AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP News: కిలో టమాట ధర రూ.2లే.. ఆరుగాలం పండించిన పంట పశువుల పాలు! వీడియో

టమోటా ధర భారీగా కుప్పకూలింది. 25 కిలోల టమోటా బాక్సు ధర కేవలం 50 రూపాయలు మాత్రమే. అంటే కేవలం కిలో రెండు రూపాయలు అన్న మాట. ఇలాంటి పరిస్థితులలో కూలీల ఖర్చులు రవాణా ఖర్చులు కూడా రావట్లేదు. ఈ ఉద్దేశంతో పొలంలోనే పంటని గొర్రెలకు, పశువులకు మేతగా వదిలేస్తున్న దృశ్యాలు చూపరులను..

AP News: కిలో టమాట ధర రూ.2లే.. ఆరుగాలం పండించిన పంట పశువుల పాలు! వీడియో
Tomato Price Crashes In AP
J Y Nagi Reddy
| Edited By: |

Updated on: Mar 12, 2026 | 11:27 AM

Share

కర్నూలు, మార్చి 12: కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో టమోటా ధర కుప్పకూలింది. 25 కిలోల టమోటా బాక్సు ధర కేవలం 50 రూపాయలు మాత్రమే. అంటే కేవలం కిలో రెండు రూపాయలు అన్న మాట. ఇలాంటి పరిస్థితులలో కూలీల ఖర్చులు రవాణా ఖర్చులు కూడా రావట్లేదు. ఈ ఉద్దేశంతో పొలంలోనే పంటని గొర్రెలకు, పశువులకు మేతగా వదిలేస్తున్న దృశ్యాలు చూపరులను కంటతడి పెట్టిస్తున్నాయి. కోటి ఆశలతో సాగుచేసిన టమోటా పంట మరోసారి రైతులను అప్పులపాలు చేసింది. పంట చేతికి వచ్చాక టమోటాకు ధరలు లేకపోవడంతో కాయలను పొలంలోనే కోయకుండానే వదిలేశారు. ఇంకొందరు రైతులు గొర్రెలు, పశువులకు మేతగా వేస్తున్న ఘటన కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది.

కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం కేంద్రంలో చాలా మంది రైతులు ఎన్నో ఆశలతో టమోటా పంటను సాగు చేశారు. ఒక ఎకరాకు సుమారు రూ. 60 వేలు నుండి 80 వేలు పెట్టుబడి పెట్టారు. కాయలు కూడా ఎంతో బాగా పండాయి. దీంతో రైతులు ఈ సారి టమోటతో తమ జీవితాలు మారుతాయి. అనుకునేలోపు ఒక్కసారిగా టమోటా ధర అమాంతం పడిపోవడంతో టమోటా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కసారి టమోటా కాయలను ఒక్కో కూలికి రూ.300 ఇచ్చి కూలీలను పెట్టి కోయిస్తే, సుమారు ఎకరాకు మూడు వందలు బాక్స్‌లు టమోటాలు వస్తాయి. వాటిని అమ్ముకోవడానికి మార్కెట్ కు తరలించేదుకు 25 కేజీలు కలిగిన ఒక బాక్స్ కు రవాణా ఖర్చు రూ.50 అవుతుంది. తీరా మార్కెట్ కు వెళ్ళాక అక్కడ బాక్స్ వ్యాపారులు రూ.40 అడగడంతో టమోటా రైతులు లబోదిబోమంటున్నారు.

పెట్టిన పెట్టుబడి రాక, తిరిగి అమ్ముకోవడానికి మరల చేతి నుంచి డబ్బులు పెట్టుకోలేక చాలా మంది రైతులు టమోటాను పొలంలోనే వదిలేస్తున్నారు. మరికొంత మంది రైతులు గొర్రెలకు మేత గా వేస్తూ, రైతులు కంటతడి పెడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి టమోటా రైతులకు గిట్టుబాటు ధర కల్పించి, ఉల్లిని కొన్నట్టే టమోటాను కూడా ప్రభుత్వం కొనుగోలు చేసి తమను ఆదుకోవాలి రైతులు కోరుతున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్ చేయండి.

Follow Us
నిద్రలో పళ్లు కొరుకుతున్నారా? ఈ కారణాలు, లక్షణాలు తెలుసుకోండి!
నిద్రలో పళ్లు కొరుకుతున్నారా? ఈ కారణాలు, లక్షణాలు తెలుసుకోండి!
కాళ్ల నొప్పి పదేపదే వస్తుందా? ఈ 3 పోషకాల లోపం కారణం కావచ్చట!
కాళ్ల నొప్పి పదేపదే వస్తుందా? ఈ 3 పోషకాల లోపం కారణం కావచ్చట!
30 ఏళ్ల నొప్పికైనా 5 నిమిషాల్లో ఉపశమనం.. నిమ్మకాయతో ఇలా చేస్తే
30 ఏళ్ల నొప్పికైనా 5 నిమిషాల్లో ఉపశమనం.. నిమ్మకాయతో ఇలా చేస్తే
గజకేసరి రాజయోగంతో ఈ 4 రాశులకు అదృష్టం, ఊహించని ధనలాభం! మీ రాశి..
గజకేసరి రాజయోగంతో ఈ 4 రాశులకు అదృష్టం, ఊహించని ధనలాభం! మీ రాశి..
హైదరాబాద్‌కు వాటర్ అలర్ట్.. వర్షాలు పడుతున్నా నీటి భయం ఎందుకు..?
హైదరాబాద్‌కు వాటర్ అలర్ట్.. వర్షాలు పడుతున్నా నీటి భయం ఎందుకు..?
అక్క తోప్ హీరోయిన్ చెల్లి మాత్రం సినిమాలు మానేసి ఇప్పుడు ఇలా..
అక్క తోప్ హీరోయిన్ చెల్లి మాత్రం సినిమాలు మానేసి ఇప్పుడు ఇలా..
సినిమా చూస్తా.. సీఎం సార్ పర్మిషన్ ఇవ్వండి.. రేవంత్ రెడ్డికి నాని
సినిమా చూస్తా.. సీఎం సార్ పర్మిషన్ ఇవ్వండి.. రేవంత్ రెడ్డికి నాని
బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న ఒకే ఒక్క హిట్..
బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న ఒకే ఒక్క హిట్..
పసిఫిక్‌లో వేడి.. హైదరాబాద్ మార్కెట్‌లో ధరల సెగలు..
పసిఫిక్‌లో వేడి.. హైదరాబాద్ మార్కెట్‌లో ధరల సెగలు..
గణపయ్యకు 10వ రోజు పెరుగు వడ నైవేద్యం..
గణపయ్యకు 10వ రోజు పెరుగు వడ నైవేద్యం..