని భావించకూడదు. అడ్మిట్ కార్డు విడుదలైన తర్వాత దానిని ప్రత్యేకంగా డౌన్‌లోడ్ చేసుకోవాలి.

ఇవి కూడా చదవండి

UGC NET పరీక్ష విధానం ఎలా ఉంటుంది?

యూజీసీ నెట్ పరీక్షను కంప్యూటర్ ఆధారిత విధానంలో నిర్వహిస్తారు. మొత్తం 200 మార్కులకు పరీక్ష ఉంటుంది. పరీక్ష వ్యవధి 3 గంటలు. ఈ పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి.

  • పేపర్ – 1: మొత్తం 50 ప్రశ్నలు ఉంటాయి. 100 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. అభ్యర్థుల బోధనా సామర్థ్యం, పరిశోధనా సామర్థ్యం, తార్కిక ఆలోచన, అవగాహన తదితర అంశాలను పరీక్షిస్తారు.
  • పేపర్ – 2: మొత్తం 100 ప్రశ్నలు ఉంటాయి. 200 మార్కులకు నిర్వహిస్తారు. అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న సబ్జెక్టుకు సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి.

UGC NET పరీక్ష ఎందుకు నిర్వహిస్తారు?

దేశవ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ నియామక అర్హత, జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (JRF), పీహెచ్‌డీ ప్రవేశ అర్హతను నిర్ణయించేందుకు యూజీసీ నెట్ పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్షలో అర్హత సాధించడం ద్వారా అభ్యర్థులకు ఉన్నత విద్యా రంగంలో బోధన, పరిశోధన వంటి అవకాశాలు లభిస్తాయి. ముఖ్యంగా అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా కెరీర్ ప్రారంభించాలనుకునే వారికి ఈ పరీక్ష ఎంతో కీలకం. సిటీ ఇంటిమేషన్ స్లిప్పును డౌన్‌లోడ్ చేసుకునే సమయంలో సాంకేతిక సమస్యలు ఎదురైతే అభ్యర్థులు ఎన్‌టీఏ హెల్ప్‌డెస్క్‌ను సంప్రదించవచ్చు.

  • హెల్ప్‌డెస్క్ నంబర్: 011-40759000
  • ఈమెయిల్: ugcnet@nta.ac.in
  • అధికారిక వెబ్‌సైట్: https://ugcnet.nta.ac.in/

అభ్యర్థులు చివరి నిమిషం వరకు వేచి ఉండకుండా ముందుగానే సిటీ ఇంటిమేషన్ స్లిప్పును డౌన్‌లోడ్ చేసుకోవడం మంచిది. అలాగే పరీక్షకు వెళ్లే ముందు అడ్మిట్ కార్డులోని సూచనలను పూర్తిగా చదవాలి. యూజీసీ నెట్ డిసెంబర్ 2026 పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు వెంటనే అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి తమ పరీక్షా నగర వివరాలను తెలుసుకోవాలి. పరీక్ష తేదీలు, షిఫ్టులు, అడ్మిట్ కార్డు విడుదలకు సంబంధించిన తాజా అప్‌డేట్స్ కోసం ఎన్‌టీఏ అధికారిక వెబ్‌సైట్‌ను పరిశీలిస్తూ ఉండాలి.

