AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రధాన రహదారి పక్కన చిరుతపులి పిల్ల మృతదేహం కలకలం.. ఇంతకీ ఎలా జరిగింది..?

కర్నూలు జిల్లాలోని కొండల్లో చిరుత పులులు కలకలం రేపుతున్నాయి. ప్రజలను భయందోళనలకు గురిచేస్తున్నాయి. అటవీ శాఖ అధికారులు చిరుత పులల సంచారం కళ్ళ ముందే కనిపిస్తున్న ఏం చేయలేని పరిస్థితి నెలకొంది. దట్టమైన అడవులలో ఉండే పులులు కర్నూలు జిల్లా కొండ ప్రాంతాల్లోకి చేరుతున్నాయి. కొండ ప్రాంతాల ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నాయి.

ప్రధాన రహదారి పక్కన చిరుతపులి పిల్ల మృతదేహం కలకలం.. ఇంతకీ ఎలా జరిగింది..?
Leopard
J Y Nagi Reddy
| Edited By: |

Updated on: Mar 12, 2026 | 12:06 PM

Share

కర్నూలు జిల్లాలోని కొండల్లో చిరుత పులులు కలకలం రేపుతున్నాయి. ప్రజలను భయందోళనలకు గురిచేస్తున్నాయి. అటవీ శాఖ అధికారులు చిరుత పులల సంచారం కళ్ళ ముందే కనిపిస్తున్న ఏం చేయలేని పరిస్థితి నెలకొంది. దట్టమైన అడవులలో ఉండే పులులు కర్నూలు జిల్లా కొండ ప్రాంతాల్లోకి చేరుతున్నాయి. కొండ ప్రాంతాల ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నాయి. మేకలను, గొర్రెలను, కుక్కలను కోతులను, చంపి ఆకలి తీర్చుకుంటున్నాయి. చిరుత పులల దాడులతో కొండ ప్రాంతాల ప్రజలు పొలాలకు వెళ్లాలన్న మేకలను, గొర్రెలను మేపేందుకు వెళ్లాలంటే వణికిపోతున్నారు. ఎప్పుడు ఎక్కడ చిరుత పులులు ఏమి చేస్తాయేనని తీవ్ర భయందోళన చెందే పరిస్థితి కర్నూలు జిల్లాలో నెలకొంది.

తాజాగా కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గ పరిధిలో ఆస్పరి మండలం అట్టేకల్లు కొండ ప్రాంత సమీపంలోని చిరుత మృతదేహం కలకలం రేపుతోంది. కర్నూలు-బళ్లారి ప్రధాన రహదారి పక్కన ఆరు నెలల వయస్సు ఉన్న చిరుత పిల్లను గుర్తు తెలియని వాహనం డీకొట్టింది. ప్రమాదంలో చిరుత పిల్ల మృతి చెందింది. చిరుత పిల్ల మృతదేహాన్ని చూసిన వాహనదారులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఆదోని ఫారెస్ట్ రేంజ్ అధికారి తేజస్వని ఆధ్వర్యంలో సిబ్బంది అక్కడికి చేరుకుని చిరుత పిల్లను గుర్తించారు. పోస్టుమార్టం మృతదేహాన్ని ఆదోని ఫారెస్ట్ కార్యాలయానిక తరలించారు. వైద్యుల మధ్య శవ పరీక్ష నిర్వహించారు. అక్కడే అంత్యక్రియలు పూర్తి చేశారు.

ఏడాదిగా చిరుత పులుల సంచారంపై అటవీ శాఖ అధికారులకు విన్నవించుకున్న ఫలితం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా చిరుత పిల్ల కనిపించడంతో పరిసర ప్రాంతంలో దాని తల్లి ఉండే అవకాశముందని ఫారెస్ట్ అధికారులు భావిస్తున్నారు. ముఖ్యంగా ఆస్పరి మండలంలోనే కలపరి, తురువగళ్ళు, బైలు పత్తికొండ, ఐనేకల్లు, అట్టేకల్లు, తోపాటు మరో పది గ్రామాల కొండ సమీపంలో నివసిస్తున్న ప్రజలను అప్రమత్తం చేశారు అధికారులు. అసలు కొండ ప్రాంతాల్లోనికి చిరుత పులులు ఎలా చేరయో.. ఎక్కడి నుంచి వచ్చాయో అనే దానిపై వివరాలు సేకరించే పనిలో పడ్డారు అటవీ అధికారులు.

ఇదిలావుంటే, ఆదోని సమీపంలోని కుప్పగళ్ళు రైల్వే స్టేషన్ కు సమీపంలో పెద్ద కొండ ఉంది. అ కొండల్లో చిరుత పులులు ఉన్నాయని అక్కడ ప్రజలు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. అటవీ శాఖ అధికారులు చర్యలు తీసుకోలేదన్న ఆరోపణలు వచ్చాయి. 7 నెలల క్రితం మూడేళ్ల వయసు కలిగిన చిరుత పులిని కోసిగి-కుప్పగళ్ళు మధ్య రైలు డీకొట్టింది. ఈ ప్రమాదంలో పులి మృతి చెందింది. అదే ప్రాంతం లో నాలుగేళ్ల చిరుత అనుమానంగా చనిపోయింది. మరొక చిరుత పులి కూడా మరో ప్రమాదం లో మృతి చెందింది. ఇటీవల ఆస్పరి మండలం అట్టేకల్లు గ్రామ సమీపంలో ఉన్న కర్నూలు-బళ్లారి ప్రధాన రహదారి కొండ ప్రాంతంలో ఆరు నెలల చిరుత పిల్లను గుర్తు తెలియని వాహనం డీ కొట్టింది.

ఆలూరు నియోజకవర్గం పరిధిలో మొత్తం 47 గ్రామాల సమీపంలో పెద్ద పెద్ద కొండలు 12 వేల హెక్టార్లలో విస్తరించి ఉన్నాయి. ఇప్పుటికే సుమారు 18 గ్రామాల ప్రజలు ఆయా కొండ ప్రాంతాల్లో చిరుత పులుల సంచారంపై అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. తాజాగా ఘటనతో కొండ ప్రాంత ప్రజలలో తీవ్ర భయాందోళనలు నెలకున్నాయి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us