AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OLXలో బుల్లెట్ అమ్మకానికి పెట్టిన యువకుడు.. టెస్ట్ రైడ్ పేరుతో బండి ఎత్తుకెళ్లిన కేటుగాడు!

OLXలో రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ అమ్మకానికి పెట్టిన యువకుడికి వింత అనుభవం ఎదురైంది. కొనుగోలుదారుడిగా పరిచయమైన ఓ వ్యక్తి టెస్ట్ రైడ్ చేస్తానంటూ బైక్ తీసుకెళ్లి తిరిగి రాలేదు. ఫోన్ స్విచ్ఛాఫ్ చేయడంతో మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటుచేసుకుంది.

OLXలో బుల్లెట్ అమ్మకానికి పెట్టిన యువకుడు.. టెస్ట్ రైడ్ పేరుతో బండి ఎత్తుకెళ్లిన కేటుగాడు!
Test Ride Scam
N Narayana Rao
| Edited By: |

Updated on: Nov 27, 2026 | 8:26 AM

Share

ఆన్‌లైన్‌లో పాత వాహనాలు అమ్మేటప్పుడు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని మరో ఘటన గుర్తుచేసింది. బుల్లెట్ కొనుగోలు చేస్తానంటూ OLXలో ప్రకటన ఇచ్చిన యువకుడిని సంప్రదించిన ఓ వ్యక్తి.. కస్టమర్‌గా నమ్మించి చివరకు బైక్‌తో ఉడాయించాడు. టెస్ట్ రైడ్ చేస్తానంటూ తీసుకెళ్లిన వాహనాన్ని తిరిగి తీసుకురాకుండా మాయమయ్యాడు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వాపురం మండలం మొండికుంటలో చోటుచేసుకుంది.

బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. రామచంద్రాపురానికి చెందిన భరత్ చంద్రారెడ్డి తన రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్‌ను విక్రయించాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం OLXలో బైక్ వివరాలతో ప్రకటన పెట్టాడు. దీనిని చూసిన ఓ వ్యక్తి బుల్లెట్ కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తూ ఫోన్ చేశాడు. వాహనాన్ని ప్రత్యక్షంగా పరిశీలించేందుకు వస్తానని చెప్పి భరత్ చంద్రారెడ్డిని నమ్మించాడు.

అనుకున్నట్లుగానే అతడి వద్దకు చేరుకున్న సదరు వ్యక్తి బైక్‌ను పరిశీలించాడు. కొనుగోలు చేయడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని చెబుతూ.. ఒకసారి టెస్ట్ రైడ్ చేస్తానని అడిగాడు. కొనుగోలుదారుడేనని నమ్మిన భరత్ అందుకు అంగీకరించాడు. దీంతో బుల్లెట్ తీసుకుని వెళ్లిన ఆ వ్యక్తి ఎంతసేపటికీ తిరిగి రాలేదు. అతడికి ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ రావడంతో భరత్‌కు అసలు విషయం అర్థమైంది.

తాను మోసపోయానని గ్రహించిన బాధితుడు వెంటనే పోలీసులను ఆశ్రయించాడు. బుల్లెట్ కొనుగోలు చేస్తానంటూ పరిచయం పెంచుకుని, టెస్ట్ రైడ్ పేరుతో తన వాహనాన్ని తీసుకెళ్లిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశాడు. తన బైక్‌ను గుర్తించి తిరిగి ఇప్పించాలని పోలీసులను కోరుతున్నాడు. ఆన్‌లైన్ విక్రయాల పేరుతో కొత్త తరహాలో మోసాలకు పాల్పడుతున్న ఘటనల్లో ఇది కూడా ఒకటిగా నిలిచింది.