యూజీసీ నెట్‌ 2026 డిసెంబర్ సిటీ ఇంటిమేషన్ స్లిప్పు డౌన్‌లోడ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
UGC NET 2026 అభ్యర్థులకు అలర్ట్.. కీలక అప్‌డేట్ ఇదిగో..!
UGC NET 2026 అభ్యర్థులకు అలర్ట్.. కీలక అప్‌డేట్ ఇదిగో..!
డిసెంబర్‌లో ఈ రోజుల్లో బ్యాంకులు బంద్.. మొత్తం ఎన్ని రోజులంటే..?
డిసెంబర్‌లో ఈ రోజుల్లో బ్యాంకులు బంద్.. మొత్తం ఎన్ని రోజులంటే..?
చలికాలంలో ఈ ఆకుకూరలన్నీ తింటున్నారా..? జాగ్రత్త, ఈ పురుగులుంటాయ్!
చలికాలంలో ఈ ఆకుకూరలన్నీ తింటున్నారా..? జాగ్రత్త, ఈ పురుగులుంటాయ్!
పెళ్లి సంబంధం కోసం మ్యాట్రిమోనీ కి వెళ్తే.. ఏకంగా రూ.12 లక్షలు
పెళ్లి సంబంధం కోసం మ్యాట్రిమోనీ కి వెళ్తే.. ఏకంగా రూ.12 లక్షలు
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. మరో 25 వేల ఉద్యోగాల భర్తీకి CM ప్రకటన
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. మరో 25 వేల ఉద్యోగాల భర్తీకి CM ప్రకటన
కూతురి భవిష్యత్తే లోకంగా బతికిన తల్లి.. రోడ్డు ప్రమాదంలో మృతి!
కూతురి భవిష్యత్తే లోకంగా బతికిన తల్లి.. రోడ్డు ప్రమాదంలో మృతి!
డ్రైవర్‌కు మూర్ఛ.. 73 మందిని కాపాడిన ప్రయాణికుడు!
డ్రైవర్‌కు మూర్ఛ.. 73 మందిని కాపాడిన ప్రయాణికుడు!
వెండి నగలు నల్లబడ్డాయా? ఈ సింపుల్ చిట్కాలతో కొత్తవాటిలా మెరవాలంటే
వెండి నగలు నల్లబడ్డాయా? ఈ సింపుల్ చిట్కాలతో కొత్తవాటిలా మెరవాలంటే
ఇందిరమ్మ బీమా పొందాలంటే కచ్చితంగా ఇంటి పన్ను చెల్లించాలా?
ఇందిరమ్మ బీమా పొందాలంటే కచ్చితంగా ఇంటి పన్ను చెల్లించాలా?
నువ్వు కెప్టెన్సీ మెటీరియల్ కాదు బ్రో.. తిలక్‌పై ఫ్యాన్స్ ఫైర్
నువ్వు కెప్టెన్సీ మెటీరియల్ కాదు బ్రో.. తిలక్‌పై ఫ్యాన్స్ ఫైర్
అపూర్వమైన ప్రకృతి దృశ్యాలు.. ఊటీని మైమరిపించే పులిగుండాల
అపూర్వమైన ప్రకృతి దృశ్యాలు.. ఊటీని మైమరిపించే పులిగుండాల
ఒక సామాన్యుడి వేల కోట్ల సామ్రాజ్యం వెనుకున్న రహస్యం ఏమిటి?
ఒక సామాన్యుడి వేల కోట్ల సామ్రాజ్యం వెనుకున్న రహస్యం ఏమిటి?
కార్లు, బైకుల బీమా ప్రీమియంపై కేంద్రం కసరత్తు
కార్లు, బైకుల బీమా ప్రీమియంపై కేంద్రం కసరత్తు
ఇన్సూరెన్స్ లేని బండ్లకు బంకుల్లో నో పెట్రోల్
ఇన్సూరెన్స్ లేని బండ్లకు బంకుల్లో నో పెట్రోల్
ఓటు వేసినప్పుడే ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు వస్తుంది
ఓటు వేసినప్పుడే ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు వస్తుంది
పోటాపోటీగా సాగర్ నీళ్లు విడుదల చేసిన ఏపీ, తెలంగాణ అధికారులు
పోటాపోటీగా సాగర్ నీళ్లు విడుదల చేసిన ఏపీ, తెలంగాణ అధికారులు
కల్లాల్లోనే ధాన్యం రాశులు.. కన్నీరు పెడుతున్న రైతులు
కల్లాల్లోనే ధాన్యం రాశులు.. కన్నీరు పెడుతున్న రైతులు
వరుస చోరీలతో విసిగి.. మాటు వేసి.. దొంగలను పట్టుకున్న రైతులు
వరుస చోరీలతో విసిగి.. మాటు వేసి.. దొంగలను పట్టుకున్న రైతులు
మాకేమైనా బిచ్చం వేస్తున్నారా? ఎస్పీపై కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం
మాకేమైనా బిచ్చం వేస్తున్నారా? ఎస్పీపై కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం
కరెంటు కనెక్షన్ కట్ చేస్తామని కాల్ వస్తే.. చెక్ చేయాల్సిందే
కరెంటు కనెక్షన్ కట్ చేస్తామని కాల్ వస్తే.. చెక్ చేయాల్సిందే