AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

11వ నంబర్ బ్యాటర్‌గా వచ్చాడు.. కట్‌చేస్తే.. టీ20 హిస్టరీలోనే టీమిండియా ప్లేయర్ సరికొత్త రికార్డు..!

Jaydev Unadkat T20 Record: సౌరాష్ట్ర కెప్టెన్ జయదేవ్ ఉనద్కట్ టీ20 క్రికెట్‌లో అరుదైన రికార్డు సృష్టించాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో తమిళనాడుతో జరిగిన మ్యాచ్‌లో 11వ స్థానంలో బ్యాటింగ్‌కు దిగి 26 బంతుల్లో 40 పరుగులు చేశాడు. చేతన్ సకారియాతో కలిసి పదో వికెట్‌కు 62 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు.

11వ నంబర్ బ్యాటర్‌గా వచ్చాడు.. కట్‌చేస్తే.. టీ20 హిస్టరీలోనే టీమిండియా ప్లేయర్ సరికొత్త రికార్డు..!
Jaydev Unadkat Batting
Venkata Chari
|

Updated on: Nov 27, 2026 | 8:21 AM

Share

Jaydev Unadkat T20 Record: టీమిండియా వెటరన్ పేసర్ జయదేవ్ ఉనద్కట్ బ్యాటింగ్‌లోనూ తన సత్తా చాటాడు. సాధారణంగా బంతితో ప్రత్యర్థులను ఇబ్బంది పెట్టే ఈ సౌరాష్ట్ర కెప్టెన్.. ఇప్పుడు బ్యాట్‌తో అరుదైన రికార్డు సృష్టించాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో తమిళనాడుతో జరిగిన మ్యాచ్‌లో 11వ స్థానంలో బ్యాటింగ్‌కు దిగి చరిత్ర సృష్టించాడు. అంతేకాదు, చేతన్ సకారియాతో కలిసి పదో వికెట్‌కు అద్భుత భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.

ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో గురువారం సౌరాష్ట్ర, తమిళనాడు జట్లు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ గ్రూప్ దశ చివరి మ్యాచ్‌లో తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన తమిళనాడు 193 పరుగుల లక్ష్యాన్ని సౌరాష్ట్ర ముందు ఉంచింది. లక్ష్య ఛేదనలో సౌరాష్ట్రకు ఆదిలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. 54/2తో ఉన్న జట్టు.. వరుసగా వికెట్లు కోల్పోయి 92 పరుగులకే 9 వికెట్లు నష్టపోయింది. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన జయదేవ్ ఉనద్కట్, చేతన్ సకారియా అద్భుతంగా పోరాడారు.

ఎక్కువమంది చదివినది: SL A vs IND A: ఆ ఇద్దరు కలిసి కొంప ముంచేశారు.. అందుకే చిత్తుగా ఓడిపోయాం..: తిలక్ వర్మ

ముఖ్యంగా సౌరాష్ట్ర కెప్టెన్ ఉనద్కట్ 26 బంతుల్లో 40 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. దీంతో టీ20 క్రికెట్ చరిత్రలో 11వ స్థానంలో బ్యాటింగ్‌కు దిగి అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. ఇంతకుముందు ఈ రికార్డు బెల్జియం ఆటగాడు ఖలీద్ అహ్మదీ పేరిట ఉండేది. అతను 2021లో మాల్టాపై 18 బంతుల్లో 31 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇప్పుడు ఉనద్కట్ 40 పరుగులతో ఆ రికార్డును అధిగమించాడు.

టీ20ల్లో 11వ స్థానంలో బ్యాటింగ్‌కు దిగి అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లు:

పరుగులు ఆటగాడు ప్రత్యర్థి
40 (26) జయదేవ్ ఉనద్కట్ తమిళనాడు (2026)
31* (18) ఖలీద్ అహ్మదీ మాల్టా (2021)
23 (14) పాల్ వాన్ మీకెరెన్ బంగ్లాదేశ్ (2022)

చేతన్ సకారియాతో కలిసి మరో చారిత్రక రికార్డు..

