AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP DSC 2026 అప్లికేషన్లకు మరికొన్నిగంటలే గడువు.. నెల రోజుల్లోనే పరీక్షలు!

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ముఖ్యమైన అలర్ట్. ఏపీ డీఎస్సీ 2026 ఆన్‌లైన్ దరఖాస్తుల గడువు నవంబర్ 30తో ముగియనుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 2,721 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు పరీక్షలకు సిద్ధమవుతుండగా, ఇంకా అప్లై చేయని వారు వెంటనే దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేసుకోవాలి. డిసెంబర్ 20 నుంచి జనవరి 13 వరకు కంప్యూటర్ ఆధారిత పరీక్షలు నిర్వహించనున్నారు..

AP DSC 2026 అప్లికేషన్లకు మరికొన్నిగంటలే గడువు.. నెల రోజుల్లోనే పరీక్షలు!
AP DSC Exam Schedule
Srilakshmi C
|

Updated on: Nov 27, 2026 | 8:44 AM

Share

అమరావతి, నవంబర్ 27: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీ కోసం ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నియామక ప్రక్రియ ద్వారా ప్రభుత్వ పాఠశాలలు, ప్రత్యేక విద్యా విభాగాలు, వివిధ సొసైటీలు, ఇతర యాజమాన్యాల పరిధిలో మొత్తం 2,721 పోస్టులను భర్తీ చేయనున్నారు. డీఎస్సీ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ నవంబర్ 30తో ముగియనుంది. అభ్యర్థులు చివరి తేదీ వరకు వేచి ఉండకుండా ముందుగానే దరఖాస్తు చేసుకోవడం మంచిది. దరఖాస్తు సమయంలో విద్యార్హతలు, బీఈడీ లేదా డీఈడీ అర్హతలు, టెట్ వివరాలు తదితర సమాచారాన్ని జాగ్రత్తగా నమోదు చేయాలి. ఈ డీఎస్సీ నోటిఫికేషన్ ద్వారా వివిధ కేటగిరీల్లో ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్నారు.

విభాగాల వారీగా పోస్టుల వివరాలు..

  • జనరల్ పాఠశాలలు (SA, SGT) పోస్టుల సంఖ్య: 2,111
  • ప్రత్యేక విద్య (SA, SGT) పోస్టుల సంఖ్య: 350
  • సొసైటీలు, ఇతర యాజమాన్యాలు (Principal, PGT, TGT, PD, PET) పోస్టుల సంఖ్య: 260

డీఎస్సీ పరీక్షలు ఎప్పటి నుంచి?

జనరల్ పాఠశాలల పరిధిలో అత్యధికంగా 2,111 పోస్టులు ఉన్నాయి. ప్రత్యేక విద్య విభాగంలో 350 పోస్టులు, సొసైటీలు, ఇతర యాజమాన్యాల పరిధిలో మరో 260 పోస్టులు భర్తీ చేయనున్నారు. డీఎస్సీ అభ్యర్థుల కోసం కంప్యూటర్ ఆధారిత పరీక్షలను డిసెంబర్ 20 నుంచి జనవరి 13 వరకు నిర్వహించనున్నారు. అభ్యర్థులు తమకు సంబంధించిన పరీక్ష తేదీ, షిఫ్ట్, ఇతర వివరాలను అధికారిక పరీక్షల షెడ్యూల్‌లో పరిశీలించాలి. పరీక్షలకు ముందు అభ్యర్థులు ఆన్‌లైన్ మాక్ టెస్ట్ రాసేందుకు కూడా అవకాశం కల్పించారు. డిసెంబర్ 5 నుంచి మాక్ టెస్ట్ అందుబాటులోకి రానుంది. దీని ద్వారా అభ్యర్థులు కంప్యూటర్ ఆధారిత పరీక్ష విధానంపై అవగాహన పెంచుకోవచ్చు. డీఎస్సీ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లను డిసెంబర్ 14 నుంచి డౌన్‌లోడ్ చేసుకునేందుకు అవకాశం కల్పించనున్నారు. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి తమ లాగిన్ వివరాలతో హాల్ టికెట్లను పొందవచ్చు. హాల్ టికెట్‌లో అభ్యర్థి పేరు, రిజిస్ట్రేషన్ నంబర్, పరీక్ష తేదీ, పరీక్ష కేంద్రం, రిపోర్టింగ్ సమయం వంటి వివరాలను తప్పనిసరిగా పరిశీలించాలి. పరీక్షకు హాజరయ్యే సమయంలో హాల్ టికెట్‌తో పాటు సూచించిన గుర్తింపు కార్డును తీసుకెళ్లాలి.

