AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పల్నాడులో హత్య.. గోవాలో జాడ..! నిందితుల కోసం పోలీసుల షాకింగ్ ఆపరేషన్!

పల్నాడు జిల్లా వైసీపీ రాష్ట్ర యువజన విభాగం జాయింట్ సెక్రటరీ చెన్నారెడ్డి హత్య కేసులో నిందితుల కోసం పోలీసులు వేట కొనసాగుతుంది. ఆగస్టు నెల ఆరో తేదీన రాత్రి సమయంలో తన స్వగ్రామమైన రెంటాలకు బైక్‌పై వెళుతున్న చెన్నారెడ్డిపై దుండగులు దాడి చేశారు. దారి కాచిన ప్రత్యర్థులు కారుతో ఢీ కొట్టి అనంతరం కళ్లలో కారం చల్లి పీక కోసం హత్య చేశారు. ఈ హత్య రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది.

పల్నాడులో హత్య.. గోవాలో జాడ..! నిందితుల కోసం పోలీసుల షాకింగ్ ఆపరేషన్!
Ycp Leader Chenna Reddy Murder Case
T Nagaraju
| Edited By: |

Updated on: Aug 11, 2026 | 5:22 PM

Share

పల్నాడు జిల్లా వైసీపీ రాష్ట్ర యువజన విభాగం జాయింట్ సెక్రటరీ చెన్నారెడ్డి హత్య కేసులో నిందితుల కోసం పోలీసులు వేట కొనసాగుతుంది. ఆగస్టు నెల ఆరో తేదీన రాత్రి సమయంలో తన స్వగ్రామమైన రెంటాలకు బైక్‌పై వెళుతున్న చెన్నారెడ్డిపై దుండగులు దాడి చేశారు. దారి కాచిన ప్రత్యర్థులు కారుతో ఢీ కొట్టి అనంతరం కళ్లలో కారం చల్లి పీక కోసం హత్య చేశారు. ఈ హత్య రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది.

అయితే గ్రామంలో ఆధిపత్య పోరు కారణంగానే బంధువులే చెన్నారెడ్డిని హత్య చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో పోలీసులు కేసును సీరియస్‌గా దర్యాప్తు ముమ్మరం చేశారు. గురజాల డీఎస్పీ ఉమామహేశ్వరావు స్వయంగా విచారణ చేపట్టారు. అశోక్ రెడ్డి అనే వ్యక్తి హస్తం ఉన్నట్లు ప్రాధమికంగా అంచనాకు వచ్చినట్లు డీఎస్పీ మీడియాకు తెలిపారు. దీంతో అతని కోసం వేట మొదలైంది. సాంకేతిక ఆధారాలు సేకరించిన పోలీసులు నిందితులు గోవా పారిపోయినట్లు గుర్తించారు.

ఆరో తేదీన హత్య చేసిన వెంటనే హైదరాబాద్ వెళ్లి అక్కడ నుండి గోవాకు పారిపోయినట్లు భావిస్తున్నారు. అశోక్ రెడ్డితో పాటు రాజశేఖర్ రెడ్డి, కోటిరెడ్డి, పేరెడ్డి నలుగురు గోవాలో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు వీరిని పట్టుకునేందుకు విమానంలో గోవా వెళ్లారు. పక్కాగా ఆధారాలు సేకరించిన పోలీసులు నేరుగా అశోక్ రెడ్డి ఉన్న ప్రాంతానికి చేరుకుని అతనితో పాటు మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. అక్కడ నుండి గురజాలలోని పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు సమాచారం. అక్కడ వీరిని అన్ని కోణల్లో విచారిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

చెన్నారెడ్డి హత్య కేసులో ఎంత మంది పాల్గొన్నారు. హత్య చేసిన తర్వాత పారిపోవడానికి వాహనాలు ఎవరూ సమకూర్చారు. వీరే హత్య చేశారా లేక కిరాయి హంతకులు ప్రమేయం ఏమైనా ఉందా అన్న కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. హత్య చేసేందుకు ఆధిపత్య పోరే కారణమా లేక ఇతర అంశాలేమైనా ఉన్నాయ అని పోలీసులు ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. హత్య చేసేందుకు ఎవరైనా నిధులు సమకూర్చారా అన్న అంశాన్ని కూడా కూపీ లాగుతునట్లు తెలుస్తుంది. ఇప్పటికే మృతుడి తల్లిదండ్రులు అనుమానితుల పేర్లు పోలీసులకు అందించారు.

త్వరగా వివరాలు, ఆధారాలు రాబట్టి నిందుతులను రిమాండ్ కు తరలించేందుకు పోలీసులు సిద్దమయ్యారు. అయితే బంధువులే చెన్నారెడ్డి హత్య చేయడంపై గ్రామంలో కలకలం రేగింది. హత్యకు ప్రధాన కారణాన్ని పోలీసులు గుర్తించాల్సి ఉంది.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us