ఉనద్కట్, చేతన్ సకారియా కేవలం వ్యక్తిగత రికార్డులకే పరిమితం కాలేదు. వీరిద్దరూ కలిసి పదో వికెట్‌కు 62 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. టీ20 క్రికెట్ చరిత్రలో పదో వికెట్‌కు నమోదైన అత్యధిక భాగస్వామ్యాల్లో ఇది సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచింది.

2021లో అర్జెంటీనాతో జరిగిన మ్యాచ్‌లో పనామా ఆటగాళ్లు ఖేంగర్ అహిర్, నికుంజ్ అహిర్ కూడా పదో వికెట్‌కు 62 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇప్పుడు ఉనద్కట్, సకారియా ఈ రికార్డును సమం చేశారు.

టీ20 క్రికెట్‌లో పదో వికెట్‌కు అత్యధిక భాగస్వామ్యాలు:

పరుగులు ఆటగాళ్లు జట్లు
62 ఉనద్కట్ – సకారియా సౌరాష్ట్ర
62* ఖేంగర్ అహిర్ – నికుంజ్ అహిర్ పనామా
55* సుధాకర్ కొప్పోలు – దిలీప్ పల్లెకొండ స్లోవేనియా

ఐపీఎల్ 2027 వేలంలో ఉనద్కట్, సకారియా..

ఈ మ్యాచ్‌లో ఉనద్కట్, సకారియా బౌలింగ్‌లోనూ రాణించారు. ఉనద్కట్ నాలుగు ఓవర్లలో 36 పరుగులిచ్చి ఒక వికెట్ పడగొట్టగా.. చేతన్ సకారియా నాలుగు ఓవర్లలో 37 పరుగులిచ్చి మూడు వికెట్లు తీశాడు. సౌరాష్ట్ర తరపున సకారియా అత్యుత్తమ బౌలర్‌గా నిలిచాడు.

ఎక్కువమంది చదివినది: నువ్వు కెప్టెన్సీ మెటీరియల్ కాదు బ్రో .. బ్యాటర్‌గా, నాయకుడిగా అట్టర్ ఫ్లాప్.. తిలక్ వర్మపై ఫ్యాన్స్ ఫైర్..!