ప్రాథమిక కీ, తుది కీ ఎప్పుడు?

డీఎస్సీ పరీక్షల నిర్వహణ పూర్తయిన తర్వాత మూల్యాంకన ప్రక్రియ ప్రారంభమవుతుంది. చివరి పరీక్ష ముగిసిన రెండు రోజుల తర్వాత ప్రాథమిక కీ (Preliminary Answer Key) విడుదల చేయనున్నారు. ప్రాథమిక కీపై అభ్యర్థులకు అభ్యంతరాలు తెలియజేసేందుకు వారం రోజుల గడువు కల్పిస్తారు. అభ్యర్థులు తమ సమాధానాలపై అభ్యంతరాలు ఉంటే సంబంధిత ఆధారాలతో ఆన్‌లైన్‌లో సమర్పించవచ్చు. అభ్యంతరాలను పరిశీలించిన అనంతరం మరో వారం రోజులకు తుది కీ (Final Answer Key) విడుదల చేయనున్నారు. తుది కీ ఆధారంగా అభ్యర్థుల మార్కులను నిర్ణయించే ప్రక్రియ కొనసాగుతుంది. పరీక్షలకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో అభ్యర్థులు ప్రణాళికాబద్ధంగా చదవాలి. ముఖ్యంగా వారు దరఖాస్తు చేసిన పోస్టుకు సంబంధించిన సిలబస్‌ను పూర్తిగా పరిశీలించాలి. గత సంవత్సరాల ప్రశ్నపత్రాలను సాధన చేయాలి. సబ్జెక్టు సంబంధిత అంశాలపై ఎక్కువ దృష్టి పెట్టాలి. రోజూ ఆన్‌లైన్ మాక్ టెస్టులు రాయాలి. సమయపాలన, ప్రశ్నల వేగం పెంచుకోవాలి. ముఖ్యమైన అంశాలను పునశ్చరణ చేసుకోవాలి. హాల్ టికెట్ విడుదల తేదీని గుర్తుంచుకోవాలి. దరఖాస్తు చేసుకునే ముందు అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్, పోస్టుల వారీ విద్యార్హతలు, వయోపరిమితి, రిజర్వేషన్ నిబంధనలు, పరీక్షా విధానాన్ని జాగ్రత్తగా చదవాలి. ఏపీ డీఎస్సీ 2026 ద్వారా 2,721 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి అవకాశం లభిస్తోంది. దరఖాస్తులకు నవంబర్ 30 చివరి తేదీ కావడంతో అర్హులైన అభ్యర్థులు ఆలస్యం చేయకుండా అప్లై చేసుకోవాలి. పరీక్షలకు సిద్ధమవుతున్నవారు డిసెంబర్ 20 నుంచి ప్రారంభమయ్యే కంప్యూటర్ ఆధారిత పరీక్షలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచే ప్రిపరేషన్ వేగవంతం చేయాలి.

ఇవి కూడా చదవండి

ముఖ్యమైన తేదీలు ఇవే

  • ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: నవంబర్ 30, 2026.
  • ఆన్‌లైన్ మాక్ టెస్ట్: డిసెంబర్ 5, 2026.
  • హాల్ టికెట్ల డౌన్‌లోడ్: డిసెంబర్ 14 నుంచి
  • కంప్యూటర్ ఆధారిత పరీక్షలు: డిసెంబర్ 20 – జనవరి 13
  • ప్రాథమిక కీ: చివరి పరీక్ష తర్వాత 2 రోజులకు
  • అభ్యంతరాల గడువు: 1 వారం
  • తుది కీ: అభ్యంతరాల పరిశీలన అనంతరం

