24 ఏళ్లుగా మీడియా లో ఉంటున్నాను.మొదట 2001 ప్రారంభం లో ఈనాడు కర్నూల్ లో చేరాను.కొంతకాలం ఈటీవీ లో చేసిన తర్వాత డిసెంబర్ 23 2003 లో టీవీ9 లో చేరాను. అనంతపురం staff reporter గా 2010 వరకు చేశాను.మధ్యలో కొన్ని రోజులపాటు నిజామాబాద్ staff reporter గా కూడా పని చేశా.2010 అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు ఉమ్మడి కర్నూలు జిల్లాకు సీనియర్ కరస్పాండెంట్ గా సక్సెస్ఫుల్ గా పనిచేస్తున్నాను.
Andhra Pradesh: సరదాగా మొదలైన అలవాటు మెడకు చుట్టేసుకుంది.. ఈ యువకుడి జీవితంలో ఏం జరిగిందంటే..?
చేతిలో స్మార్ట్‌ఫోన్.. రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయిపోవాలనే అత్యాశ.. వెరసి మరో నిండు ప్రాణం బలైపోయింది. ఆన్లైన్ క్రికెట్ బెట్టింగుల ఊబిలో చిక్కుకుని, లోన్ యాప్‌ల వేధింపులు తాళలేక నంద్యాల జిల్లాకు చెందిన ఓ 23 ఏళ్ల యువకుడు కత్తితో గొంతు కోసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. కూలీ నాలీ చేసుకునే ఆ నిరుపేద కుటుంబానికి తీరని శోకాన్ని మిగిల్చిన ఈ హృదయవిదారక ఘటన గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం..
- J Y Nagi Reddy
- Updated on: Oct 7, 2026
- 5:46 pm
Nandyal: ‘లైక్ సిస్టర్’ వ్యవహారమే బాలికను బలి తీసుకుందా..?
నంద్యాల జిల్లా కొత్తపల్లి కస్తూర్బా పాఠశాలలో ఇంటర్ ఫస్టియర్ విద్యార్థిని భవ్య మృతి కలకలం రేపింది. ఘటనకు ‘లైక్ సిస్టర్’ వ్యవహారమే కారణమని విద్యార్థిని బంధువులు, కొందరు విద్యార్థినులు ఆరోపిస్తుండగా.. అసలు కారణంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సూసైడ్ నోట్‌పై కూడా భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.
- J Y Nagi Reddy
- Updated on: Sep 25, 2026
- 7:45 pm
సారో చేతబడి చేశారు.. రాత్రైతే చాలు అలా అయిపోతున్నా.. కలెక్టర్‌కు వింత ఫిర్యాదు
కర్నూలు జిల్లాలో ఓ వ్యక్తి తన హైట్ తగ్గిపోవడానికి చేతబడులే కారణమంటూ జిల్లా కలెక్టర్ గ్రీవెన్స్ సెల్లో ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారింది. 165 సెం.మీ. నుంచి 158 సెం.మీ.కు తగ్గిపోయానని ఆయన పేర్కొన్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. అయితే చేతబడుల వల్ల మనిషి ఎత్తు తగ్గుతుందనే దానికి శాస్త్రీయ ఆధారాలు లేవు.
- J Y Nagi Reddy
- Updated on: Sep 25, 2026
- 8:19 am
బాత్రూమ్లో బుసలు కొట్టిన నల్లనాగు.. మహానంది కాలనీలో కలకలం!
మహానంది దేవస్థానం కాలనీలో నాగుపాము హల్చల్ చేసింది. కాలనీలోని ఈశ్వర్ అనే వ్యక్తి ఇంట్లో బాత్రూమ్లో నల్లనాగుపాము కనిపించడంతో కుటుంబ సభ్యులు భయాందోళనకు గురయ్యారు. ఇంట్లో పాము ఉన్న విషయాన్ని గుర్తించిన ఈశ్వర్ వెంటనే స్నేక్ క్యాచర్ మోహన్‌కు సమాచారం అందించారు.
- J Y Nagi Reddy
- Updated on: Sep 23, 2026
- 12:44 pm
శైలజ ఎంతకు తెగించింది.. అక్క మొగుడితో కలిసి భర్తను లేపేసిన భార్య..
కర్నూలు జిల్లా ఆదోనిలో భర్త హత్య కేసును పోలీసులు ఛేదించారు. వివాహేతర సంబంధం, కుటుంబ కలహాల నేపథ్యంలో భార్య శైలజ తన బావతో కలిసి భర్త వీరేశ్‌ను హత్య చేయించినట్లు పోలీసులు తెలిపారు. సెప్టెంబర్ 18న జరిగిన ఈ ఘటనలో శైలజ, గిడ్డయ్యగారి వీరేశ్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ చంద్రశేఖర్ తెలిపారు.
- J Y Nagi Reddy
- Updated on: Sep 23, 2026
- 12:19 pm
Andhra Pradesh: 10ఏళ్ల ప్రేమ.. ప్రియుడి నమ్మకద్రోహం.. చివరకు యువతి ఊహించని నిర్ణయం..
ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించిన ప్రియుడు.. ప్రభుత్వ ఉద్యోగం రాగానే ముఖం చాటేయడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ బీఈడీ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. పదేళ్ల బంధాన్ని కులం నెపంతో కాలదన్నిన ప్రియుడి మోసాన్ని భరించలేక పురుగుల మందు తాగి ప్రాణాలు విడిచింది. కర్నూలు నగరంలోని బుధవార్‌పేటలో చోటుచేసుకున్న ఈ విషాద ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
- J Y Nagi Reddy
- Updated on: Sep 20, 2026
- 6:11 pm
ఎల్నీనో ఎఫెక్ట్.. 12 ఏళ్ల కష్టం, 29లక్షల పెట్టుబడి.. సాగుచేసిన పంటను చేతురాల నరికేసిన రైతన్న!