Follow Us
APPSC గ్రూప్ 2లో 720ఉద్యోగాలకు ముగుస్తున్న గడువు.. డైరెక్ట్ లింక్
APPSC గ్రూప్ 2లో 720ఉద్యోగాలకు ముగుస్తున్న గడువు.. డైరెక్ట్ లింక్
టీ20 హిస్టరీలోనే టీమిండియా ప్లేయర్ సరికొత్త రికార్డు..!
టీ20 హిస్టరీలోనే టీమిండియా ప్లేయర్ సరికొత్త రికార్డు..!
OLXలో బుల్లెట్ అమ్మకానికి పెట్టాడు.. టెస్ట్ రైడ్ పేరుతో బురిడీ!
OLXలో బుల్లెట్ అమ్మకానికి పెట్టాడు.. టెస్ట్ రైడ్ పేరుతో బురిడీ!
ప్రియుడికి నగలు ఇచ్చింది.. చివరకు ప్రాణాలే తీసుకుంది!
ప్రియుడికి నగలు ఇచ్చింది.. చివరకు ప్రాణాలే తీసుకుంది!
UGC NET 2026 అభ్యర్థులకు అలర్ట్.. కీలక అప్‌డేట్ ఇదిగో..!
UGC NET 2026 అభ్యర్థులకు అలర్ట్.. కీలక అప్‌డేట్ ఇదిగో..!
డిసెంబర్‌లో ఈ రోజుల్లో బ్యాంకులు బంద్.. మొత్తం ఎన్ని రోజులంటే..?
డిసెంబర్‌లో ఈ రోజుల్లో బ్యాంకులు బంద్.. మొత్తం ఎన్ని రోజులంటే..?
చలికాలంలో ఈ ఆకుకూరలన్నీ తింటున్నారా..? జాగ్రత్త, ఈ పురుగులుంటాయ్!
చలికాలంలో ఈ ఆకుకూరలన్నీ తింటున్నారా..? జాగ్రత్త, ఈ పురుగులుంటాయ్!
పెళ్లి సంబంధం కోసం మ్యాట్రిమోనీ కి వెళ్తే.. ఏకంగా రూ.12 లక్షలు
పెళ్లి సంబంధం కోసం మ్యాట్రిమోనీ కి వెళ్తే.. ఏకంగా రూ.12 లక్షలు
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. మరో 25 వేల ఉద్యోగాల భర్తీకి CM ప్రకటన
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. మరో 25 వేల ఉద్యోగాల భర్తీకి CM ప్రకటన
కూతురి భవిష్యత్తే లోకంగా బతికిన తల్లి.. రోడ్డు ప్రమాదంలో మృతి!
కూతురి భవిష్యత్తే లోకంగా బతికిన తల్లి.. రోడ్డు ప్రమాదంలో మృతి!
అపూర్వమైన ప్రకృతి దృశ్యాలు.. ఊటీని మైమరిపించే పులిగుండాల
అపూర్వమైన ప్రకృతి దృశ్యాలు.. ఊటీని మైమరిపించే పులిగుండాల
ఒక సామాన్యుడి వేల కోట్ల సామ్రాజ్యం వెనుకున్న రహస్యం ఏమిటి?
ఒక సామాన్యుడి వేల కోట్ల సామ్రాజ్యం వెనుకున్న రహస్యం ఏమిటి?
కార్లు, బైకుల బీమా ప్రీమియంపై కేంద్రం కసరత్తు
కార్లు, బైకుల బీమా ప్రీమియంపై కేంద్రం కసరత్తు
ఇన్సూరెన్స్ లేని బండ్లకు బంకుల్లో నో పెట్రోల్
ఇన్సూరెన్స్ లేని బండ్లకు బంకుల్లో నో పెట్రోల్
ఓటు వేసినప్పుడే ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు వస్తుంది
ఓటు వేసినప్పుడే ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు వస్తుంది
పోటాపోటీగా సాగర్ నీళ్లు విడుదల చేసిన ఏపీ, తెలంగాణ అధికారులు
పోటాపోటీగా సాగర్ నీళ్లు విడుదల చేసిన ఏపీ, తెలంగాణ అధికారులు
కల్లాల్లోనే ధాన్యం రాశులు.. కన్నీరు పెడుతున్న రైతులు
కల్లాల్లోనే ధాన్యం రాశులు.. కన్నీరు పెడుతున్న రైతులు
వరుస చోరీలతో విసిగి.. మాటు వేసి.. దొంగలను పట్టుకున్న రైతులు
వరుస చోరీలతో విసిగి.. మాటు వేసి.. దొంగలను పట్టుకున్న రైతులు
మాకేమైనా బిచ్చం వేస్తున్నారా? ఎస్పీపై కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం
మాకేమైనా బిచ్చం వేస్తున్నారా? ఎస్పీపై కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం
కరెంటు కనెక్షన్ కట్ చేస్తామని కాల్ వస్తే.. చెక్ చేయాల్సిందే
కరెంటు కనెక్షన్ కట్ చేస్తామని కాల్ వస్తే.. చెక్ చేయాల్సిందే