ఏపీ డీఎస్సీ ఆన్‌లైన్‌ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
AP DSC 2026 అప్లికేషన్లకు మరికొన్నిగంటలే గడువు.. పరీక్ష తేదీ ఇదే
AP DSC 2026 అప్లికేషన్లకు మరికొన్నిగంటలే గడువు.. పరీక్ష తేదీ ఇదే
మూడు నెలల ముచ్చటైన ఆకుకూర..ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో తెలుసా?
మూడు నెలల ముచ్చటైన ఆకుకూర..ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో తెలుసా?
APPSC గ్రూప్ 2లో 720ఉద్యోగాలకు ముగుస్తున్న గడువు.. డైరెక్ట్ లింక్
APPSC గ్రూప్ 2లో 720ఉద్యోగాలకు ముగుస్తున్న గడువు.. డైరెక్ట్ లింక్
టీ20 హిస్టరీలోనే టీమిండియా ప్లేయర్ సరికొత్త రికార్డు..!
టీ20 హిస్టరీలోనే టీమిండియా ప్లేయర్ సరికొత్త రికార్డు..!
OLXలో బుల్లెట్ అమ్మకానికి పెట్టాడు.. టెస్ట్ రైడ్ పేరుతో బురిడీ!
OLXలో బుల్లెట్ అమ్మకానికి పెట్టాడు.. టెస్ట్ రైడ్ పేరుతో బురిడీ!
ప్రియుడికి నగలు ఇచ్చింది.. చివరకు ప్రాణాలే తీసుకుంది!
ప్రియుడికి నగలు ఇచ్చింది.. చివరకు ప్రాణాలే తీసుకుంది!
UGC NET 2026 అభ్యర్థులకు అలర్ట్.. కీలక అప్‌డేట్ ఇదిగో..!
UGC NET 2026 అభ్యర్థులకు అలర్ట్.. కీలక అప్‌డేట్ ఇదిగో..!
డిసెంబర్‌లో ఈ రోజుల్లో బ్యాంకులు బంద్.. మొత్తం ఎన్ని రోజులంటే..?
డిసెంబర్‌లో ఈ రోజుల్లో బ్యాంకులు బంద్.. మొత్తం ఎన్ని రోజులంటే..?
చలికాలంలో ఈ ఆకుకూరలన్నీ తింటున్నారా..? జాగ్రత్త, ఈ పురుగులుంటాయ్!
చలికాలంలో ఈ ఆకుకూరలన్నీ తింటున్నారా..? జాగ్రత్త, ఈ పురుగులుంటాయ్!
పెళ్లి సంబంధం కోసం మ్యాట్రిమోనీ కి వెళ్తే.. ఏకంగా రూ.12 లక్షలు
పెళ్లి సంబంధం కోసం మ్యాట్రిమోనీ కి వెళ్తే.. ఏకంగా రూ.12 లక్షలు
అపూర్వమైన ప్రకృతి దృశ్యాలు.. ఊటీని మైమరిపించే పులిగుండాల
అపూర్వమైన ప్రకృతి దృశ్యాలు.. ఊటీని మైమరిపించే పులిగుండాల
ఒక సామాన్యుడి వేల కోట్ల సామ్రాజ్యం వెనుకున్న రహస్యం ఏమిటి?
ఒక సామాన్యుడి వేల కోట్ల సామ్రాజ్యం వెనుకున్న రహస్యం ఏమిటి?
కార్లు, బైకుల బీమా ప్రీమియంపై కేంద్రం కసరత్తు
కార్లు, బైకుల బీమా ప్రీమియంపై కేంద్రం కసరత్తు
ఇన్సూరెన్స్ లేని బండ్లకు బంకుల్లో నో పెట్రోల్
ఇన్సూరెన్స్ లేని బండ్లకు బంకుల్లో నో పెట్రోల్
ఓటు వేసినప్పుడే ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు వస్తుంది
ఓటు వేసినప్పుడే ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు వస్తుంది
పోటాపోటీగా సాగర్ నీళ్లు విడుదల చేసిన ఏపీ, తెలంగాణ అధికారులు
పోటాపోటీగా సాగర్ నీళ్లు విడుదల చేసిన ఏపీ, తెలంగాణ అధికారులు
కల్లాల్లోనే ధాన్యం రాశులు.. కన్నీరు పెడుతున్న రైతులు
కల్లాల్లోనే ధాన్యం రాశులు.. కన్నీరు పెడుతున్న రైతులు
వరుస చోరీలతో విసిగి.. మాటు వేసి.. దొంగలను పట్టుకున్న రైతులు
వరుస చోరీలతో విసిగి.. మాటు వేసి.. దొంగలను పట్టుకున్న రైతులు
మాకేమైనా బిచ్చం వేస్తున్నారా? ఎస్పీపై కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం
మాకేమైనా బిచ్చం వేస్తున్నారా? ఎస్పీపై కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం
కరెంటు కనెక్షన్ కట్ చేస్తామని కాల్ వస్తే.. చెక్ చేయాల్సిందే
కరెంటు కనెక్షన్ కట్ చేస్తామని కాల్ వస్తే.. చెక్ చేయాల్సిందే