కన్నబిడ్డల్లా సాకిన చెట్లను.. తన చేతులతోనే నరికేయాల్సి వస్తే ఆ రైతు గుండె ఎంతలా రగిలిపోతుందో కదా! పన్నెండేళ్ల శ్రమను, పచ్చని ఆశలను కళ్లముందే నేలమట్టం చేసిన ఆ అన్నదాత ఆవేదన వర్ణనాతీతం. వానలు పడక.. బోర్లు ఎండిపోయి.. చేసిన అప్పులు తీర్చలేక ఓ రైతు గుండెను రాయి చేసుకున్నాడు. నీరు అందక నిలువునా ఎండిపోతున్న ఏడు ఎకరాల చీని, ఎకరం నిమ్మ తోటను తట్టుకోలేక గొడ్డలితో నరికేసి కన్నీరుమున్నీరయ్యాడు. కర్నూలు జిల్లాలో వెలుగు చూసిన ఈ ఘటన అందరినీ కంటతడి పెట్టిస్తోంది.
- J Y Nagi Reddy
- Updated on: Sep 20, 2026
- 10:42 am
అత్తారింటికి వెళ్లిన అల్లుడు.. పంట పొలాల్లో విగతజీవిగా మారిన యువకుడు..!
కర్నూలు జిల్లా ఆదోనిలో దారుణ హత్య వెలుగు చూసింది. అత్తారింటి వద్ద ఉంటున్న వీరేష్ అనే యువకుడు పొలాల్లో విగతజీవిగా లభించాడు. గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. హత్యకు గల కారణాలు, వెనుక ఉన్న వ్యక్తుల కోసం పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.
- J Y Nagi Reddy
- Updated on: Sep 19, 2026
- 7:30 pm
Nandyala Crime: రౌడీషీటర్ దారుణ హత్య.. కళ్లలో కారం చల్లి, పొలాల్లోకి తీసుకెళ్లి కత్తులతో దాడి!
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం పి చింతకుంటకు చెందిన రౌడీషీటర్ మిద్దె నాగార్జున దారుణ హత్యకు గురయ్యాడు. వినాయక నిమజ్జనం నుండి తిరిగి వస్తుండగా ప్రత్యర్థులు అతని కళ్ళలో కారం చల్లి, పొలాల్లోకి తీసుకెళ్లి కత్తులతో విచక్షణారహితంగా పొడిచి చంపారు. అక్రమ సంబంధం లేదా ఇతర పగలు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటన నంద్యాల జిల్లాలో తీవ్ర కలకలం రేపింది.
- J Y Nagi Reddy
- Updated on: Sep 19, 2026
- 9:50 pm
నిమజ్జనం తర్వాత ‘నా గణపతి కావాలి’ అంటూ మూడేళ్ల బాలుడి కన్నీళ్లు.. కదిలిస్తున్న వీడియో
మూడు రోజుల పాటు ఇంట్లో గణపతిని ప్రతిష్టించి భక్తిశ్రద్ధలతో పూజలు చేసిన మూడేళ్ల బాలుడు ఆర్యన్.. నిమజ్జనం తర్వాత తన గణపతి కనిపించకపోవడంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు. “నా గణపతి కావాలి” అంటూ చిన్నారి ఏడ్చిన వీడియో ప్రస్తుతం అందరినీ కదిలిస్తోంది. ..
- J Y Nagi Reddy
- Updated on: Sep 17, 2026
- 12:16 pm
రద్దీ బస్సుల్లో బంగారు నగలు కాజేసే లేడీ కిలాడీ అరెస్ట్.. సీసీ కెమెరాలతో గుట్టు రట్టు!
రద్దీగా ఉండే బస్సులు, పుణ్యక్షేత్రాలు, మార్కెట్ ప్రాంతాలను అడ్డాగా చేసుకుని ప్రయాణికుల మెడల్లోని బంగారు ఆభరణాలు, హ్యాండ్ బ్యాగులను ఏమాత్రం అనుమానం రాకుండా కాజేయడంలో సిద్ధహస్తురాలైన ఒక మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. నాలుగు పోలీస్ స్టేషన్ల పరిధిలో వరుస చోరీలతో కలకలం సృష్టించిన ఈ లేడీ దొంగ నుంచి ఏకంగా 30 తులాల బంగారు ఆభరణాలను పోలీసులు రికవరీ చేశారు. ఈ లేడి దొంగ కథేంటో తెలియాలంటే పూర్తి డిటెల్స్ లోకి వెళ్లాల్సిందే..
- J Y Nagi Reddy
- Updated on: Sep 16, 2026
- 9:26 pm
వీదికో వెరైటీ గణేష్.. ఆ నగరంలో భక్తులను ఆకట్టుకుంటున్న రంగురంగుల వినాయకులు!
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో వినాయక చవితి వేడుకలు అంగరంగ వైభవంగా, కన్నుల పండువగా సాగుతున్నాయి. వీధివీధినా కొలువుదీరిన గణపతులు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నారు. ఈసారి ఇక్కడి మండపాల్లో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాలు, భారీ సెట్టింగులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. సరికొత్త ఆలోచనలు, వినూత్న అలంకరణలతో యువకులు నెలల తరబడి శ్రమించి తీర్చిదిద్దిన రూపాలు భక్తులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి.
- J Y Nagi Reddy
- Updated on: Sep 14, 2026
- 3:12 pm