మరోవైపు ఐపీఎల్ 2027 వేలానికి ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు జయదేవ్ ఉనద్కట్‌ను విడుదల చేసింది. దీంతో ఉనద్కట్‌తో పాటు చేతన్ సకారియా కూడా వచ్చే ఐపీఎల్ వేలంలో అందుబాటులో ఉండనున్నారు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఈ ఇద్దరు పేసర్లు చూపించిన ప్రదర్శనతో ఐపీఎల్ ఫ్రాంచైజీల దృష్టిని ఆకర్షించే అవకాశం ఉంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
టీ20 హిస్టరీలోనే టీమిండియా ప్లేయర్ సరికొత్త రికార్డు..!
టీ20 హిస్టరీలోనే టీమిండియా ప్లేయర్ సరికొత్త రికార్డు..!
OLXలో బుల్లెట్ అమ్మకానికి పెట్టాడు.. టెస్ట్ రైడ్ పేరుతో బురిడీ!
OLXలో బుల్లెట్ అమ్మకానికి పెట్టాడు.. టెస్ట్ రైడ్ పేరుతో బురిడీ!
ప్రియుడికి నగలు ఇచ్చింది.. చివరకు ప్రాణాలే తీసుకుంది!
ప్రియుడికి నగలు ఇచ్చింది.. చివరకు ప్రాణాలే తీసుకుంది!
UGC NET 2026 అభ్యర్థులకు అలర్ట్.. కీలక అప్‌డేట్ ఇదిగో..!
UGC NET 2026 అభ్యర్థులకు అలర్ట్.. కీలక అప్‌డేట్ ఇదిగో..!
డిసెంబర్‌లో ఈ రోజుల్లో బ్యాంకులు బంద్.. మొత్తం ఎన్ని రోజులంటే..?
డిసెంబర్‌లో ఈ రోజుల్లో బ్యాంకులు బంద్.. మొత్తం ఎన్ని రోజులంటే..?
చలికాలంలో ఈ ఆకుకూరలన్నీ తింటున్నారా..? జాగ్రత్త, ఈ పురుగులుంటాయ్!
చలికాలంలో ఈ ఆకుకూరలన్నీ తింటున్నారా..? జాగ్రత్త, ఈ పురుగులుంటాయ్!
పెళ్లి సంబంధం కోసం మ్యాట్రిమోనీ కి వెళ్తే.. ఏకంగా రూ.12 లక్షలు
పెళ్లి సంబంధం కోసం మ్యాట్రిమోనీ కి వెళ్తే.. ఏకంగా రూ.12 లక్షలు
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. మరో 25 వేల ఉద్యోగాల భర్తీకి CM ప్రకటన
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. మరో 25 వేల ఉద్యోగాల భర్తీకి CM ప్రకటన
కూతురి భవిష్యత్తే లోకంగా బతికిన తల్లి.. రోడ్డు ప్రమాదంలో మృతి!
కూతురి భవిష్యత్తే లోకంగా బతికిన తల్లి.. రోడ్డు ప్రమాదంలో మృతి!
డ్రైవర్‌కు మూర్ఛ.. 73 మందిని కాపాడిన ప్రయాణికుడు!
డ్రైవర్‌కు మూర్ఛ.. 73 మందిని కాపాడిన ప్రయాణికుడు!
అపూర్వమైన ప్రకృతి దృశ్యాలు.. ఊటీని మైమరిపించే పులిగుండాల
అపూర్వమైన ప్రకృతి దృశ్యాలు.. ఊటీని మైమరిపించే పులిగుండాల
ఒక సామాన్యుడి వేల కోట్ల సామ్రాజ్యం వెనుకున్న రహస్యం ఏమిటి?
ఒక సామాన్యుడి వేల కోట్ల సామ్రాజ్యం వెనుకున్న రహస్యం ఏమిటి?
కార్లు, బైకుల బీమా ప్రీమియంపై కేంద్రం కసరత్తు
కార్లు, బైకుల బీమా ప్రీమియంపై కేంద్రం కసరత్తు
ఇన్సూరెన్స్ లేని బండ్లకు బంకుల్లో నో పెట్రోల్
ఇన్సూరెన్స్ లేని బండ్లకు బంకుల్లో నో పెట్రోల్
ఓటు వేసినప్పుడే ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు వస్తుంది
ఓటు వేసినప్పుడే ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు వస్తుంది
పోటాపోటీగా సాగర్ నీళ్లు విడుదల చేసిన ఏపీ, తెలంగాణ అధికారులు
పోటాపోటీగా సాగర్ నీళ్లు విడుదల చేసిన ఏపీ, తెలంగాణ అధికారులు
కల్లాల్లోనే ధాన్యం రాశులు.. కన్నీరు పెడుతున్న రైతులు
కల్లాల్లోనే ధాన్యం రాశులు.. కన్నీరు పెడుతున్న రైతులు
వరుస చోరీలతో విసిగి.. మాటు వేసి.. దొంగలను పట్టుకున్న రైతులు
వరుస చోరీలతో విసిగి.. మాటు వేసి.. దొంగలను పట్టుకున్న రైతులు
మాకేమైనా బిచ్చం వేస్తున్నారా? ఎస్పీపై కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం
మాకేమైనా బిచ్చం వేస్తున్నారా? ఎస్పీపై కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం
కరెంటు కనెక్షన్ కట్ చేస్తామని కాల్ వస్తే.. చెక్ చేయాల్సిందే
కరెంటు కనెక్షన్ కట్ చేస్తామని కాల్ వస్తే.. చెక్ చేయాల్సిందే